breaking news
Rathi Agnihotri
-
‘అర్బన్ మావోయిస్టులు’ అంటే ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో మంగళవారం ఉదయం పది మంది సామాజిక కార్యకర్తల ఇళ్లపై పోలీసులు దాడులు జరిపి వారిలో వరవరరావు సహా ఐదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఈ ఐదుగురు సామాజిక కార్యకర్తలతోపాటు భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో జూన్‌లో అరెస్ట్ చేసిన ఐదుగురు సామాజిక కార్యకర్తలను కూడా పోలీసులు అర్బన్ మావోయిస్టులు లేదా అర్బన్ నక్సలైట్లుగా వ్యవహరించారు. ఇంతకు ఈ అర్బన్ మావోయిస్టులంటే ఎవరు? వారిని ఎందుకు అలా పిలుస్తున్నారు? ఆ పదం ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? బాలివుడ్ చిత్ర దర్శకుడు, నిర్మాత, స్క్రీన్‌ప్లే రచయిత వివేక్ అగ్నిహోత్రి ‘అర్బన్ నక్సల్’ శీర్షికతో స్వరాజ్య పత్రికలో 2017, మే నెలలో ఓ వ్యాసం రాశారు. ‘అర్బన్ నక్సలైట్లంటే పట్టణాల్లో ఉండే మేధావులు. ప్రభావశీలురు. ప్రాముఖ్యత కలిగిన కార్యకర్తలు, వారు భారత దేశానికి కనిపించని శత్రువులు. రాజ్యానికి వ్యతిరేకంగా విప్లవాన్ని రాజేసేవారు’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఓ సందర్భంలో వీరిని కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ ‘హాఫ్ మావోయిస్ట్స్’గా వర్ణించారు. రహస్య కేటగిరీకి చెందిన వీరు భారత ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారులుగా ఆయన ట్వీట్ కూడా చేశారు. బహుశ ఆయన కూడా వివేక్ వ్యాసాన్ని చదివి ఉండవచ్చు! భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో జూన్ ఆరవ తేదీన న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ప్రొఫెసర్ షోమా సేన్, సామాజిక కార్యకర్తలు మహేశ్ రౌత్, సుధీర్ ధావ్లే, రోనావిల్సన్లను అరెస్ట్ చేసినప్పుడు వారిని పోలీసులు ‘అర్బన్ మావోయిస్టులు’గా పేర్కొన్నారు. బాలీవుడ్ అగ్నిహోత్రి రాసిన వ్యాసాన్ని పోలీసులు చదివి ఉన్నారా? పట్టణాల్లో నివసిస్తున్న మావోయిస్టులుగా భావించి కాకతాళీయంగానే అలా పిలిచారోమో వారికే తెలియాలి. అప్పటి నుంచి మాత్రం ‘అర్బన్ మావోయిస్టులు’ అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. -
సీనియర్ హీరోయిన్, ఆమె భర్తపై కేసు నమోదు
బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ గ్లామర్ క్వీన్‌గా వెలుగొందిన అలనాటి హీరోయిన్ రతీ అగ్నిహోత్రిపై ముంబైలోని వోర్లీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విద్యుత్ శాఖకు తప్పుడు సమాచారం ఇచ్చి 46 లక్షలకు పైగా విద్యుత్ చార్జీ కట్టకుండా తప్పించుకున్నందుకు గాను రతీ అగ్నిహోత్రితో పాటు ఆమె భర్త అనిల్ విర్వాణీలపై ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ 135 కింద కేసు నమోదు చేశారు. ముంబైలోని వోర్లీ సముద్ర తీరంలో ఉంటున్న అగ్రిహోత్రి ఇంటికి త్రీ ఫేస్ మీటర్ ఉన్నప్పటికీ., విద్యుత్ శాఖకు సింగిల్ ఫేస్ మీటర్ ఉన్నట్టుగా చూపించి తక్కువ చార్జీలను చెల్లించినట్టుగా విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ విచారణలో విద్యుత్ చౌర్యం జరిగినట్టుగా తేలటంతో అగ్నిహోత్రి దంపతులపై కేసు నమోదు చేశారు.