breaking news
ravinderrao
-
కంప్యూటరీకరణతో సేవలు వేగవంతం
టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు కరీంనగర్‌అగ్రికల్చర్ :ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కంప్యూటరీకరణతో సేవలు వేగవంతమవుతున్నాయని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుస్నాబాద్, గట్టుదుద్దెనపల్లి, చొప్పదండి, గంభీరావుపేట, రాయికల్, సుల్తానాబాద్ సంఘాల కంప్యూటరీకరణ సేవలు, అభివృద్ధిపై శనివారం సమీక్షించారు. హైదరాబాద్ నుంచి టెస్కాబ్ ఎండీ ఎన్.మురళీధర్, అడిషనల్ రిజిస్ట్రార్ సురేందర్, సీఐవో ఎం.శ్రీనివాస్‌రావు, జిల్లా నుంచి డీసీవో అంబయ్య, డీఏసీవో చంద్రప్రకాశ్ సమీక్షించారు. త్వరలోనే మరిన్ని సంఘాలను కంప్యూటరీకరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు మెుక్కలు నాటారు. బ్యాంకు ఉపాధ్యక్షుడు వుచ్చిడి మోహన్‌రెడ్డి, సీఈవో ఎన్.సత్యనారాయణ, డీజీఎంలు నారాయణ, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
'డిపాజిట్లు కూడా దక్కవు'
వరంగల్: తెలంగాణ ద్రోహుల పార్టీ అయిన టీడీపీతో జతకట్టిన బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిపాజిట్టు కూడా దక్కవని వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తక్కెల్లపల్లి రవీందర్రావు అన్నారు. వరంగల్ , ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపునకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆయనఈ సందర్భంగా పిలుపునిచ్చారు.