breaking news
rentapalla
-
లోకేష్ మనుషులు మా ఇంటికొచ్చారు: సింగయ్య భార్య
వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో ప్రమాదవశాత్తూ చీలి సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన భార్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త మృతికి తనకు అనుమానాలు ఉన్నాయన్న ఆమె.. ఈ కేసులో తమ కుటుంబంపై ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటోందని వాపోయారు. సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మరణించిన వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య భార్య లూర్దుమేరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నచిన్న గాయాలకు తన భర్త చనిపోవడం నమ్మశక్యంగా లేదని.. ఆంబులెన్స్‌లోనే ఆయనకు ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారామె. ‘‘నా భర్త మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయి. చిన్నచిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు?. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదు. ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్సులో ఏదో జరిగి ఉంటుంది. ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది’’ అని అన్నారామె.అలాగే.. పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి ఈ కేసు విషయమై తమపై ఒత్తిడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారామె. ‘‘లోకేష్ మనుషులు యాభై మంది మా ఇంటికి వచ్చారు. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారు. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు. కాగితాల మీద ఏదో రాసుకు వచ్చి సంతకాలు చేయమన్నారు. నేను అందుకు అంగీకరించలేదు. దీంతో బెదిరించారు. మరోవైపు.. పోలీసులు కూడా తన భర్తకు సంబంధించిన ఓ వీడియో చూపిస్తూ ఏవో పేపర్లపై సంతకాలు చేయమన్నారు. నా మీద, నా కుటుంబం మీద రకరకాలుగా ఒత్తిడి చేశారు. మా కుటుంబానికి జగన్ అంటే చాలా ఇష్టం’’ అని అన్నారామె. జరిగింది ఏంటంటే..జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ సింగయ్య అనే కార్యకర్త మరణించారు. జగన్ కాన్వాయ్ కారణంగానే సింగయ్య మరణించాడంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో వైఎస్ జగన్‌తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల పేర్లను నిందితులుగా చేర్చారు. అయితే.. కక్షపూరిత రాజకీయంలో భాగంగానే ప్రభుత్వం తనపై కేసు పెట్టించిందని పేర్కొంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ప్రమాదం జరిగినప్పుడు కారులో ప్రయాణికులపై కేసు ఎలా పెడతారని?.. సింగయ్య మృతికి జగన్ ఎలా కారకుడవుతారని? పోలీసులను ప్రశ్నించింది. తాజాగా మంగళవారం నాటి విచారణలో వైఎస్ జగన్ విచారణపై స్టే విధిస్తూ తాజాగా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. -
కక్ష కట్టి.. అక్రమ కేసు పెట్టి..
సాక్షి, నరసరావుపేట: ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆంక్షలు విధించినా... వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన అనుకున్నదాని కంటే ఎక్కువ విజయవంతం కావడంతో కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారు. అక్కసుతో వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కూటమి నేతల దాడులు, పోలీసుల వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ జగన్ బుధవారం పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన పర్యటన సందర్భంగా వివిధ కారణాలు చూపి వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. వీటి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతుండడం గమనార్హం. ⇒ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ షేక్ అమీనుద్దీన్ అక్రమ కేసు కట్టారు. గుంటూరు–హైదరాబాద్ హైవేలో కంటెపూడి సమీపంలో విధులు నిర్వర్తిస్తుండగా అంబటి ర్యాలీగా వచ్చారని, అనుమతులు లేవని చెప్పినా వినిపించుకోకుండా ఇనుప స్టాప్ బోర్డును నెట్టేశారని, అది నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు గన్‌మెన్ చిలకా గోపి కాలుపై పడి రక్తస్రావమైందని ప్రస్తావించారు. గోపి ఫిర్యాదుతో అంబటి, మరికొందరి పై 189(2), 223(ఏ), 121(1), 132, 324(4), రెడ్‌విత్ 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ⇒ వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనకు అనుమతి లేకపోయినా.. పెద్దఎత్తున ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చి బైక్ ర్యాలీలు చేశారని వైఎస్సార్ సీపీ నేత గజ్జల సు«దీర్‌భార్గవ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ నాగమల్లేశ్వరరావు అక్రమ కేసు నమోదు చేశారు. ప్రజా రవాణాకు ఆటంకం, బారికేడ్ల ధ్వంసం, ప్రభుత్వ ఆస్తి నష్టానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ కేసులో మరికొందరు వైఎస్సార్సీపీ నేతల పేర్లు చేర్చేందుకు పోలీసులపై కూటమి నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.నాగమల్లేశ్వరరావు తండ్రిపైనా.. రెంటపాళ్ల వీఆర్వో బూసిరాజు లక్ష్మి ఫిర్యాదు మేరకు నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు, గజ్జల సు«దీర్ భార్గవ్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరికొందరు వైఎస్సార్సీపీ నేతలపై సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో మరో అక్రమ కేసు నమోదు చేశారు. ఇరుకు సందులో ఎక్కువమందితో విగ్రహావిష్కరణ వద్దని పోలీసులు నోటీసులిచ్చినా పెద్దసంఖ్యలో జనం వచ్చేలా చేసి వారి జీవితాలను ప్రమాదంలో పడేశారని పేర్కొన్నారు. భారీ సౌండ్‌తో డీజే, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించారని తెలిపారు. ఫ్లెక్సీలు ప్రదర్శించారని... టీడీపీ నాయకుల అంతు చూస్తాం అంటూ ఫ్లెక్సీ ప్రదర్శించాడని బొల్లెద్దు రవితేజపై సత్తెనపల్లి టౌన్ టీడీపీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 352, 351(2) రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్లను ఎఫ్ఐఆర్లో పొందుపర్చారు. ⇒ వైఎస్ జగన్ పర్యటనలో అభిమానులు గజ్జల ఆసుపత్రి వద్ద రోడ్డుపై డీజే పెట్టడంతో ఇబ్బందిపడ్డామని సత్తెనపల్లికి చెందిన నూర్‌బాషా జానీబాబు ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు. డీజే సౌండ్ ఆపమన్నందుకు గుర్తుతెలియని నలుగురు తనౖపె దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింపా?: వైఎస్ జగన్
ఈ రోజు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీస్ శాఖలో ఉన్న కొందరు.. అందరూ కాదు.. కొందరికి మాత్రమే ప్రత్యేకంగా చెబుతున్నా. చూస్తూ చూస్తూ ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికీ సినిమా చూపిస్తాం. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు కుటుంబానికి చేసిన అన్యాయమే రెడ్‌బుక్ కారణంగా ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. ప్రతి గ్రామంలో కనిపిస్తున్న అన్యాయాలను చూసి, ఒకటే చెబుతున్నా. ఈ అన్యాయాల్లో మీరు భాగస్వాములు కావొద్దు. మీరు వాటిలో భాగస్వాములైతే చంద్రబాబుతో పాటు మిమ్మల్ని కూడా కచ్చితంగా బోను ఎక్కించే కార్యక్రమం చేస్తానని హెచ్చరిస్తున్నా. – వైఎస్ జగన్మోహన్రెడ్డిఏమయ్యా చంద్రబాబూ.. కమ్మవారు మా పార్టీలో ఉంటే నీకు అభ్యంతరమా? కమ్మవారు పుట్టింది కేవలం మీకు ఊడిగం చేయడానికేనా? చంద్రబాబు అన్యాయాలను ఎవరైనా వ్యతిరేకిస్తే, ప్రశ్నిస్తే.. వారిని వెంటాడి వెంటాడి, హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బనాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం.. పచ్చ మీడియా ద్వారా ట్రోలింగ్ చేయడం.. చివరకు వారంతట వారు ప్రాణాలు తీసుకునేలా అవమానించడం. ఇలా చేయడం కేవలం చంద్రబాబుకు మాత్రమే చెల్లు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు? ఏం పాపం చేశాడని ఆత్మహత్యాయత్నం చేసుకునేలా లక్ష్మీనారాయణను ప్రేరేపించారు? ఏం పాపం చేశారని మా పార్టీలో ఉన్న కమ్మ వారిపై తప్పుడు కేసులు పెట్టారు?సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో పోలింగ్ రోజు నుంచే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, సంక్షేమాభివృద్ధి అన్నది పక్కకుపోయి రెడ్‌బుక్ రాజ్యాంగం ద్వారా కక్ష సాధింపు మాత్రమే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. పోలింగ్ రోజు నుంచే రెడ్‌బుక్ రూల్ అమలవుతోందని చెప్పడానికి నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యే నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీలో కమ్మ కులస్తులు ఉండటం తప్పా? ఏం పాపం చేశారని వైఎస్సార్సీపీలోని కమ్మ నేతలను వేధిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. కమ్మవాళ్లు పుట్టింది మీకు ఊడిగం చేయడానికా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండబోదని, ఇప్పుడు తప్పు చేస్తున్న అధికారులందరికీ తమ ప్రభుత్వం వచ్చాక సినిమా చూపిస్తామని స్పష్టంచేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో గత ఏడాది ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరింపులునా పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు అన్న (కొర్లకుంట వెంకటేశ్వరరావు) సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మా పార్టీ నాయకుడు. ఈయన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. పోలింగ్‌కు ముందు టీడీపీ నేతలు వారికి అనుకూలమైన అధికారులందరికీ పోస్టింగులు ఇప్పించుకున్నారు. పోలింగ్ సమయంలో ఈ ప్రాంత ఐజీ, ఎస్పీ, సీఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేశారన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. పోలింగ్ రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అన్నది ఈ గ్రామంలో కనిపిస్తుంది. 2024 జూన్ 4న అంటే కౌంటింగ్ రోజున.. అల్లర్లు చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడంతో నాగమల్లేశ్వరరావును పోలీసులు స్టేషన్‌కు తీసుకుపోయి సెల్లో వేశారు. ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావడం మొదలు కాగానే, నాగమల్లేశ్వరరావు ఇంటిపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. అక్కడ పోలీస్ స్టేషన్లో నాగమల్లేశ్వరరావును సీఐ రాజేష్ తీవ్రంగా బెదిరించారు. ఊళ్లోకి పోవద్దని, ఊరు విడిచి పెట్టాలని, లేకపోతే రౌడీషీట్ ఓపెన్‌న్ చేయడమే కాకుండా, కాల్చి చంపుతామని హెచ్చరించాడు. జూన్ 4న కౌంటింగ్ పూర్తయినా, మర్నాడు 5వ తేదీ సాయంత్రం వరకు నాగమల్లేశ్వరరావును స్టేషన్లోనే ఉంచి అవమానించి, బెదిరించారు. చేయని నేరాలన్నీ మోపారు. ఆ రోజు రాత్రి పోలీసులు విడిచిపెట్టిన తర్వాత నాగమల్లేశ్వరరావు గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత తన తండ్రి వెంకటేశ్వర్లుకు ఫోన్‌చేసి, స్టేషన్లో పోలీసుల బెదిరింపులు, అవమానించిన తీరుతో పాటు, ఏ రకంగా కొట్టి హింసించారనేది చెప్పి, విలపించి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. దీంతో హుటాహుటిన గుంటూరు వెళ్లిన వెంకటేశ్వర్లు, కొడుకు నాగమల్లేశ్వరరావును ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ జూన్ 9న చనిపోయాడు.దీనికి బాధ్యులెవరు?నాగమల్లేశ్వరరావుకు భార్య, చిన్న పాప ఉన్నారు. వారికి ఏం సమాధానం చెబుతారని చంద్రబాబును అడుగుతున్నా. మీ పార్టీకి అనుకూలంగా లేరన్న ఒకే ఒక్క కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణం అయ్యారు. ఏడాది గడిచింది. ఈ మొత్తం కుటుంబం ఇవాళ్టికి కూడా శోకంలోనే ఉంది. మరి దీనికి బాధ్యులెవరు? వీరి ఇంటిపై రాళ్లు విసిరి, దాడి చేసిన వారిలో ఎంత మందిని అరెస్టు చేశారు? ఎంత మంది మీద కేసులు పెట్టారు? ఎంత మందికి శిక్ష విధించారు? అని అడుగుతున్నా. ఇంతగా వేధించి చంపిన ఆ సీఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని చంద్రబాబును నిలదీస్తున్నా. ఇక్కడ యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. చివరికి వెంకటేశ్వర్లు అన్న కోర్టు ద్వారా ప్రైవేటు కంప్లయింట్ ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు.చావు బతుకుల్లో గుత్తా లక్ష్మీనారాయణ ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. రెండు నెలల క్రితం ఆయనపై తప్పుడు అభియోగాలు మోపి స్టేషన్‌కు పిలిచిన సీఐ, ఎస్ఐలు ఇద్దరూ భయపెట్టే ప్రయత్నం చేశారు. అయితే వాటన్నింటికీ ఆయన గట్టిగా సమాధానం ఇవ్వడం, తమ అభియోగాలకు ఏ ఆధారం లేకపోవడంతో లక్ష్మీనారాయణను విడిచి పెట్టారు. మళ్లీ రెండు నెలల తర్వాత డీఎస్పీ హనుమంతరావు ఆయన్ను స్టేషన్‌కు పిలిపించి బెదిరించారు. ఆ డీఎస్పీ ఒక కుల ఉన్మాది. ‘అసలు మీరు పోలీసు బట్టలు వేసుకున్నారా? న్యాయం, ధర్మం కోసం నిలబడి ఉన్నారా? లేక న్యాయం, ధర్మాన్ని చంపేయడం కోసం ఉన్నారా?’ అని నేను ఆ డీఎస్పీని అడుగుతున్నా. లక్ష్మీనారాయణను స్టేషన్‌కు పిలిచిన డీఎస్పీ హనుమంతరావు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. ‘కమ్మ కులంలో పుట్టి వైఎస్సార్సీపీలో ఎలా ఉన్నావ్? ఎందుకు ఉన్నావ్?’ అంటూ కించపరుస్తూ మాట్లాడాడు. తప్పుడు సాక్ష్యాలతో జైలుకు పంపుతానని కూడా బెదిరించి, లెంపకాయలు వేసి కొట్టి అవమానించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నిస్తూ.. అన్ని వివరాలు చెబుతూ సెల్ఫీ వీడియో తీశారు. ఎలాంటి పరిస్థితుల మధ్య తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాననేది పూర్తిగా వివరించారు. పోలీసు శాఖలో కొందరు ఏ రకమైన కుల ఉన్మాదంతో పని చేస్తున్నారో.. వారిని చంద్రబాబు, లోకేశ్ లాంటి వ్యక్తులు ఎలా నడిపిస్తున్నారనేది సూసైడ్ అటెంప్ట్ వీడియోలో స్పష్టంగా చెప్పారు.సత్తెనపల్లిలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనవాహినిలో ఓ భాగం అసలు వారంతా ఏం పాపం చేశారు?⇒ మా పార్టీలో ఉన్నారనే ఏకైక కారణంతో కమ్మ వారిని వేధిస్తారా? ఏం పాపం చేశారని ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మా పార్టీ నాయకుడు వల్లభనేని వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు? ఒక కేసులో బెయిల్ వస్తే.. వెంటనే ఇంకో కేసు పెడతారు.. మళ్లీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాల్టికి దాదాపు రెండు నెలలు దాటి పోయింది. వంశీ ఇంకా చంద్రబాబు శాడిజానికి బలవుతూ జైలులోనే మగ్గుతున్నాడు. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా తప్పుడు కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు.⇒ ఏం పాపం చేశారని మా పార్టీ మాజీ మంత్రి కొడాలి నానిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు? దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై కేసులు మీద కేసులు పెడతున్నారు. ఇప్పటికే ఆయనపై తొమ్మిది కేసులు పెట్టారు. ఏం పాపం చేశారని దేవినేని అవినాష్‌ను వేధిస్తున్నారు? కేవలం కమ్మ సామాజికవర్గంలో పుట్టాడనా? అవినాష్, చంద్రబాబును వ్యతిరేకిస్తున్నాడు. చంద్రబాబుకు ఊడిగం చేయడం ఇష్టం లేదన్నాడు. ఆ ఒక్క కారణంతో అవినాష్‌పై కూడా కేసులు మీద కేసులు పెట్టి రోజూ హింసించే కార్యక్రమం చేస్తున్నారు. రోజూ కోర్టులకు పోయి బెయిల్ తెచ్చుకుని చంద్రబాబుతో యుద్ధం చేస్తున్నారు.⇒ ఏం పాపం చేశారని మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురాంపై మూడు కేసులు పెట్టారు? రఘురాం నాతో 15 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నారు. ఆయన్ను కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారు? ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను రాష్ట్రంలో వ్యాపారాలు చేసే పరిస్థితి లేకుండా వెళ్లగొట్టేశారు. తనను కూడా బెదిరించి, తప్పుడు సాక్ష్యాలతో, తప్పుడు కేసులు బనాయించి ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ⇒ మా పార్టీకి చెందిన వినుకొండ, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావుల మీద ఎందుకు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు? తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మీద అక్రమ కేసులు ఎందుకు పెట్టారు. ఆయన కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోగా కాలేజీలో తనిఖీల పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారు.⇒ మా పార్టీ సానుభూతిపరుడైనందుకు ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన సినీ నటుడు, దర్శకుడు, డైలాగు రైటర్ పోసాని కృష్ణమురళిని నెల రోజులపాటు జైళ్లలో నిర్బంధించి వేధించారు. అక్రమంగా 9 కేసులు బనాయించి శ్రీకాకుళం నుంచి కడప దాకా పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ ఏం పాపం చేశాడని ఆయనకు వైజాగ్‌లో స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చిన భూములు రద్దు చేశారు?⇒ మంగళగిరికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్‌కు అనుకూలంగా పోస్టులు పెట్టినందుకు ఆయనతో పాటు, ఆయన భార్య పాలేటి కృష్ణవేణి మీద ఏకంగా 11 కేసులు పెట్టి నెల రోజులపాటు జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజ్‌కుమార్‌ను దారుణంగా కొట్టి, చొక్కా విప్పించి లోకేశ్ ఫొటో ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి, దండం పెట్టించి ప్రాధేయపడేలా చేశారు. ఏం పాపం చేశాడని సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ మీద 19 తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పారు?మీ తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం⇒ ఏమయ్యా చంద్రబాబూ.. నువ్వు, నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5. ఒక దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకోవడం.. దోచుకున్నది పంచుకోవడం. ఇదీ, మీరంతా చేస్తున్న పని. మీరు దోచుకోవడానికి చంద్రబాబు సీఎంగా ఉండటం అవసరం. మీరంతా గజ దొంగల ముఠాగా ఏర్పడి దోచుకుంటుంటే మీ అన్యాయాలను ఏ ఒక్క కమ్మవాడైనా ప్రశ్నిస్తే చాలు.. వారి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి ఏ మాత్రం వెనుకాడని మీ నైజం చూస్తుంటే అసలు నువ్వు మనిషివేనా అనిపిస్తోంది.⇒ చంద్రబాబును ప్రశ్నిస్తే కమ్మ కులంలో తప్పు పుట్టినట్టుగా వారి మీద కక్ష కట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. చంద్రబాబును వెనకేసుకొస్తున్న ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా మొత్తం కలిసి చంద్రబాబును వెనకేసుకొస్తూ.. ఆయన్ను వ్యతిరేకించిన వారి మీద బురద జల్లుతూ అప్రతిష్టపాలు చేస్తున్న తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం కాదా?⇒ సీఐ రాజేష్ మీద నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు ప్రైవేటు కేసు వేస్తే, కోర్టు ఆదేశించినా పోలీసులు కేసు కట్టలేదు. ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రెడ్‌బుక్ రాజ్యాంగంతో పాలన చేస్తే ఈ ప్రభుత్వం నిలబడుతుందా? చంద్రబాబు పాలనలో రైతులు, చదువుకుంటున్న పిల్లలు, అక్కచెల్లెమ్మలు.. ఇలా ఎవ్వరూ సంతోషంగా లేరు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లకు అన్ని వర్గాలు బలైపోయాయి. రెడ్‌బుక్ రాజ్యాంగం, విచ్చలవిడి అవినీతితో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నాశనం అయ్యాయి. అందుకే ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదు. దేవుడు, ప్రజలు గట్టిగా మొట్టికాయలు వేసే రోజు తొందర్లోనే వస్తుంది. -
చంద్రబాబూ.. నాగమల్లేశ్వరరావు భార్యా, కూతురికి ఏం చెబుతారు?: వైఎస్ జగన్
సాక్షి, పల్నాడు: రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అనడానికి కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే నిదర్శనమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పర్యటించిన ఆయన.. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరావు ఘటనను ప్రస్తావించారు. అంతకు ముందు.. నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఏపీలో అభివృద్ధి, సంక్షేమం ఏదీ లేదు. కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోంది. దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనడానికి ఆంక్షలే నిదర్శనం. తమకు అనుకూలమైన పోలీసులను ఎన్నికల ఫలితాల వేళ నియమించుకున్నారు. కూటమిని గెలిపించుకునేందుకు అన్యాయాలు చేశారు. ఈ విషయం ఈ ప్రాంతం వారందరికీ తెలుసు. నాగమల్లేశ్వరరావు రెంటపాళ్ల ఉపసర్పంచ్. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున టీడీపీ, జనసేన నేతల తప్పుడు ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పీఎస్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఘోరంగా అవమానించారు. టీడీపీకి అనుకూల ఫలితలు రావడంతో నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు. ఊరు విడిచిపోవాలని ఆయన్ని వేధించారు. లేకుంటే రౌడీ షీట్ తెరుస్తామని సీఐ ఏకంగా బెదిరించారు. జూన్ ఐదో తేదీ రాత్రి పోలీసులు నాగమల్లేశ్వరరావును విడిచిపెట్టారు. ఆయన సరాసరి గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తన తండ్రికి ఫోన్ చేసి పోలీసులు బెదిరించిన తీరును నాగమల్లేశ్వరరావు వివరించారు. పోలీసుల తీరుతోనే నాగమల్లేశ్వరావు ఆత్మహత్యయత్నం చేశారు. తనకొడుకును కాపాడుకునేందుకు వెంకటేశ్వర్లు తీవ్రంగా యత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోలేదు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నాగమల్లేశ్వరరావును బెదిరించిన ఆ సీఐపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?. నాగమల్లేశ్వరరావుకు భార్యా, కూతురు ఉన్నారు. చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?. ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉంది అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నియోజక వర్గంలో లక్ష్మీనారాయణ అనే పార్టీ కార్యకర్తపైనా పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని, అది భరించలేక ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని జగన్ ప్రస్తావించారు. -
వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం
సాక్షి, పల్నాడు: పోలీసుల వేధింపులు భరించలేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి తమ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కచ్చితంగా వస్తారని వైఎస్సార్సీపీ నేతలు కుండబద్ధలు కొట్టారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన అనుమతి కోసం మంగళవారం నరసరావుపేటలో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. జగన్ అంటే జనం.. జనం అంటేనే జగన్. ఆయన వస్తున్నారంటే జనం ఆగరు. కానీ, జగన్ వస్తున్నారని పోలీసులు రకరకాలుగా వేధిస్తున్నారు. జగన్ పర్యటనను విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అయినా వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించడం ఖాయం’’ అని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు.కుట్ర ప్రకారమే జగన్ పర్యటన అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైనా అడ్డుకున్నామా?. మరి వైఎస్ జగన్ పర్యటన అంటే కూటమి ఎందుకు భయపడుతోంది?. నాగమల్లేశ్వరావును టీడీపీ నేతలు, పోలీసులు వేధించారు. అది భరించలేకే ఆయన సూసైడ్ చేసుకున్నారు. కూటమి సర్కార్ వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయి. ఈ అరాచక పాలన తట్టుకోలేకనే జనం రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా జగన్ పర్యటించడం ఖాయం అని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. -
పల్నాడుకు వైఎస్ జగన్.. రూట్ మ్యాప్ పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో ఈనెల 18వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా రూట్ మ్యాప్‌ను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాసు మహేష్ రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ కన్వీనర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా రాగానే అరాచకం మొదలైందని.. అందుకు నిలువెత్తు నిదర్శనం నాగమల్లేశ్వర రావు ఆత్మహత్యేనన్నారు. రాష్ట్రంలో ఏడాదిగా అరాచక పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన సాగుతోంది. కార్యకర్తలు, నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె మండిపడ్డారు.మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్తలు, నాయకులపై అక్రమంగా కేసులు పెట్టిన వారిని ఎవరిని వదలమన్నారు.మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పరాకాష్టకు చేరుకుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు.సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 18వ తేదీన సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల లో వైఎస్ జగన్ పర్యటిస్తారు. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లును పరిశీలిస్తున్నాం. -
పిడుగుపాటుతో ఇద్దరి మృతి
సత్తెనపల్లి (గుంటూరు): పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెన పల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని రెంటపాళ్ల గ్రామంలోని పంట పొలాల్లో పిడుగు పడింది. ఆ సమయంలో పొలంలో పనిచేస్తున్నఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.