breaking news
rokalibanda
-
ఆర్భాటపు పెళ్లికి ఒప్పుకోలేదని..
కర్నూలు (టౌన్): ఉన్నత చదువు చదివాడు.. లాయర్ వద్ద గౌరవ ప్రదమైన ఉద్యోగం చేస్తున్నాడు.. సమాజంలో మంచిని పెంపొందించాల్సిన ఆ యువకుడు విక్షణ కోల్పోయాడు. పెళ్లి ఆర్భాటంగా చేసేందుకు ఒప్పుకోలేదని తల్లిని రోకలిబండతో బాది హత్య చేశాడు. ఈ దారుణం కర్నూలు నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని తారకరామ నగర్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. భర్త లేకపోయినా లక్ష్మీదేవి (45) తన ఇద్దరు కుమారులను పెంచి పెద్దచేసింది. పెద్ద కుమారుడు రామగిరేంద్ర ఎంఏ వరకు చదివి ఇటీవల లాయర్ వద్ద పనిచేస్తున్నాడు. ఆదోని మండలం ఇలిగేరి గ్రామానికి చెందిన యువతితో ఈ యువకుడికి పెళ్లి చేయాలని బంధువులు నిశ్చయించారు. బాగా ఖర్చు పెట్టి పెళ్లి చేయాలని తల్లి లక్ష్మీదేవితో గురువారం ఇంట్లో కుమారుడు గొడవ పడ్డాడు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని తల్లి మందలించడంతో రామగిరేంద్ర క్షణికావేశానికి గురై పక్కనే ఉన్న రోకలి బండతో తలపై మోదాడు. దీంతో అమె అక్కడి కక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి మరిది శేషగిరి నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, హత్య కేసు నమోదు చేశారు. కాగా..గురువారం సాయంత్రం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. -
కొడుకుతో కలిసి భర్తను హతమార్చింది
ఖమ్మం(మధిర): మధిర పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. మీరమ్మ అనే మహిళ తన కుమారుడితో కలిసి భర్త రాళ్లకంటి ప్రకాశరావు(55)ను రోకలి బండతో మోది పాశవికంగా హత్యచేసింది. భార్య, కుమారుని దాడిలో భర్త అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోకలిబండతో మోది భార్య హత్య
పెదకాకాని అనుమానం పెనుభూతమైంది. కసిపెంచుకున్న భర్త నిద్రిస్తున్న భార్య తలపై రోకలిబండతో మోది కిరాతకంగా హతమార్చిన ఘటన ఆదివారం అర్ధరాత్రి మండల కేంద్రం పెదకాకానిలోని అంబేద్కర్‌నగర్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో పల్లె ఉలిక్కిపడింది. ఏంజరిగిందో తెలుసుకునేసరికే మంచంపై రక్తపుమడుగులో పిచ్చమ్మ(50) శాశ్వత నిద్రలోకి జారుకోగా.. ఆమె భర్త నిరంతరావు ‘నేనే చంపానంటూ’ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అంబేద్కర్‌నగర్‌లో మాతంగి నిరంతరావు, పిచ్చమ్మ అలియాస్ సౌభాగ్యమ్మ దంపతులు నివశిస్తున్నారు. నిరంతరావు ఆటోనగర్‌లో బల్ల రిక్షా బాడుగకు తిప్పుతుండగా, పిచ్చమ్మ కూలి పనులకు వెళుతుంది. వారికి ఇద్దరు కుమారులు మరియదాసు, నరసింహారావు, ఇద్దరు కుమార్తెలు చంద్రమ్మ, మరియమ్మ ఉన్నారు. నలుగురికీ పెళ్లిళ్లు అయ్యాయి. వారు స్థానికంగానే నివాసం ఉంటున్నారు. మరియమ్మకు భర్త చనిపోవడంతో ఇద్దరు సంతానంతో తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిమందు పూరింట్లో ఓ భాగంలో నివసిస్తోంది. మరియదాసు కుటుంబం మరోభాగంలో ఉంటోంది. నిరంతరావు ఈ మధ్యకాలంలో తన భార్య పిచ్చమ్మపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో భార్య నిద్రలో ఉండగా.. అర్ధరాత్రి భర్త నిరంతరావు రోకలిబండ తీసుకుని తలపై గట్టిగా మోదడంతో బాధితురాలు పెద్దగా కేకలు వేసింది. అదే ఇంట్లో నిద్రిస్తున్న మనవడు ప్రశాంత్ భయంతో ఎదురుగా పూరింట్లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు పరుగుతీశాడు. వారు వచ్చి చూసేసరికి మంచంపై పిచ్చమ్మ రక్తపు మడుగులో మృతిచెంది ఉంది. అప్పుడే బయటకు వెళ్లిన నిరంతరావు నేరుగా పెదకాకాని పోలీసుస్టేషన్‌కు వెళ్లి.. తన భార్యను చంపానంటూ లొంగిపోయాడు. సోమవారం ఉదయం గుంటూరు అర్బన్ జిల్లా నార్త్ జోన్ (మంగళగిరి) డీఎస్పీ ఎం.మధుసూదనరావు, సీఐ కొకా శ్రీనివాసరావు సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.