breaking news
required
-
ఎన్నికల విధుల్లో ఎవరుంటారు? మినహాయింపు ఎవరికి?
దేశంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు వివిధ బాధ్యతలను అప్పగిస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, జాతీయ బ్యాంకులు, ఎల్ఐసీతో సహా వివిధ సంస్థల ఉద్యోగులు ఎన్నికల విధులలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ పోలింగ్ బృందాలలో ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, సెక్టార్, జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, సహాయ వ్యయ పరిశీలకులు, డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లు మొదలైనవారు ఉంటారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల బాధ్యత రాష్ట్ర పోలీసులు, సెక్టార్, జోనల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులపై ఉంటుంది. వీరు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని జిల్లాలలో ఎన్నికల నిర్వహణలో భాగస్వాములవుతారు. ఎన్నికల విధులలో నియమితులైనవారు గైర్హాజరయ్యేందుకు అవకాశం ఉండడు. విధులకు హాజరుకానివారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. కేంద్రం లేదా రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగులుగా ఉన్నవారిని మాత్రమే ఎన్నికల విధులలో నియమిస్తారు. అవసరమైతే పదవీ విరమణ తర్వాత డిప్యూటేషన్‌లో ఉన్న ఉద్యోగులను కూడా ఎన్నికల విధులలో నియమిస్తారు. కాంట్రాక్టు లేదా రోజువారీ ఉద్యోగులను ఎన్నికల డ్యూటీలో నియమించరు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో భార్యాభర్తలిద్దరికీ విధులు అప్పగించరు. దంపతుల్లో ఒకరు పిల్లలను లేదా వారి వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడానికి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగి అప్పటికే విదేశాలకు వెళ్లే ప్లాన్‌లో ఉంటే, అతను ఎన్నికల డ్యూటీ నుంచి మినహాయింపును కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇందు కోసం ముందుగా ప్రయాణాన్ని బుక్ చేసుకోవాలి. దరఖాస్తులో ప్రయాణ రుజువుగా సంబంధిత టికెట్, వీసాను జత చేయాలి. ఇదేవిధంగా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నికల విధుల నుంచి మినహాయింపును కోరవచ్చు. అయితే ఇటువంటి సందర్భంలో సంబంధిత ఉద్యోగి అవసరమైన అన్ని వైద్య ధృవపత్రాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలి. -
అన్ని పాఠశాలల్లో నిర్వహించాలి
నల్లగొండ టూటౌన్ : తెలంగాణ సిద్ధాంత కర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఈనెల 6వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలని డీఈఓ చంద్రమోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జయంతి ఉత్సహాలు నిర్వహించాలని డిప్యూటీఈఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. -
శాఖాపరమైన విచారణకు ఆదేశించాం
హోం మంత్రి జార్జ్ సాక్షి, బెంగళూరు : కాఫీ షాపులో యువతి ఫొటో తీసారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడీజీపీ రవీంద్రనాథ్‌పై శాఖ పరమైన విచారణకు ఆదేశించామని హోం మంత్రి కే.జే జార్జ్ గురువారం పరిషత్‌కు తెలియజేశారు. నాణయ్య అడిగిన ప్రశ్నతో పాటు వివిధ పార్టీలకు చెందిన సభ్యులు లేవనెత్తిన సందేహాలకు ఆయన సమాధాన మిస్తూ... ఘటనకు సంబంధించి రవీంద్రనాథ్‌కు మూడు మెమోలు జారీ చేశామని తెలిపారు. సమాధానాలు సంతృప్తికరంగాలేకపోవడం వల్ల శాఖ పరమైన విచారణకు ఆదేశించామన్నారు. ఘటన కంటే అటుపై రవీంద్రనాథ్ ప్రవర్తించిన తీరు సరిగా లేదని కే.జే జార్జ్ పరిషత్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ విషయమై పలువురు సభ్యులు మాట్లాడుతూ కులం ముసుగులో తాము చేసిన తప్పుల నుంచి బయట పడటానికి వివిధ శాఖల ఉన్నతాధికారుల ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ విషయంలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఒక్కలిగ, లింగాయత్ వర్గాలకు చెందిన వారు ఉన్నారన్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగలు కులం పేరుతో సంఘాలను ఏర్పాటు చేసుకోవడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.