breaking news
rooftop solar power
-
సోలార్ రూఫ్.. రేటు టాప్!
సాక్షి, అమరావతి: థర్మల్, హైడల్, విండ్, గ్యాస్, బయోమాస్ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌తో పోల్చితే.. ఇళ్ల పైకప్పులపై పెట్టుకునే సోలార్ రూఫ్‌టాప్ ఖరీదే ఎక్కువని తాజాగా ఓ అధ్యయనం తేచ్చింది. పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం కోసం ఇళ్ల పైకప్పులపై దాదాపు 40 గిగావాట్ల సౌర పలకలను అమర్చాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కలిపి రూఫ్‌టాప్ సామర్థ్యం 11 గిగావాట్లు కాగా, నివాస గృహాలపై ఉన్నది 2.7 గిగావాట్లు మాత్రమే. దీనికి కారణం ఖర్చు ఎక్కువ కావడమేనని అధ్యయనంలో వెల్లడైంది. ఏపీ సహా 21 రాష్ట్రాల్లోని 14వేల గృహాలపై అధ్యయనం చేసిన థింక్ ట్యాంక్ కౌన్సిల్ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (ఢిల్లీ) పరిశోధకులు దేశంలో సబ్సిడీలు ఇస్తున్నా సోలార్ రూఫ్‌టాప్ సిస్టం ఏర్పాటు ఇప్పటికీ ఖరీదైనదిగానే ఉందని తెలిపారు. రూఫ్‌టాప్ ఖర్చు, సబ్సిడీ ఇలా.. విద్యుత్ వినియోగదారుల్లో దాదాపు 85 శాతం మంది ఏడాదికి 1,200 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ఎవరైనా తమ ఇంటిపై రూఫ్‌టాప్ సిస్టం ఏర్పాటు చేయాలంటే ప్రతి కిలోవాట్‌కు 100 చ.అ. స్థలం ఉండాలి. ఒక కిలోవాట్‌కు రూ.50 వేలు, ఒక కిలోవాట్‌పైన 2 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కి రూ.47 వేలు, 2 కిలోవాట్ల పైబడి 3 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.45 వేలు, 3 కిలోవాట్ల పైన 10 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కి రూ.44 వేలు, 10 కిలోవాట్ల పైబడి 100 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కి రూ.38,000, వంద కిలోవాట్లపైన 500 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.36 వేలు ఖర్చవుతుంది. వీటికి అదనంగా దరఖాస్తు రుసుం 5 కిలోవాట్ల వరకు రూ.1,000, ఆ పైన రూ.5వేలు చొప్పున చెల్లించాలి. మీటరింగ్ చార్జీలు అదనం. ఈ ధరలు చెల్లించిన వారికి సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ల రూపకల్పన, సరఫరా, ఏర్పాటు చేసి ఇవ్వడంతో పాటు బీమాతో సహా ఐదేళ్ల వారంటీ లభిస్తుంది. 3 కిలోవాట్ల వరకు 40%, 3 కిలోవాట్ల పైబడి 10 కిలో వాట్ల కంటే ఎక్కువ సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలపై 20% సబ్సిడీ వస్తుంది. రూఫ్‌టాప్ సోలార్ యోజన స్కీం ను 2026 మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది. మన దగ్గర మెరుగు ప్రజలు తమ గృహ, వాణిజ్య అవసరాలకు సౌర విద్యుత్‌ను వినియోగించుకునేందుకు వీలుగా సోలార్ రూఫ్ టాప్ పాలసీ(ఎస్ఆర్టీ)ని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. దీనికి అనుగుణంగా ఎవరైనా తమ నివాస, వాణిజ్య భవనంపై సోలార్ పలకలు పెట్టుకోవచ్చు. సోలార్ పలకలు బిగించాక ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వారి అవసరానికి వాడుకోగా, మిగిలినది గ్రిడ్‌కు ఎగుమతి చేయొచ్చు. దానిని డిస్కంలు తమ మీటరు ద్వారా రికార్డ్ చేస్తాయి. వినియోగదారుడు ఎగుమతి చేసిన యూనిట్లకు ఏపీఈఆర్సీ నిర్ణయించిన పూల్ కాస్ట్ ధర(రూ.4.60 పైసలు)ను డిస్కంలు చెలి్లస్తున్నాయి. దీనివల్ల రూఫ్‌టాప్ నిర్వాహకులకు ప్రయోజనం చేకూరుతోంది. అటు డిస్కంలు కూడా నెట్ మీటరింగ్ ద్వారా రూఫ్‌టాప్ సోలార్ సిస్టంల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ‘రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్ (ఆర్పీఓ) లక్ష్యంలో చూపించుకునే వెలుసుబాటు మన రాష్ట్రంలో ఉంది. -
సోలార్ రాయితీకి రూ 5వేల కోట్లు
-
విశాఖలో రూఫ్‌టాప్ సోలార్ ఎక్స్పో 2015
ఈ నెల 22 నుంచి 3 రోజులపాటు నిర్వహించనున్న ఏపీఈపీడీసీఎల్ సాక్షి, విశాఖపట్నం: సౌర విద్యుత్‌పై ప్రజల్లో అవగాహనను పెంచి, ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) విశాఖలో ఈ నెల 22,23,24 తేదీల్లో 'రూఫ్‌టాప్ సోలార్ ఎక్స్పో'నిర్వహించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో విశాఖ బీచ్‌రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో జరిగే ఈ ఎక్స్‌పోలో సోలార్ విద్యుత్ వినియోగం,లాభాలు, ఉత్పత్తి, అమ్మకం వంటి అంశాలపై పలు ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సోలార్ విద్యుత్ రంగంలో నిష్ణాతులైన పంపిణీదారులు, ఉత్పత్తిదారులు, సాంప్రదాయేతర ఇంధన వనరుల విభాగానికి చెందిన నిపుణులు ఈ మూడు రోజుల ఎక్స్‌పోలో పాల్గొంటారు. సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు, ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చే బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల వారు ప్రజలకు సలహాలు, సూచనలు అందిస్తారు. దేశంలో తొలిసారిగా భారీస్థాయిలో నిర్వహిస్తున్న ఈ సోలార్ ఎక్స్పో సందర్భంగా చిన్నారులకు, యువతకు సోలార్ ఎనర్జీపై వివిధ పోటీలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక పోటీలు జరుగుతాయి. 17లోగా రిజర్వ్ చేసుకోవాలి: సోలార్ ప్రదర్శనలో పాల్గొనదలిచిన ఉత్పత్తి, విక్రయదారులు ఈ నెల 17వ తేదీలోపు నిర్ణీత రుసుము చెల్లించి రిజర్వ్ చేసుకోవాలని సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్(కమర్షియల్, ఆర్ఎ,పిపి) బి.రమేష్‌ప్రసాద్ తెలిపారు. మరిన్ని వివరాలకు 9490608195, 9440812384 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.