breaking news
red sand smugglers
-
చిత్తూరు శేషాచల అటవీప్రాంతంలో మళ్లీ అలజడి
-
పోలీసుల అదుపులో 74 ఎర్ర కూలీలు
-
పోలీసుల అదుపులో 74మంది ఎర్ర కూలీలు
చినమండెం (వైఎస్సార్ జిల్లా): చిత్తూరు జిల్లా నుంచి వైఎస్సార్ జిల్లా రాజంపేటకు వెళుతున్న 74 మంది ఎర్ర చందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులోని వారంతా తమిళనాడుకు చెందిన వారిగా సమాచారం. వీరిని కడప జిల్లా చినమండెం పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. -
'గ్రేహౌండ్స్ తరహాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్'
తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలు కట్టిస్తామని డీఐజీ కాంతారావు హెచ్చరించారు. గ్రేహౌండ్స్ తరహాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తిరుపతిలో బుధవారం ఆయన 'సాక్షి' మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అత్యుత్తమమైన ప్రమాణాలతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటయిందని కాంతారావు తెలిపారు. తప్పు చేసిన వారి విషయంలో కూలీ నుంకి బడా స్మగ్లర్ వరకూ ఎవరినీ వదలబోమని ఆయన హెచ్చరించారు. అటవీ, పోలీసు, రెవెన్యూ, టీటీడీలతో సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ కు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను తిరుపతిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తం 483 మందితో కలిసి ఈ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని డీఐజీ కాంతారావు మీడియాతో చెప్పారు.