breaking news
ranga reddy dist
-
ఎఫ్సీఎన్ ఆధ్వర్యంలో కండర క్షీణిత బాధితులకు ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: షాద్నగర్లో ఎఫ్సీఎన్ హోమ్ ఆధ్వర్యంలో కండర క్షీణిత బాధితులకు నగదు, నిత్యవసరాలను బుధవారం పంపిణీ చేశారు. ఎఫ్సీఎన్ సంస్థ వ్యవస్థాపకులు డా. గీత, తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు.. కండర క్షీణిత బాధితులకు ఆర్థిక సాయాన్ని అందించారు. జంట నగరాల పరిసర ప్రాంతాల నుండి వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ. ఐదువేలు చొప్పున నగదు, జత బట్టలు, దుప్పటి, నిత్యావసరాలను అందజేశారు. ఈ కండర క్షీణిత వ్యాధితో దుర్భర జీవితాలను అనుభవిస్తున్న వారిని గుర్తించి మానవతా దృక్పథంతో వారికి తమ వంతు సహాయం అందజేస్తున్నామని వ్యవస్థాపకులు అన్నారు. కండర క్షీణిత వ్యాధితో బాధితులకు మానవత్వంతో తోచిన సాయాన్ని అందించాలని నిర్వాహకులు పిలుపునివ్వగా, కొందరు దాతలు ఉదార స్వభావంతో ముందుకు వచ్చారు. స్థానిక ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు స్లీవా రెడ్డి ఒక్కొక్కరికి రూ.1000 నగదు చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించిన దాతలకు ఎఫ్సీఎన్ సంస్థ వ్యవస్థాపకులు కృతజ్ఞతలు తెలిపారు. -
మణికొండలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
హైదరాబాద్ నగర శివారులోని మణికొండ పంచాయతీ పోలింగ్ శనివారం ఉదయం 7.00 గంటలకు మొదలైంది. అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. అయితే తమ ఓటు హక్కు గల్లంతైందని ఓటర్లు ఆందోళనకు దిగారు. నేడు జరుగుతున్న మణికొండ పంచాయతీ సర్పంచి పదవికి ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆ పంచాయతీలోని మొత్తం14 వార్డులకు 63 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 35 పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో విలీనం చేశారు. అయితే మణికొండ పంచాయతీకి పోలింగ్ అనివార్యం అయింది. మధ్యాహ్నం 1.00 గంట వరకు పోలింగ్ జరుగుతుంది.