breaking news
regional directors
-
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏబీసీ నెట్వర్క్ ఏర్పాటు..
అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ సమాజం, బిజినెస్ కమ్యూనిటీ నెట్‌వర్క్‌ను మరింతగా అనుసంధానిస్తూ సేవలందించేందుకు 'ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్'(AAA) మరియు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ కమ్యూనిటీ(ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ప్రాంతీయ డైరెక్టర్లను ప్రకటించాయి.ఆయా ప్రాంతాల్లో AAA, ABC రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ అభివృద్ధికి ప్రాంతీయ డైరెక్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ప్రతి ప్రాంతీయ డైరెక్టర్‌కు ఐదు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. స్థానిక నాయకత్వంతో భాగస్వామ్యం, వ్యాపారవేత్తలు–పెట్టుబడిదారులు–వృత్తి నిపుణులను అనుసంధానం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, కొత్త అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై వారు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.ఐదుగురు ప్రాంతీయ డైరెక్టర్లుబొల్లి వెంకట రామకృష్ణ (వెంకట్) – లాస్‌వేగాస్ (Las Vegas) లోని తెలుగు సమాజంలో చురుకైన సభ్యుడిగా, ఐటీ ప్రొఫెషనల్, వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్‌గా ఉన్నారు. మెంటరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వ్యాపార అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఆయనకు నార్త్ కరోలినా, నెవాడా, అలబామా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.హనుమంతు సింహబలుడు (సింహ) – ఉత్తర అమెరికా సాక్షి టీవీ చీఫ్ కరస్పాండెంట్‌గా, గతంలో UBI TV న్యూస్ డైరెక్టర్‌గా పనిచేసిన మీడియా నిపుణుడు. విశ్వసనీయ జర్నలిజం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్కు కట్టుబడి ఉన్న ఆయనకు న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, ఇల్లినాయిస్, మిస్సౌరీ రాష్ట్రాల బాధ్యతలు కల్పించారు.దొమ్మరాజు హేమంత్ వర్మ – టెక్నాలజీ, కన్సల్టింగ్, స్టార్టప్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారవేత్తగా ఉన్నారు. ERP & Automations డైరెక్టర్‌గా, వ్యూహాత్మక కన్సల్టింగ్ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా సేవలందిస్తున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సహకారం, కమ్యూనిటీ అభివృద్ధిపై దృష్టి సారించనున్న ఆయనకు పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, ఒహాయో, మసాచుసెట్స్, ఓక్లహోమా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.గొట్టిపాటి కళ్యాణ్ – 18 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఎంటర్ప్రెన్యూర్, ఐటీ ప్రొఫెషనల్. ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో అనుభవంతో పాటు వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆంధ్ర సంస్కృతిని పరిరక్షిస్తూ తెలుగు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆయనకు అరిజోనా, వాషింగ్టన్, యూటా, కొలరాడో, న్యూ మెక్సికో రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.చౌటకూరి చేతన్ రెడ్డి – ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, కన్సల్టింగ్ రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన టెక్నాలజీ ప్రొఫెషనల్. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులతో పాటు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తూ, భాగస్వామ్యాలు, అవకాశాలు, స్థిరమైన కమ్యూనిటీ ప్రభావంపై దృష్టి సారిస్తున్నారు. ఆయనకు జార్జియా (Georgia), మిషిగన్, టెన్నెస్సీ, ఫ్లోరిడా, సౌత్ కరోలినా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.నాయకత్వం, నెట్‌వర్కింగ్‌కు ప్రాధాన్యంAAA–ABC ప్రాంతీయ డైరెక్టర్లు స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్, కమ్యూనిటీ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, కొత్త భాగస్వామ్యాలు మరియు వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం చేయనున్నారు. అదేవిధంగా మెంటరింగ్, నాయకత్వ అభివృద్ధి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, బలమైన నెట్వర్క్ నిర్మాణం, కొత్త అవకాశాల సృష్టి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.స్థానిక సంస్థలు, రాష్ట్ర నాయకత్వం, వివిధ రంగాల నిపుణులతో సమన్వయం చేసుకుంటూ కమ్యూనిటీకి మరింత ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 2028–2031 కాలానికి నియమితులైన ఈ ప్రాంతీయ డైరెక్టర్ల నాయకత్వంలో AAA–ABC నెట్వర్క్ మరింత విస్తరించి, ఉత్తర అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ వర్గాలను మరింత దగ్గర చేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. -
కోర్టుకు హాజరైన ‘బొమ్మరిల్లు’ డెరైక్టర్లు
నిలదీసేందుకు ప్రయత్నించిన బాధితులు టెక్కలి,న్యూస్‌లైన్, అధిక వడ్డీలను ఆశ చూపి ఖాతాదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి కుచ్చు టోపి పెట్టిన విశాఖపట్నానికి చెందిన బొమ్మరిల్లు సంస్థ రీజనల్ డెరైక్టర్లను శుక్రవారం టెక్కలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ విషయం తెలుసుకున్న టెక్కలి సమీప ప్రాంతాలకు చెందిన బాధితులంతా కోర్టు వద్దకు చేరుకుని డెరైక్టర్లను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. అయితే గందరగోళం తలెత్తే అవకాశం ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు డెరైక్టర్లను బాధితుల కంట పడకుండా గోప్యంగా కోర్టుకు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...విశాఖపట్టణం ప్రధాన కేంద్రంగా ఉన్న బొమ్మరిల్లు సంస్థ అధిక వడ్డీలను ఆశ చూపి సామాన్యుల నుంచి కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టి సంస్థను మూసివేసిన సంగతి తెలిసిందే. విశాఖపట్టణం రీజియన్‌కు చెందిన సంస్థ డెరైక్టర్లు బాబూజీ, యర్రయ్య, శ్రీనివాసరావు, వెంకట్రావు, నారాయణరావు తదితరులను కొద్ది రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పలు పోలీసుస్టే షన్లలో కేసులు నమోదయ్యాయి. ఇదే క్రమంలో పలాస ప్రాంతానికి సంబంధించి కేసు విచారణకు విశాఖ పోలీసులు వారిని పలాస తీసుకెళ్లాలని శుక్రవారం భావించినప్పటికీ అక్కడ జడ్జి సెలవులో ఉండడంతో టెక్కలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులంతా కోర్టు వద్దకు చేరుకుని వారిని నిలదీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కోర్టులో హాజరుపరిచిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ విశాఖ సెంట్రల్ జైలుకు తరలించడంతో బాధితులు చేసేదిలేక వెనుదిరిగారు.


