breaking news
Rescue Alive
-
‘ఆ మంత్రమే నన్ను బతికించింది’.. నేపాల్ టన్నెల్ రెస్క్యూలో అద్భుతం!
ఖాట్మండ్: హిమాలయాలను ముంచెత్తిన జలప్రళయం నేపాల్‌ను తీవ్ర అల్లకల్లోలానికి గురిచేసింది. ఈ విలయం మధ్య త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్లో సాగిన మృత్యుపోరాటం ప్రతీ ఒక్కరిని విస్తుపోయేలా చేస్తోంది. ఊపిరాడని ఆ మృత్యుకూపంలో, తిండి నీరు లేక 9 రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోరాడిన ఇద్దరు కార్మికులు అద్భుత రీతిలో సురక్షితంగా బయటపడ్డారు. ఆ చీకటి నరకంలో నిరంతరం జపించిన ఆ పవిత్ర మంత్రమే తనను బతికించిందంటూ బాధితుడు కన్నీటిపర్యంతమైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆగస్టు 26 నేపాల్-టిబెట్ సరిహద్దులోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో సంభవించిన తీవ్రమైన కొండచరియలు, మంచుచరియలు విరిగిపడటంతో ఉత్తర, మధ్య నేపాల్ తీవ్రమైన ఆకస్మిక వరదల్లో చిక్కుకుంది. లంగ్టాంగ్ జాతీయ పార్క్ వద్ద ప్రారంభమైన ఈ ప్రవాహం త్రిశూలి నది నుంచి దాదాపు 100 కిలోమీటర్ల మేర ఉధృతంగా ప్రవహించి దారంతా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.రసువా, నువాకోట్, దాడింగ్, గోర్ఖా, తనాహున్, చిత్వాన్ జిల్లాలు ఈ వరద ధాటికి సర్వనాశనమయ్యాయి. గైరోంగ్-కేరుంగ్ సరిహద్దు పోర్ట్, రోడ్లు, వంతెనలతో పాటు జలవిద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్స్ కొట్టుకుపోవడంతో వందలాది గ్రామాలు బురద, శిథిలాల కింద పూడుకుపోయాయి. అయితే, టన్నెల్లో విధి నిర్వహణలో ఉండి చిక్కుకుపోయిన కార్మికుల కోసం రెస్క్యూ టీమ్స్ చేపట్టిన గాలింపు చర్యల్లో ఒక ఊహించని అద్భుతం జరిగింది! మృత్యుకూపంగా మారిన త్రిశూలి 3ఏ ప్రాజెక్ట్ టన్నెల్ శిథిలాల నడుమ నుంచి ఇద్దరు కార్మికులు ఏకంగా 9 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడటం అందరినీ విస్తుపోయేలా చేసింది.రెస్క్యూ టీమ్స్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బురద తొలగించి, టన్నెల్ సందు గుండా 30 ఏళ్ల మెకానికల్ ఫోర్మన్ సంజయ్ షా, 45 ఏళ్ల మెకానికల్ సూపర్వైజర్ కబీర్ మహర్జన్ లను బయటకు తీశాయి. 9 రోజుల చీకటి నరకం నుంచి ప్రాణాలతో భయటపడడంపై సంజయ్ షా స్పందించారు. రెస్క్యూ సిబ్బంది ‘నన్ను కాపాడినప్పుడు నా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇది నాకు పునర్జన్మ అని భావోద్వేగానికి గురయ్యాడు. కబీర్ మహర్జన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను నేపాల్ ఆర్మీ హెలికాప్టర్లో ఖాట్మండ్ సైనిక ఆసుపత్రికి తరలించగా, సంజయ్ షా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ సందర్భంగా సంజయ్ షా తనకు ఎదురైన భయానక క్షణాలను వివరిస్తూ..‘నేను కంట్రోల్ రూమ్‌లో ఉన్నప్పుడు వరద నీరు ఒక్కసారిగా టన్నెల్లోకి దూసుకొచ్చింది. నా బాధ్యత ఇతరుల ప్రాణాలు కాపాడటం. అందుకే అందరినీ వెంటనే బయటకు పరిగెత్తమని కేకలు వేశాను. అందరూ సురక్షితంగా బయటకు వెళ్లేలా చూసే క్రమంలో నేను వెనకబడిపోయాను. అప్పటికే టన్నెల్ ద్వారాలన్నీ నీరు, బురదతో పూర్తిగా మూసుకుపోయాయి.చీకటి, తాగునీరు, ఆహారం లేని ఆ 9 రోజులూ నన్ను బతికించింది కేవలం దైవచింతనే. నిరంతరం ‘హరే కృష్ణ’ మహామంత్రాన్ని జపిస్తూ ధైర్యాన్ని కూడగట్టుకున్నాను’ అని అన్నారు. విశేషమేమిటంటే వారు సురక్షితంగా బయటపడిన రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి కావడం విశేషం.తనకు సమీపంలో మరో 3-4 మంది కార్మికుల శబ్దాలు వినబడ్డాయని, అయితే టన్నెల్ చాలా పొడవుగా ఉండటంతో పవర్‌హౌస్ వైపు మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని సంజయ్ చెప్పాడు. నేపాల్ ఆర్మీ, నేపాల్ పోలీస్, సశస్త్ర సీమా బల్, భారత టన్నెల్ నిపుణుల బృందాలు సంయుక్తంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో టన్నెల్లోకి ప్రవేశించి మిగిలిన వారి కోసం సహాయక చర్యలను మరింత వేగవంతం చేశాయి. -
ఆస్ట్రేలియాలో కిడ్నాప్‌కు గురైన 4 ఏళ్ల చిన్నారి.. 18 రోజుల పాటు గాలింపు
-
18 రోజుల పాటు గాలింపు.. ఆ పాపను చూసి ఏడ్చిన అధికారులు
సిడ్ని: ఆస్ట్రేలియాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి క్లియో స్మిత్‌ని చూసి ఆమె కుటుంబ సభ్యులతో పాటు.. పోలీసులు, డిటెక్టివ్లు, చుట్టుపక్కల ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. చిన్నారిని చూసి వారికి కన్నీళ్లు ఆగలేదు. కాకపోతే అవి ఆనందబాష్పాలు. ఎందుకంటే 18 రోజుల కిత్ర కిడ్నాప్‌కు గురైన క్లియో స్మిత్(4).. క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఇన్ని రోజులు క్లియో కోసం కన్నీరుమున్నిరుగా విలపించిన వారంతా ఇప్పుడు సంతోషంతో ఏడుస్తున్నారు. క్లియో కిడ్నాప్ వ్యవహారానికి వస్తే.. ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతానికి చెందిన క్లియో.. సుమారు 18 రోజుల క్రితం తన తల్లిదండ్రులతో కలిసి పిక్నిక్కు వెళ్లింది. రాత్రి తన టెంట్లో నిద్రిస్తుండగా దుండగుడు క్లియోని కిడ్నాప్ చేశాడు. ఉదయం నిద్రలేచిన క్లియో తల్లిదండ్రులకు ఆమె కనిపించలేదు. ఆ ప్రాంతం అంత వెదికారు. ఎక్కడా క్లియో జాడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి: నెల క్రితం కిడ్నాప్.. ఇప్పుడు ఎముకల గూడుగా.. ) క్లియో తల్లిదండ్రులు తమ కుమార్తె ఆచూకీ చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. ముక్కుపచ్చలారని పసికందు కిడ్నాప్ వ్యవహారం ప్రతి ఒక్కరిని కదిలించింది. క్లియో క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్లియో తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు జనాలు. కేసు సీరియస్‌గా మారడంతో పోలీసులు దీన్ని సవాలుగా తీసుకున్నారు. క్లియో పిక్నిక్ వెళ్లిన ప్రాంతం, ఆ చుట్టుపక్కల ప్రదేశాలను జల్లెడ పట్టారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో ఆశ వదిలేసుకున్నారు. చివరకు డిటెక్టివ్‌ల సాయం తీసుకున్నారు. అయితే క్లియో ప్రాణాలతో ఉంటుందని ఎవరికి నమ్మకం లేదు. దుర్వార్తే వినాల్సి వస్తుందని భావించారు. (చదవండి: తొమ్మిది రోజులైనా కానరాని జాడ.. డానియెల్ ఎక్కడ?) ఈ క్రమంలో సుమారు 18 రోజుల తర్వాత క్లియోని కిడ్నాప్ చేసిన వ్యక్తి గురించి.. అతడి స్థావరం గురించి పోలీసులుకు సమాచారం తెలిసింది. ఎంతో చాకచక్యంగా నిందితుడు ఉండే ప్రాంతాన్ని చుట్టుమట్టారు పోలీసులు. అతడి నివాసంలోకి వెళ్లారు. అక్కడ ఓ గదికి తాళం వేసి ఉండటం గమనించారు. దాన్ని పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. వారి ఎదురుగా క్లియో. ఒక్కనిమిషం పాటు అధికారులకు నోటమాట రాలేదు. చిన్నారిని తట్టి.. ‘‘నీ పేరేంటని ప్రశ్నించగా.. నా పేరు క్లియో’’ అని చెప్పింది. వెంటనే హుటాహుటిన క్లియోని అక్కడ నుంచి కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. 18 రోజుల పాటు కిడ్నాపర్ చెరలో ఉండటం అంటే మామూలు విషయం కాదు. పెద్దవారే ఎంతో భయపడతారు. (చదవండి: వందల కోట్ల రూపాయల ఆస్తి.. వృద్ధుల కిడ్నాప్) కానీ చిన్నారి క్లియో ఏమాత్రం బెదరకుండా.. ధైర్యంగా ఉండటం చూసి పోలీసులు, డిటెక్టివ్లు ఆశ్చర్యపోయారు. చిన్నారిని చూసి వారు ఒక్కసారిగా ఏడ్చేశారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక క్లియో క్షేమం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు చిన్నారి తల్లిదండ్రులు. చదవండి: 22 ఏళ్ల క్రితం.. పునీత్ రాజ్‌కుమార్ తండ్రిని కిడ్నాప్ చేసిన వీరప్పన్ The moment Cleo was rescued 👏 pic.twitter.com/arusYi9kCa — WA Police Force (@WA_Police) November 3, 2021 -
శిధిలాల నుంచి సజీవంగా.. 105ఏళ్ల వృద్ధుడు
కాఠ్మండూ: అదృష్టం, ఆయుష్షు ఉండాలే కానీ పెను విపత్తు కూడా ఏమీ చేయలేదు! శిథిలాల కింది చిక్కుకుపోయిన 105 ఏళ్ల వృద్ధుడు 8 రోజులపాటు మృత్యువుతో పోరాడి సురక్షితంగా బయటపడ్డాడు. భూకంపం ధాటికి మరుభూమిగా మారిన నేపాల్‌లో ఈ సంఘటన వెలుగు చూసింది. 8 రోజుల క్రితం సంభవించిన భారీ భూకంప ప్రభావానికి నేపాల్‌లో 7 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ పెను విషాదం నుంచి నేపాల్ ఇంకా కోలేకోలేకపోతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం నువకోట్ జిల్లా కిమ్ టంగ్ గ్రామంలో శిథిలాలను తొలగిస్తుండగా, ఫంచు ఘలె అనే శతాధిక వృద్ధుడు శిథిలాల కిందపడిఉన్నాడు. భూకంపం ధాటికి ఫంచు ఇళ్లు నేలమట్టమైంది. స్వల్పంగా గాయపడ్డ ఫంచు శిథిలాల కింద ఉన్నట్టు సహాయక సిబ్బంది గుర్తించారు. వెంటనే నేపాల్ ఆర్మీ హెలీకాప్టర్ ద్వారా ఆయనను చికిత్స నిమిత్తం త్రిశూలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఫంచు క్షేమంగా ఉన్నట్టు వైద్య వర్గాలు తెలిపాయి.


