breaking news
Rooster Fights in AP
-
సంక్రాంతి కోట్లాటకు 'పుంజు'కుంటున్నాయ్
ద్వారకాతిరుమల/బుట్టాయగూడెం: సంక్రాంతి పందేలకు కోడి పుంజులు సిద్ధమవుతున్నాయి. బరుల్లో కత్తులు దూసేందుకు కఠోర సాధన చేస్తున్నాయి. ఈత, బలవర్ధక ఆహారం, ప్రత్యేక శిక్షణతో శిబిరాల్లో నువ్వా నేనా.. అన్నట్టు తలపడుతున్నాయి. పెద్ద పండగకు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. నెమలి, డేగ, అబ్రాసు, సీతువ, కాకి, పర్ల, రసంగి, కెక్కిరాయి.. ఇలా పలు జాతుల పుంజులు ‘కోట్లా’టకు రెడీ అవుతున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంట, కొమ్మర, మలసాని కుంట, ద్వారకాతిరుమల, దొరసానిపాడు, పంగిడిగూడెం, గుణ్ణంపల్లి, బుట్టాయగూడెం ప్రాంతాల్లో పుంజుల శిబిరాలు ఉన్నాయి. మెలకువలతో శిక్షణ: పందెం పుంజుల్లో పలు రకాల జాతులు ఉన్నాయి. ముఖ్యంగా డేగ, కాకి, పూల, పర్ల, కెక్కిరాయి, సీతువ, రసంగి, నెమలి బరుల్లో తలపడుతుంటాయి. లక్షలాది రూ పాయలు చేతులు మారే పందేల్లో ఆషామాషీ కోళ్లు తలపడవు. వాటికి శక్తి, సామర్థ్యం ఎంతో అవసరం. అందుకే పందెం పుంజుకు బలవర్ధక ఆహారం అందిస్తున్నారు. ప్రత్యేక తరీ్ఫదు ఇవ్వడంలో భాగంగా మెలకువలు నేరి్పస్తున్నారు. పోరాడే సత్తా ఉన్న పుంజులను ఎంపిక చేసి మరీ వాటికి శిక్షణ ఇస్తున్నారు. ఆహా ఏమి భోగం: బాదంపప్పు, జీడిపప్పు, మటన్ కైమా, తాటి బెల్లం నువ్వుల నూనె ఉండలు వంటి బలవర్ధక ఆహారాన్ని వుంజులకు అందిస్తున్నారు. వీటి పెంపకం రాజభోగాన్ని తలపిస్తుంది. ఉదయం 6 గంటలకు పందెం రాయుళ్లు వాటిని చెరువుల్లోను, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లో ఈదిస్తున్నారు. అలాగే మూలికలు, ఆకులతో మరిగించిన నీటిని వాటికి పోతపోస్తున్నారు. ఆ తర్వాత వాకింగ్ చేయించి కొద్దిసేపు ఎండలో కడుతున్నారు. 9 గంటలకు అల్పాహారంగా బాదంపప్పు, జీడిపప్పు, మటన్ కైమా పెడుతున్నారు. తాటి బెల్లాన్ని నువ్వుల నూనెతో కలిపి ఉండలుగా చేసి వాటికి తినిపిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చోళ్లు, గంట్లు, వడ్లుతో కూడిన మేతను పెడుతున్నారు. వాటికి ఎండ తగలకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలో, చెట్ల కింద ఏర్పాటు చేసిన గాబుల్లో ఉంచుతున్నారు. సాయంత్రం 6 గంటలకు పొయ్యిపై అట్లపెనం ఉంచి, దా నిపై జల్లిన వేడి నీటిని పుంజుల దేహంపై పూస్తున్నారు. ఆ తర్వాత రెవిటాల్ పంటి బలవర్దక మందులు వేస్తున్నారు. ఇలా రోజుకు ఒక్కో పుంజుకు రూ.100 వరకు ఖర్చు చేస్తున్నారు. శిబిరాల వద్ద ఒక్కో పుంజును రూ.10 వేల నుంచి రూ.లక్షకు పైగా విక్రయిస్తున్నారు. శిక్షకులకు డిమాండ్ కోడి పుంజులకు శిక్షణ ఇచ్చే వారికి డిమాండ్ ఏర్పడింది. పుంజులకు శిక్షణ ఇచ్చే వారి ఎంపిక లోనూ పందెంరాయుళ్లు జాగ్రత్తలు పాటిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి శిక్షకులను తీసుకొచ్చి, పుంజులకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. కత్తులు నూరుతూ.. పందేల్లో పుంజులకు కత్తులు కట్టే వారి హవా మామూలుగా ఉండదు. బరిని బట్టి వారు ధరను నిర్ణయిస్తారు. అస్లీ పందేలు మి నహా మిగిలిన అన్ని పందేలు కత్తిలేనిదే జరగవు. అందుకే కత్తులు కట్టేవారు ఇప్పటినుంచే కత్తులను నూరేందుకు సిద్ధమవుతున్నారు. గెలుపు మాదే.. ఏటా పందేలు జరగనివ్వమని బీరాలు పలికే పోలీసులు చివరకు రాజకీయ నా యకుల సిఫార్సులతో పండుగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలేయడం పరిపాటిగా వస్తోంది. పందేల నిర్వహణ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ బాసులు పండుగ ముందు నెల రోజుల నుంచి చెప్పడం సర్వసాధారణంగా మారింది. ఇదంతా ఏటా జరిగే తంతేనని, పండుగ రోజుల్లో పందేలు మామూలే అని పందెంరాయుళ్లు ధీమా వ్యక్తం చేస్తూ.. పుంజులను బలంగా తయారు చేస్తున్నారు. -
‘జనసేన వాళ్లమని చెప్పినా చితకబాదారు!’
ఎన్టీఆర్, సాక్షి: పండుగ పూట కూటమి నేతలు అధికార మదంతో రెచ్చిపోతున్నారు. రికార్డింగ్ డ్యాన్యుల ముసుగుతో అశ్లీల నృత్యాలను దగ్గరుండి మరీ ప్రొత్సహిస్తున్నారు. అలాగే బరుల్లో తమ ఆధిపత్యమే కొనసాగేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో దాడులకూ పాల్పడుతున్నారు. అయితే.. కోడి పందేలు కూటమి మధ్య లుకలుకలను బయటపెడుతున్నాయి. బరుల్లో తెలుగు తమ్ముళ్లు(TDP Activists) బరి తెగించేస్తున్నారు. ఎవరూ ముందుకు రాకుండా.. ఉత్త పుణ్యానికే దాడులకు దిగుతున్నారు. అయితే ‘‘ఎందుకు కొడుతున్నారు?’’ అని అడిగినందుకు కర్రలతో మూకుమ్మడి దాడి చేశారు. దాడిని అడ్డుకున్న వారి వాహనాలను సైతం ధ్వంసం చేశారు. దాడిలో ఆరుగురికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆ ఆరుగురు జనసేన కార్యకర్తలని తేలింది. కంచికచర్ల(Kanchikarla) మండలం గండేపల్లి కోడిపందేల బరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాము జనసేన వాళ్లమని చెప్పిన్నా వినకుండా దుర్భాషలాడుతూ తమను చితకబాదారని బాధితులు వాపోయారు. మరోవైపు తమ కార్యకర్తల పై జరిగిన దాడిపై జనసేన(Jana Sena) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చంద్రబాబు, పవన్‌లు 15 ఏళ్లు కలిసి పొత్తులో ఉందామనుకుంటున్నారు. కానీ టీడీపీ నేతలు అలా ఉండనిచ్చేలా లేరు’’ అని అంటున్నారు. తాజా దాడిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని జనసేన నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో కోడి పందేలు(Rooster Fightings) కూటమి నేతల మధ్య చిచ్చు రాజేస్తున్నాయి. జనసేన, బీజేపీ వాళ్లను టీడీపీ వాళ్లు ముందుకు రానివ్వకపోవడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించిన ఘటనలు.. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఇక.. ఏపీలో సాంప్రదాయ సంబరాల ముసుగులో యధేచ్ఛగా జూద క్రీడలు. కోడిపందాల బరులను ఆదాయ వనరులుగా మార్చేసుకుంటున్నారు కూటమి నేతలు. కోడి పందాల బరుల్లో వాటాల కోసం కూటమి పార్టీ ఎమ్మెల్యేలు తహతహలాడిపోతున్నారు. ఈ క్రమంలో.. తమ అనుచరులను రంగంలోకి దించుతున్నారు. ఏపీలో మునుపెన్నడూ లేనంతగా ఇష్టానుసారంగా బరులు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కోడి పందాల బరుల్లో జూదక్రీడలకు స్పెషల్ ఎరేంజ్ మెంట్స్ చేస్తున్నారు. పేకాట, గుండాట, లోన బయట , నంబర్ల గేమ్స్ కోసం కౌంటర్లు ఏర్పాటు చేయించారు. ఇక.. జూద క్రీడలకు తోడు మద్యం ఏరులై పారుతోంది. మద్యం కోసం ప్రత్యేకంగా మినీ బార్లు , బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ.. తొలి రెండు రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. మొత్తం.. ఈ పండక్కి జూదం ,మద్యం ద్వారా భారీగా సంపాదించాలని పక్కా ప్రణాళిక వేసుకున్న కూటమి నేతలు.. దానిని అంతే పక్కాగా అమలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. కోడిపందాలు , పేకాట ,గుండాటలు ఆడితే తాటతీస్తామని పండగ ముందు పోలీసులు హెచ్చరికల వరకే పరిమితం అయ్యారు. బరుల వద్ద కనీసం కనుచూపుమేరలో కూడా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కనిపించకపోవడంతో.. కూటమి నేతలతో కుమ్మక్కయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: కోడి పందేల కోసం మహిళా బౌన్సర్లు!! -
కోడి పందేలపై గంటా వివాదాస్పద వ్యాఖ్యలు


