breaking news
Ranthambore
-
గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్‌కి..
ఈరోజుతో 2025కి గుడ్ బై చెప్పేసి..కొత్త ఏడాది 2026కి స్వాగతం పలకనున్నాం. ఈ తరుణంలో చాలామంది న్యూఇయర్ వేడుకలను మంచి సుందరమైన ప్రదేశాల్లో..సెలబ్రేట్ చేసకునేందుకు సన్నాహాలు, ప్లాన్లు వేస్తుంటారు. చాలామంది ఈపాటికి ఆయా ప్రదేశాలకు వెళ్లే హడావిడిలో ఉండి ఉంటారు కూడా. ఇక డిసెంబర్ 31 రాత్రి ఉండే సందడి, జోష్ ఓ రేంజ్లో ఉంటుంది. ఎప్పుడూ చూసే పర్యాటక ప్రదేశాలు, బీచ్‌లు, పర్వత ప్రాంతాలు కాకుండా అడవుల్లో ప్రకృతి ఒడిలో చేసుకుంటే ఆ ఫీల్ వేరేలెవెల్. దీనికి మించి బ్యూటిఫుల్ స్పాట్ ఇంకొకటి ఉండదు కూడా. అందుకోసం గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్‌కి చెక్కేయాల్సిందే. ఈ పార్క్ విశేషాలు, అక్కడ ఉండే రిసార్టులు, ప్రత్యేకతలు గురించి సవివరంగా తెలుసుకుందామా.అటవీ సఫారీలకు ప్రసిద్ధి చెందిన రణతంబోర్ నేషనల్ పార్క్ న్యూఇయర్ వేడుకలకు బెస్ట్ ప్లేష్. ఇవక్క విలాసవంతమైన రిసార్ట్‌లలో వన్యప్రాణుల నడుమ ఆ సెలబ్రేషన్స్ మరింత జోష్‌ఫుల్‌గా ఉంటుంది. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో ఉన్న రణతంబోర్ ప్రకృతి అందాలను మిళితం చేసేలా, అత్యంత ప్రైవేసిని అందించే హాలీడేస్ స్పాట్‌గా పేరొందింది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం గాంధీ కుటుంబం రణతంబోర్ నేషనల్ పార్క్ సమీపంలో సవాయి మాధోపూర్‌కు చేరుకుందని అధికారిక వర్గాల సమాచారం. ఈ కుటుంబం పులుల అభయారణ్యం సమీపంలోని ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్‌లో బస చేస్తోంది. జనవరి 2 వరకు ఈ ప్రాంతంలోనే గడపనున్నారనేది సన్నిహిత వర్గాల సమాచారం. అదీగాక ప్రియాంక గాంధీ- రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ వాద్రా తన ఏడేళ్ల స్నేహితురాలు, ఢిల్లీకి చెందిన అవివా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది న్యూయర్ వేడుకలు మరింత స్పెషల్ ప్రియాంక గాంధీ కుటుంబానికి. ప్రత్యేకతలు..పెద్దపులులకు నిలయం ఈ పార్క్. ఇక గాంధీ కుటుంబం ఈ పార్క్ సమీపంలోని ప్రత్యేకమైన లగ్జరీ సఫారీ క్యాంపులలో ఒకటైన సుజాన్ షేర్ బాగ్‌లో బస చేస్తోంది. అభయారణ్యం అంచున ఉన్న ఈ ప్రదేశం పాతకాలపు వన్య ప్రాణులకు గమ్యస్థానం. అలాగే ఇది 1920ల నాటి వలసవాద శైలి జంగిల్ క్యాంప్ లాగా ఉంటుంది. ఇక్కడ చేతితో తయారు చేసిన పది లగ్జరీ టెంట్లు, విల్లాలు కూడా ఉంటాయి. అక్కడ వ్యక్తిగత ఏకాంతానికి, విహారయాత్రకు అత్యంత అనువైనది కూడా. ప్రతి సూట్లో అత్యాధునిక సౌకర్యాలు, పూర్వకాలపు డిజైన్ల ఆకర్షణతో కట్టిపడేస్తోంది. ఇక్కడ పూర్తి ఎయిర్ కండిషనింగ్, వైఫై, వాలెట్ సేవలు, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక్క రాత్రికి బస దాదాపు రూ. 2 లక్షలు పైనే ఖర్చవుతుంది. రణతంబోర్‌లోని అత్యంత ప్రీమియం న్యూ ఇయర్ బసలలో ఒకటి ఇది. కాగా న్యూఇయర్ వేడుకలకు మంచి గమ్యస్థానమైనీ రణతంబోర్ ఉద్యానవనంని రాహుల్ సందర్శించడం రెండోసారి కాగా, ప్రియాంక-వాద్రాలకు ఇది మూడోసారి.(చదవండి: ఒకప్పుడు భిక్షాటన..ఇవాళ బిలియనీర్‌గా ఏకంగా రూ. 40 కోట్ల..!) -
‘టైగర్ మ్యాన్’: వాల్మీకి థాపర్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణ ఉద్య మకారుడు, టైగర్ మ్యాన్‌గా పేరున్న వాల్మీకి థాపర్(73) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడు తున్న ఆయన శనివారం ఢిల్లీలోని కౌటిల్య మార్గ్‌లోని సొంతింట్లో తుదిశ్వాస విడిచారు. వన్యప్రాణుల సంరక్షణ, ప్రత్యేకించి పులులను కాపాడేందుకు నాలుగు దశాబ్దాల పాటు తీవ్రంగా శ్రమించారు. అటవీ సంరక్షణలో ప్రజలను మమేకం చేసే లక్ష్యంతో 1988లో ఏర్పాటైన ప్రభుత్వేతర సంస్థ రణథంబోర్ ఫౌండేషన్‌కు థాపర్ సహ వ్యవస్థాపకుడు. సహజంగా సంచరించే ప్రాంతాల్లో పులులను అక్రమంగా వేటాడటంపై ఆయన ఉద్యమించారు. మానవ జోక్యాన్ని అడ్డుకు నేలా ప్రత్యేక టైగర్ జోన్ల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి సారథ్యంలోని నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ వంటి రమారమి 150 ప్రభుత్వ కమిటీల్లో సభ్యుడిగా సేవలందించారు. వన్యప్రాణుల గురించి టైగర్ ఫైర్, లివింగ్ విత్ టైగర్స్ వంటి 30కి పైగా పుస్తకాలను రాశారు. భారతీయ వన్యప్రాణులపై పలు డాక్యుమెంటరీలను రూపొందించారు. 2024లో జీవావరణ పరిరక్షకురాలు నేహా సిన్హా తీసిన ‘మై టైగర్ ఫ్యామిలీ’అనే డాక్యుమెంటరీలో థాపర్ కూడా ఉన్నారు. కాగా, థాపర్ తండ్రి రమేశ్ థాపర్ ప్రముఖ జర్నలిస్ట్. బాలీవుడ్ దిగ్గజ నటుడు శశి కపూర్ కుమార్తె సంజనా కపూర్, వాల్మీకి థాపర్ దంపతులు కాగా వీరికి ఒక కుమారుడు ఉన్నారు. -
‘పెద్ద’పులి మరణించింది..!
రాంథమ్‌బోర్: భారీ దేహం.. గంభీరమైన రూపం.. అది ఎదురుపడిందంటే ఫొటోగ్రాఫర్లకు పండగే. ప్రత్యేకంగా దానిని చూసేందుకే వచ్చేవారు ఎందరో! దాని పేరు.. మచ్లీ. నివాసం రాజస్థాన్‌లోని రాంథమ్‌బోర్ రిజర్వు ఫారెస్టు. ఇదంతా దేనిగురించో మీకిప్పటికే అర్థమై ఉంటుంది. అవును దేశంలోకెల్ల ‘పెద్ద’పులిగా పిలిపించుకున్న 19 ఏళ్ల మచ్లీ గురువారం ఉదయం 9.40 గంటలకు మరణించింది. వయోభారంతోపాటు తినడానికి ఇబ్బంది పడుతున్న ఈ వ్యాఘ్రం గత రెండ్రోజులుగా తిండి తిప్పలు మానేసింది. దీంతో అటవీశాఖ సిబ్బంది అమా ఘాటిలో అబ్జర్వేషన్లో ఉంచారు. 48 గంటలుగా ఏమీ తినకపోవడంతో నీరసించిపోయి.. కన్నుమూసింది. నిజానికి పులులు 14 నుంచి 15 ఏళ్లు బతుకుతాయి. అలాంటిది మచ్లీ 19 ఏళ్లు బతికింది. ఇటీవలే కోరలు ఊడిపోవడంతో పస్తూలుండాల్సి వచ్చింది. దీంతో బక్కచిక్కిపోయి ప్రాణాలు కోల్పోయింది. -
రాజస్థాన్ అడవుల్లో పులిపిల్లలు..
న్యూఢిల్లీః ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య తగ్గుతున్న తరుణంలో పర్యాటకులకు పులిపిల్లలు కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వన్యప్రాణ ప్రేమికులకు, అధికారులకు ప్రత్యేక వార్తగా మారింది. ఇండియాలో క్రమంగా పులుల సంఖ్య పెరగడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ లోని రణతంబోర్ టైగర్ రిజర్వ్ లో పర్యటనకు వెళ్ళిన కొందరు పర్యాటకులకు రెండు పులి పిల్లలు కనిపించాయి. దీంతో వన్యప్రాణ ప్రేమికులు సహా అధికారులు అనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓ శుభ పరిణామంగా భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఇండియాలోని రాజస్థాన్ రణతంబోర్ రిజర్వ్ అడవుల్లో పులి కూనలు కనిపించడంతో అధికారులు సంబరాలు జరిపారు. పార్కులోని జోన్ 5 కు చెందిన కచిడా ఏరియాలోని ధకడా ప్రాంతంలో టూరిస్టులు ఈ పులి పిల్లలను కనుగొన్నారు. ఈ పిల్లలకు సుమారు రెండు మూడు నెలల వయసు ఉంటుందని, వీటి తల్లి రిజర్వ్ లో నివసిస్తున్న టి-73 అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతేకాక ఆ పెద్దపులి మరిన్ని పిల్లలను కూడ కని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జోన్ లో అత్యంత ఎక్కువమంది సందర్శించిన పులిగా పేరుతెచ్చుకున్న... అకాసుందరి పేరుగల టి-17 కు పుట్టిన ఆడపులే టి-73 అని, ఇప్పుడు ఈ టి-73 కూడ ముద్దులొలికే పులి కూనలను కనడం ఎంతో ఆనందంగా ఉందని అధికారులు చెప్తున్నారు. దీనికి తోడు తాను ఉండేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుని, ఇక్కడే నివసిస్తున్న మొదటి ఆడపులి ఈ టి-73 అని, చాలా కాలం తర్వాత ఇక్కడే ఈ పులి పిల్లలను పెట్టడం వన్యప్రాణ ప్రేమికులకు నిజంగానే శుభవార్త అని అధికారులు అంటున్నారు. ఈ అభయారణ్యంలో మరిన్ని ఆడ పులులు పిల్లలు పెట్టి ఉండొచ్చని వాటిని కూడ గుర్తిస్తామని తెలిపారు.


