breaking news
revant
-
త్వరలో చెబుతా!
‘‘నేను జర్నలిస్ట్‌గా పని చేశా. నాన్నగారు (యలమంచిలి సాయిబాబు) ‘శ్రీరామరాజ్యం’ సినిమా నిర్మించారు. నేను హీరోగా నటించిన ‘ఇంటింటా అన్నమయ్య’ విడుదల ఆలస్యం కావడంతో కాస్త నిరాశ పడ్డా’’ అన్నారు నటుడు రేవంత్. లాస్య, శోభిత, రేవంత్, నోయల్, హేమంత్ ముఖ్య పాత్రల్లో కృష్ణ కిషోర్ దర్శకత్వంలో రాజ్‌కుమార్.ఎం నిర్మించిన ‘రాజా మీరు కేక’ ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా రేవంత్ పాత్రికేయులతో మాట్లాడారు.‘‘ఈ చిత్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే మధ్య తరగతి యువకుడిగా కనిపిస్తా. నేను, నా స్నేహితులు కుటుంబానికి విలువ ఇస్తుంటాం. మన వ్యవస్థలోని ఓ సమస్యను మేం ఎలా పరిష్కరించామన్నదే కథ. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాలో ఉంది. కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించా. దర్శకునికి కథపై ఉన్న పట్టు, స్క్రీన్‌ప్లే నచ్చింది. నిర్మాతగారు అందరికీ స్వేచ్ఛ ఇవ్వడంతో సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. నా తర్వాతి చిత్రం గురించి త్వరలోనే చెబుతా’’ అన్నారు. -
యష్, రేవంత్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: యష్ కపాడియా (164 బంతుల్లో 199 నాటౌట్; 33 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతమైన సెంచరీకి తోడు బి. రేవంత్ (84 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకం సాధించడంతో అంతర్ పాఠశాలల క్రికెట్ టోర్నమెంట్లో శ్రీచైతన్య టెక్నో స్కూల్ మరో విజయం సాధించింది. అండర్-16 కోకాకోలా కప్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీచైతన్య 221 పరుగుల తేడాతో కేవీ బొల్లారంను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చైతన్య 48 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. అనంతరం కేవీ బొల్లారం 28 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్ కుమార్ (46), అంకిత్ కుమార్ (36) ఫర్వాలేదనిపించారు. ఈశ్వరరావు 38 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు సెయింట్ మేరీస్ జేసీ యూసుఫ్‌గూడ 80 (చందన్ 3/10); వెస్లీ జేసీ 83/0 (శ్రీనాథ్ 44 నాటౌట్, శ్రీకాంత్ రెడ్డి 30 నాటౌట్). జాన్సన్ గ్రామర్ స్కూల్ 152 (సన్నీ లఖాని 56, గౌతమ్ 30); ఓబుల్ రెడ్డి హెచ్ఎస్ 108 (సాకేత్ 44 నాటౌట్, రాహుల్ 35, నిఖిల్ 3/13, సన్నీ లఖాని 3/33). డీఏవీ పబ్లిక్ స్కూల్ 64 (సమీ 4/15, విప్లవ్ 3/17); హెచ్‌పీఎస్ బేగంపేట్ 69/4 (కృష్ణ 31 నాటౌట్). ఆల్‌సెయింట్స్ 153 (అంకుశ్ 3/25, శ్రీనాథ్ 3/26); లయోలా అకాడమీ జేసీ 90 (శ్రీనాథ్ 39, హితేశ్ యాదవ్ 3/32). సెయింట్ జాన్స్ చర్చ్ జేసీ 265/7 (శిరీష్ గౌడ్ 79, భగత్ 70, నిఖిల్ పర్వాణి 44, అజయ్ 3/41); జూబ్లీహిల్స్ హెచ్ఎస్ 101 (సాయితేజ 46). సెయింట్ మేరీస్ జేసీ బషీర్‌బాగ్ 290/9 (అక్షయ్ కుమార్ 72, రుత్విక్ 67, దుర్గేశ్ 57, నిఖిల్ కుమార్ 3/41); గురుకుల్ విద్యాపీఠ్ 167 (ఆశ్రీత్ 32, షాబాజుద్దీన్ 4/25, అజయ్ కుమార్ 3/32).