breaking news
Report drought
-
డేంజర్ బెల్స్.. 2040లో మన పాలిట శాపాలివే..
మానవ జీవన శైలి కారణంగా రానున్న రోజుల్లో మరిన్ని వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. రోజురోజుకు మారిపోతున్న టెక్నాలజీలు, కొత్తగా అందుబాటులోకి వైద్య చికిత్సలు ఒకవైపు.. మారుతున్న జీవనశైలి, కాలుష్యం వంటివి మనుషుల మరణం తీరును మార్చేస్తున్నాయి.భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాద మరణాలు, టీబీ, ఎయిడ్స్ వంటివాటితో జరిగే మరణాలు బాగా తగ్గిపోతే.. అల్జీమర్స్, కిడ్నీ వ్యాధులు, డయాబెటిస్ కారణంగా మరణాలు పెరిగిపోతాయని ఓ అధ్యయనం తేల్చింది. 2016లో నమోదైన మరణాలకు (సహజ మరణాలు కాకుండా..) కారణాలను పరిశీలించడంతోపాటు 2040లో మరణాలకు కారణమయ్యే 20 ప్రధాన అంశాలను అంచనా వేసింది.ఈ నేపథ్యంలో భవిష్యత్తులో గుండె జబ్బులు, మధుమేహం, వివిధ రకాల కేన్సర్లు పెరుగుతాయని.. జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆ ముప్పును తప్పించుకోవచ్చని పేర్కొంది. సైన్స్ జర్నల్ లాన్సెట్లో ఈ అధ్యయన నివేదిక తాజాగా ప్రచురితమైంది. -
'కరువుకు పాస్వర్డ్, అనావృష్టికి కేరాఫ్ అడ్రస్'
శ్రీకాళహస్తి: కరువుకు పాస్వర్డ్, అనావృష్టికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. బుధవారం ఆమె శ్రీకాళహస్తిలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తన సొంత జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీలను మూయించేసాడని మండిపడ్డారు. ఇప్పుడు మన్నవరం ప్రాజెక్ట్ను ఇతర ప్రాంతానికి తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటివరకూ కేంద్రానికి కరువు నివేదిక ఇవ్వలేదని అన్నారు. దీనిబట్టే రైతులంటే చంద్రబాబుకు ఎంత ప్రేమో అర్ధమవుతోందని ఎమ్మెల్యే రోజా విమర్శించారు.