రాయల్ ఎన్‌పీల్డ్ కొత్త వేరియంట్.. రూ. 2 లక్షలు!

ధర రూ.1,93,372
ముంబై: రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ క్లాసిక్ 500 మోడల్‌లో కొత్త స్క్వాడ్రన్ బ్లూ కలర్ వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. భారత వైమానిక దళానికి అంకితమిస్తూ... ఈ వేరియంట్‌ను అందిస్తున్నామని రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌ఈ డీలర్‌షిప్‌ల వద్ద ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చని రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రెసిడెంట్ రుద్రతేజ్ సింగ్ చెప్పారు. ధర రూ.1,93,372గా (ఆన్ రోడ్ ధర, ముంబై) నిర్ణయించామని పేర్కొన్నారు.
రంగులో మాత్రమే మార్పు చేశామని మిగిలిన ఇతర అంశాల్లో ఎలాంటి మార్పులు, చేర్పుల్లేవని పేర్కొన్నారు. 500 సీసీ ఇంజిన్ ఉన్న ఈ బైక్‌లో ఎయిర్ కూల్డ్ ఇంజిన్, 5 గేర్లు తదితర ఫీచర్లున్నాయని తెలిపారు. వైమానిక దళ పోలీసులు అధికంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను వినియోగించుకునేవారన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి