breaking news
Royal Enfield Classic 500
-
వచ్చేస్తున్నాయ్! ఆగస్టులో రయ్‌రయ్‌మంటూ...
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశమంతా ఆగస్టులో ఆజాదీ కా అమృత్ వేడుకలకు ముస్తాబవుతోంది. మరోవైపు ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఓలా స్కూటర్ కూడా ఇదే నెలలో డెలివరీకి రెడీ అవుతోంది. ఓలాతో పాటు ఈ నెలలో రిలీజ్ కాబోతున్న ముఖ్యమైన వెహికల్స్ గురించి క్లుప్తంగా ఓలా పెరిగిన పెట్రోలు ధరలతో జనమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్తున్నారు. దీంతో లక్ష ప్రీ బుకింగ్స్ సాధించి ఓలా రికార్డు సృష్టించింది. పది రంగుల్లో వంద కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ స్కూటర్ రాబోతుందని అంచనా. ఇంకా తేది ఖరారు కానప్పటికీ ఆగస్టులోనే ఓలా స్కూటర్ రోడ్లపై పరుగులు పెడుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 సక్సెస్ ఫుల్ మోడల్ క్లాసిక్ 350కి మరిన్ని హంగులు జోడించి న్యూజెనరేషన్ మోడల్ని ఆగస్టులో మార్కెట్లోకి తెస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ తెస్తోంది. న్యూ ఇంజన్, ఫ్రేమ, టెక్నాలజీ, అధునాత ఫీచర్లను రాయల్‌ఎన్‌ఫీల్డ్ జోడించింది. ఇప్పటి వరకు ఉపయోగించిన ఇంజన్ స్థానంలో మెటియోర్ 350లో వాడే ఇంజన్‌ను ఆర్ఈ తెచ్చింది. సీటు, లైటు, హ్యాండిల్ బార్, పెయింట్ స్కీం, డిస్క్ బ్రేకుల్లో మార్పులు చేసింది. బీఎండబ్ల్యూ సీ 400 జీటీ బీఎండబ్ల్యూ మోటారడ్ నుంచి సరికొత్త సీ 400 జీటీ మ్యాక్సీ స్కూటర్ని మార్కెట్లో ప్రవేశపెట్టబోతుంది. ఈ ప్రీమియం మోడల్ స్కూటర్ ధర రూ. 5 లక్షల దగ్గర ఉండవచ్చని అంచనా. సింపుల్‌వన్ ఎమర్జింగ్ మార్కెట్‌గా భావిస్తోన్న ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది సింపుల్ వన్ స్కూటర్. ఆగస్టు 15న ఈ స్కూటర్ ఇండియా మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టీవీఎస్ ఐక్యూబ్, అథర్‌లకు పోటీగా ఇది మార్కెట్లోకి వస్తోంది. హోండా హర్నెట్ 2.0 బేస్డ్ ఏడీవీ ఈ నెలలో హార్నెట్ 2.0 ఏడీవీ మోడల్ రిలీజ్ చేసేందుకు హోండా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హోండాకి చెందిన రెడ్ వింగ్ లైన్ డీలర్షిప్ ద్వారా ఇవి మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ బైకు ధర రూ.1.20 నుంచి 1.50ల మధ్య ఉండవచ్చు. -
రాయల్ ఎన్పీల్డ్ కొత్త వేరియంట్.. రూ. 2 లక్షలు!
ధర రూ.1,93,372 ముంబై: రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ క్లాసిక్ 500 మోడల్లో కొత్త స్క్వాడ్రన్ బ్లూ కలర్ వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. భారత వైమానిక దళానికి అంకితమిస్తూ... ఈ వేరియంట్‌ను అందిస్తున్నామని రాయల్ ఎన్ఫీల్డ్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఈ డీలర్‌షిప్‌ల వద్ద ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చని రాయల్ ఎన్ఫీల్డ్ ప్రెసిడెంట్ రుద్రతేజ్ సింగ్ చెప్పారు. ధర రూ.1,93,372గా (ఆన్ రోడ్ ధర, ముంబై) నిర్ణయించామని పేర్కొన్నారు. రంగులో మాత్రమే మార్పు చేశామని మిగిలిన ఇతర అంశాల్లో ఎలాంటి మార్పులు, చేర్పుల్లేవని పేర్కొన్నారు. 500 సీసీ ఇంజిన్ ఉన్న ఈ బైక్‌లో ఎయిర్ కూల్డ్ ఇంజిన్, 5 గేర్లు తదితర ఫీచర్లున్నాయని తెలిపారు. వైమానిక దళ పోలీసులు అధికంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లను వినియోగించుకునేవారన్నారు.