రూ. 4 లక్షల కోట్లు జమ
                  
	న్యూఢిల్లీ: నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న రూ. 500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయంపై  టెలికాం మంత్రి రవిశంకర ప్రసాద్ ప్రశంసలు కురిపించారు.  డీమానిటైజేషన్  ప్రక్రియ  ఇపుడు  ఫలితాలనిస్తోందని చెప్పారు.  ముఖ్యంగా తీవ్రవాదులు, మావోయిస్టుల ఆర్థిక మూలాలు కుప్పకూలాయనీ,  దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని  కేంద్రమంత్రి పేర్కొన్నారు. 
	 
	శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన  పెద్దనోట్ల రద్దుతో దాదాపు రూ.4 లక్షలకోట్ల నగదు బ్యాంకుల్లో జమ అయిందని చెప్పారు. ఇపుడు బ్యాంకుల్లో  మొత్తం  క్లీన్ మనీ ఉందని వ్యాఖ్యానించారు. దీంతోపాటుగా తీవ్రవాదుల నకిలీ డబ్బు ప్రవాహం నిలిచిపోయిందని సంతోషం వ్యక్తం చేశారు.  ముఖ్యంగా  మావోయిస్టులు, ఇతర తీవ్రవాదుల ఆర్థిక నడ్డి  పూర్తిగా విరిగిందని పేర్కొన్నారు.  భారతదేశ ఆర్థిక వ్యవస్థ  పుంజకుంటుంరనీ దేశంలో భద్రత మరింత బలోపేత మవుతోందని కేంద్రమంత్రి   వ్యాఖ్యానించారు.