breaking news
rite
-
వెళ్లిపో జెట్టకమ్మ.. వెళ్లిపో..!
దారిద్య్రాన్ని కలిసికట్టుగా సాగనంపిన రైతులు ఖానాపూర్: గ్రామానికి పట్టిన దరిద్రం వదిలిపోవాలనే ఆకాంక్షతో నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, తిమ్మాపూర్గ్రామాభివృద్ధి కమిటీలు 20 ఏళ్ల కిందట వదిలేసిన ఓ ఆచారాన్ని ఆదివారం మళ్లీ పాటించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల రైతులు, ప్రజలు జెట్టకమ్మ(దారిద్య్రం) దిష్టిబొమ్మను తయారుచేసి భారీ ఊరేగింపు నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, మేళతాళాలతో ఆదివారం జెట్టకమ్మ దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం మండలంలోని మస్కాపూర్, సుర్జాపూర్ గ్రామాల ప్రజలు జెట్టకమ్మను వారి గ్రామం నుంచి శివారు ప్రాంతమైన ఖానాపూర్లో వదిలివేశారు. దీంతో ఖానాపూర్ వచ్చిన జెట్టకమ్మను వీడీసీల ఆధ్వర్యంలో ఖానాపూర్ మీదుగా శివారులోని దిలావర్పూర్ పొలిమేరలోకి ఇక్కడి రైతులు పారద్రోలారు. దశాబ్దాలుగా వస్తున్న ఆచారంలో భాగంగా సుమారు 20 సంవత్సరాల తరువాత ఈ కార్యక్రమం నిర్వహించినట్లు గ్రామపెద్దలు తెలిపారు. కొందరు మగవాళ్లు ఆడవాళ్ల వేషధారణతో పాల్గొన్నారు. -
రైట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
కామారెడ్డి: పట్టణంలోని రైట్ శిక్షణ కేంద్రం ద్వారా ఔత్సాహికులకు సెల్ఫోన్ రిపేరింగ్, ఫ్రంట్ ఆఫీస్, బ్యుటీషియన్, కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు డైరెక్టర్ రాజేంద్రకుమార్ తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి రాష్ట్రప్రభుత్వం ద్వారా ఆమోదం పొందిన సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. శిక్షణ మూడు నెలల పాటు కొనసాగుతుందని, ఆసక్తి గల వారు ఇతర వివరాలకు 85004 42499, 85199 11370 నెంబర్లను సంప్రదించాలన్నారు. న్యాక్ కేంద్రంలో టైలరింగ్.. డిప్యూటీ డీఈవో కార్యాలయ ఆవరణలోగల న్యాక్ కేంద్రంలో ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్ కేంద్రం డైరెక్టర్లు రమేశ్, జీవన్, భక్తమాల తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రులు లేబర్కార్డులో పేర్లు నమోదు చేసుకుని ఉండాలని, 18నుంచి 35ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. టైలరింగ్తో పాటు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, ఫ్లంబింగ్, శానిటేషన్ రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివారలకు 99891 52024, 95813 21409 నెంబర్లను సంప్రదించాలన్నారు.