రోబోల ప్రపంచం..
ఇది ప్రపంచంలోనే తొలి రోబోటిక్ థీమ్ పార్క్ డిజైన్. రోబోల ప్రపంచమన్నమాట. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో దీన్ని నిర్మించనున్నారు. ఇక్కడ ఉండే రోలర్‌కోస్టర్, వాటర్ పార్క్, నైట్ క్లబ్‌లు, సినిమా హాళ్లు, మోనో రైలు అన్నీ రోబో థీమ్‌తోనే ఉంటాయి. అంతేకాదు.. అక్వేరియంలో తిరిగేవి కూడా రోబో చేపలే. ఈ థీమ్ పార్క్‌లో ఉండే షాపుల్లో అత్యాధునిక రోబోలను అమ్ముతారు. రోబోటిక్ ఇంజనీరింగ్‌లో శిక్షణ పొందేవారి కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ రోబోటిక్స్ స్కూల్ కూడా ఉంటుంది.
ఇక పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో రోబోల తయారీని మనం చూడొచ్చు. 13 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మితమయ్యే ఈ రోబోటిక్ పార్క్ 2016లో ప్రారంభమవనుంది. దీనికయ్యే వ్యయం రూ.4,000 కోట్లు! దక్షిణ కొరియా ప్రభుత్వంతోపాటు మరికొన్ని ప్రైవేటు సంస్థలు నిధులను సమకూరుస్తున్నాయి.