breaking news
rowdy sheeters arrested
-
విశాఖలో మరో గ్యాంగ్‌వార్ కలకలం
సాక్షి, విశాఖపట్నం: పుట్టిన రోజు వేడుకల్లో రౌడీషీటర్లు కత్తులు దూసుకోవడంతో విశాఖలో కలకలం రేగింది. గాజువాక సమీపంలోని పెదగంట్యాడ మండలం సీతానగరంలో జరిగిన ఈ గ్యాంగ్‌వార్ లో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. సీతానగరం ఆర్‌హెచ్ కాలనీలో మొల్లి మహేష్ అనే యువకుడు నిర్వహించిన పుట్టినరోజు వేడుకలలో రౌడీషీటర్ మొల్లి సంతోష్ పాల్గొన్నాడు. అదే వేడుకలకి వచ్చిన వడ్లపూడికి చెందిన రౌడీ షీటర్ గందవరపు తరుణ్ తో వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. వీరి మధ్య పాత గొడవలు కూడా ఉండటంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఒకరిప్తె ఒకరు దాడులకు దిగారు. (విశాఖ గ్యాంగ్‌వార్.. పోలీసులు సీరియస్) సంతోష్‌పై 12 కేసులు.. కత్తులతో రెండు వర్గాలు పరస్పరం దాడులకి ప్రయత్నించారు. సబ్బవరం మండలంలో జరిగిన వివాదమే దాడులకు కారణమని పోలీసులు చెబుతున్నారు. గాజువాక,పెదగంట్యాడ, సబ్బవరం మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, భూ తగాదాలు సెటిల్మెంట్లు చేయడం కత్తులతో దాడులు చెయ్యడం మొల్లి సంతోష్ అలియాస్ సోనాసంత్ అలవాటుగా చెబుతున్నారు. ఒక్క న్యూపోర్టు పోలీసు స్టేషన్ లోనే 12 కేసులున్నట్లు సిఐ ప్తెడిపు నాయుడు తెలిపారు. అలాగే వడ్లపూడికి చెందిన గందవరపు తరుణ్ బిటెక్ చదివాడు. హత్య కేసులో ప్రధాన ముద్దాయి, అంతేకాకుండా స్తెబర్ నేరాలు చెయ్యడంలో దిట్ట. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఫేక్ కాల్స్ చేసిన విషయంలో కేసులు నమోదయ్యాయి... అలాగే తరుణ్‌పై ఐదు కేసులున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు న్యూ పోర్టు పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
హైదరాబాద్ లో కార్డన్ సెర్చ్.. రౌడీ షీటర్ల అరెస్ట్
హైదరాబాద్: హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కార్డన్ సెర్చ్ జరిగింది. డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. మంగళహాట్, హజమ్ కేఫ్, జంజీర్ పాన్ షాప్ ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో ఏడుగురు రౌడీ షీటర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో 53 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 50 బైక్ లు, రెండు ఆటోలను సీజ్ చేసినట్లు డీసీసీ వెల్లడించారు. -
కార్డన్ సెర్చ్.. ఐదుగురు రౌడీ షీటర్ల అరెస్ట్
హైదరాబాద్: టప్పచబుత్ర జోషివాడలో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. సుమారు 150 మంది పోలీసులు ఆదివారం వేకువజాము నుంచే ఈ తనిఖీలు మొదలుపెట్టారు. తమ తనిఖీలలో భాగంగా 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఐదుగురు రౌడీ షీటర్లను అరెస్ట్ చేశారు. సరైన పత్రాలు చూపించని కారణంగా 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.