సింగరేణిలోని రిక్రూట్‌మెంట్ సెల్ అవినీతికి అడ్డగా మారిందని హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు.
కొత్తగూడెం అర్బన్(ఖమ్మం), న్యూస్‌లైన్ :
సింగరేణిలోని రిక్రూట్‌మెంట్ సెల్ అవినీతికి అడ్డగా మారిందని హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వకుం డా మిలటరీ నుంచి పారిపోయి వచ్చిన వారికి సింగరేణి సంస్థ ఉద్యోగాలు ఇస్తోందని, ఈ విషయాన్ని అడిగే వారే లేరని విమర్శించారు. గుర్తింపు సంఘానికి పక్షవాతం వచ్చిందా? లేక నాయకులు యాజమాన్యంతో మిలాఖత్ అయ్యారా అని ప్రశ్నించారు. కార్మికుల ట్రాన్స్‌ఫర్లలో కూడా పారదర్శకత లేదని, అండలేని కార్మికులను దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిపల్లి ఓసీపీలో కాంట్రాక్టర్‌కు అదనంగా డబ్బు చెల్లించి న జీఎంను నెల రోజుల్లోగా సస్పెండ్ చేయాల ని, విచారణ కమిటీలో నిజాయితీ అధికారుల ను నియమించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
సింగరేణి సీఎంఓ లంచాలు ఇచ్చిన వారినే అన్‌ఫిట్ చేస్తున్నాడని, అతను మానవత్వం లేని మనిషి అని ధ్వజమెత్తారు. గుర్తింపు సంఘం తగాదాలు పక్కన పెట్టి కార్మిక హక్కుల సాధనకు కృషి చేయాలని హితవు పలికారు. కార్మికులకు దీపావళి బోనస్ *40 వేలకు తగ్గకుండా ఇప్పిస్తామని హామీ ఇచ్చా రు. సమావేశంలో నాయకులు రామారావు, ప్రతాప్‌రావు, జమీల్, వెంకటేషం, శ్రీనివాస్, షబ్బీర్, దశరథం, వీరస్వామి, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.