breaking news
riyaz ahmed
-
నేను పీకే తాలుకా.. తలచుకుంటే లేపేస్తా...!
డాబాగార్డెన్స్(విశాఖపట్నం): నేను పవన్ కల్యాణ్ తాలూకా? నీవెవ్వడివిరా? నేను తలచుకుంటే లేపేస్తా.’ అంటూ ఓ వైద్యుడిపై పీకే అభిమాని విరుచుకుపడ్డాడు. ఆ వైద్యుడు కన్నీటితో తన ఆవేదనను సాక్షి వద్ద వెలిబుచ్చాడు. ఏం జరిగిందో ఆయన మాటల్లోనే..పాతనగరం ఫిషింగ్ హార్బర్ వద్ద హోమియో క్లినిక్ నడుపుతున్నా. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో క్లినిక్ మూసి, ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ అభాగ్యురాలు తన చంటి పిల్లలతో మండుటెండలో ఆకలితో అలమటిస్తుంటే.. బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ ఇచ్చాను. ఆనందంగా స్వీకరించిన పిల్లలు సమీపంలోని మరిడిమాంబ ఆలయం షెల్టర్ వద్దకు తినుకుంటూ వెళ్లడంతో ఓ ద్విచక్రవాహనదారుడు స్పీడ్‌గా వచ్చి సడన్ బ్రేక్ వేశాడు. ‘ఎందుకు అంత స్పీడ్? ఇది వీధి కదా.. కొంచెం నెమ్మదిగా వెళ్లొచ్చు కదా.. అని ప్రశ్నించా..అంతే ఆ యువకుడు రెచ్చిపోయి.. ‘నేను పవన్ కల్యాణ్ తాలూకా.. నీవెవ్వడివిరా నన్ను ప్రశ్నస్తున్నావ్? నేను తలచుకుంటే లేపేస్తా’ అంటూ దౌర్జన్యం చేశాడని డాక్టర్ రియాజ్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు. స్పీడ్ బ్రేకర్లు వేసుంటే సమస్యే ఉండేది కాదు.. ఈ ప్రాంతంలో ఓ వైపు మరిడిమాంబ ఆలయం.. కొంత దూరంలో యాసీన్ బాబా దర్గా ఉన్నాయి. ఇటు మరిడిమాంబ ఆలయానికి వెళ్లే భక్తులు, యాసీన్ బాబా దర్గాకు వచ్చే ముస్లింలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఇటు గుండానే వెళ్తుంటారు. ద్విచక్ర వాహన చోదకులు స్పీడ్‌గా వెళ్తున్న నేపథ్యంలో స్పీడ్ బ్రేకర్లు వేయాలని జీవీఎంసీ జోనల్ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డాక్టర్ రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. -
అవినీతికి అడ్డాగా రిక్రూట్మెంట్ సెల్
కొత్తగూడెం అర్బన్(ఖమ్మం), న్యూస్‌లైన్ : సింగరేణిలోని రిక్రూట్మెంట్ సెల్ అవినీతికి అడ్డగా మారిందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వకుం డా మిలటరీ నుంచి పారిపోయి వచ్చిన వారికి సింగరేణి సంస్థ ఉద్యోగాలు ఇస్తోందని, ఈ విషయాన్ని అడిగే వారే లేరని విమర్శించారు. గుర్తింపు సంఘానికి పక్షవాతం వచ్చిందా? లేక నాయకులు యాజమాన్యంతో మిలాఖత్ అయ్యారా అని ప్రశ్నించారు. కార్మికుల ట్రాన్స్ఫర్లలో కూడా పారదర్శకత లేదని, అండలేని కార్మికులను దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిపల్లి ఓసీపీలో కాంట్రాక్టర్‌కు అదనంగా డబ్బు చెల్లించి న జీఎంను నెల రోజుల్లోగా సస్పెండ్ చేయాల ని, విచారణ కమిటీలో నిజాయితీ అధికారుల ను నియమించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. సింగరేణి సీఎంఓ లంచాలు ఇచ్చిన వారినే అన్‌ఫిట్ చేస్తున్నాడని, అతను మానవత్వం లేని మనిషి అని ధ్వజమెత్తారు. గుర్తింపు సంఘం తగాదాలు పక్కన పెట్టి కార్మిక హక్కుల సాధనకు కృషి చేయాలని హితవు పలికారు. కార్మికులకు దీపావళి బోనస్ *40 వేలకు తగ్గకుండా ఇప్పిస్తామని హామీ ఇచ్చా రు. సమావేశంలో నాయకులు రామారావు, ప్రతాప్రావు, జమీల్, వెంకటేషం, శ్రీనివాస్, షబ్బీర్, దశరథం, వీరస్వామి, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.