breaking news
rambhupal reddy
-
అక్రమ మైనింగ్‌పై బాంబు పేల్చిన టీడీపీ ఎమ్మెల్సీ.. బాబుకు ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి బాంబు పేల్చారు. ‘అక్రమార్కులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అపారమైన బెరైటీస్ ఖనిజ సంపదను దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతుల్లేవు, రాయల్టీ లేదు, అక్రమార్జనతో ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. బ్లాస్టింగ్ మెటీరియల్ విచ్చలవిడిగా లభిస్తోంది. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా వాడుతున్నారు’ అంటూ సీఎం చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి గురువారం ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.ఇంకా ఆ లేఖలో ఏం రాశారంటే.. ‘వేముల మండలం గొందిపల్లెలో సర్వే నంబర్ 275లోని 705.43 ఎకరాల్లో కృష్ణప్ప ఆజ్బెస్టాస్ అండ్ బెరైటీస్ కంపెనీకి గతంలో అనుమతులుండేవి. ప్రస్తుతం లీజు అనుమతులకు రెన్యువల్స్ లేకపోగా, రూ.6కోట్లు బకాయిలున్నాయి. అయినప్పటికీ కొందరు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. నిత్యం 100 టన్నులు ఖనిజాన్ని వెలికి తీస్తున్నారు. టన్ను రూ.35వేలు చొప్పున కడపలో ఉన్న పల్వరైజింగ్ మిల్స్‌కు విక్రయిస్తున్నారు. దీనిపై హక్కుదారులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదు. వెల్ మైనింగ్‌లో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా విచ్చలవిడిగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఇదివరకూ అక్రమ మైనింగ్‌లో అయ్యవారిపల్లెకు చెందిన రామచంద్ర మృతి చెందాడు. కలసపాడు వద్ద బ్లాస్టింగ్ మెటీరియల్ కారణంగా గతంలో 10మంది కార్మికులు చనిపోయారు. విరివిగా దొరుకుతున్న జిలెటిన్ స్టిక్స్ వాడుకొని వి.కొత్తపల్లె గ్రామంలో నరసింహులును పేల్చి చంపారు’ అని వివరించారు.ఓ వైపు అక్రమ మైనింగ్, మరోవైపు దోపిడీ..‘వేముల, వేంపల్లె మండలాల్లో అక్రమ మైనింగ్ నిర్వహణే కాకుండా టిఫెన్ కంపెనీకు చెందిన రూ.10 కోట్లు విలువైన ఖనిజాన్ని దోపిడీ చేశారు. టిఫెన్ కంపెనీ ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు, ఇతర సంస్థలకు రూ.కోట్లలో బకాయి పడింది. దాంతో నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) స్వాధీనం చేసుకుంది. దాదాపు 15 ఏళ్ల నుంచి నిల్వ ఉన్న ఖనిజాన్ని ఎన్సీఎల్టీ వేలం వేయగా, ఎంబసీ గ్రూపు కొనుగోలు చేసింది. కోర్టు పరిధిలో ఉన్న ఆ ఖనిజాన్ని ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా దోపిడీ చేశారు. గూగుల్ చిత్రాలను పరిశీలిస్తే దోపిడీ స్పష్టంగా తెలుస్తుంది’ అని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. -
రిటైర్డ్ హెచ్ఎం రాంభూపాల్‌రెడ్డి ఔదార్యం
ఒంగోలు అర్బన్(ప్రకాశం జిల్లా): రాచర్ల మండలం యడవల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి తన పెన్షన్ సొమ్ముతో వెయ్యి మంది కార్మికులకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకు వచ్చి ఔదార్యం చాటుకున్నారు. ఈ మేరకు సోమవారం స్పందన భవనంలో అంగీకార పత్రాన్ని కలెక్టర్ దినేష్‌కుమార్‌కు అందజేశారు. యడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కార్మికులకు బీమా చెల్లిస్తానని అంగీకారం తెలిపారు. గతంలో రిటైర్మెంట్ బెన్ఫిట్స్ మొత్తం రూ.26 లక్షలు స్థానిక పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో సుకన్య సమృద్ధి యోజన ఖాతాల ద్వారా సుమారు 100 మందికి పైగా పేద బాలికలకు జమ చేస్తున్ననాని తెలిపారు. దీనిపై దేశ ప్రధాని కూడా అభినందించిన విషయం గుర్తుచేశారు. సేవా భావంతో రిటైర్డ్ ఉద్యోగి పనిచేయడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. (క్లిక్: 100 మందికి సుకన్య సమృద్ధి యోజన) -
ఎమ్మెల్యే కాటసాని కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
-
వైఎస్సార్సీపీలో జిల్లా నాయకుడికి కీలక బాధ్యతలు
కొల్లాపూర్ : జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు గుండ్రెడ్డి రాంభూపాల్రెడ్డికి అధిష్టానం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ఈయనను పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడి (ఈసీఈ) గా నియమించారు. మొదట్నుంచీ వైఎస్సార్ అనుచరుడిగా కొనసాగుతున్న రాంభూపాల్‌రెడ్డి పార్టీలో ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కొల్లాపూర్ మండలంలోని మంచాలకట్టకు చెందిన ఈయన కడప జిల్లాలో న్యాయవాద కోర్సు ^è దువుతూ వైఎస్సార్‌కు అనుచరుడిగా మారారు. ఆయన కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడిగా ఎంతో కాలం కొనసాగారు. యువజన నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఈయన కొల్లాపూర్ గ్రంథాలయ చైర్మన్‌గా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, డీసీసీ సభ్యుడిగా పనిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా, ముంపు గ్రామాల పునర్నిర్మాణ కమిటీ వైస్‌చైర్మన్‌గా, సింగిల్‌విండో చైర్మన్‌గా, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ సభ్యుడిగా ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు. 98 జీఓ అమలు కోసం పోరాడి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. వైఎస్సార్ మరణాంతరం జగన్ వెంట నడిచారు. ఈయన నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ పటì ష్టానికి కృషి సీఈసీ సభ్యుడిగా నియమితులైన రాంభూపాల్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌నుంచి ఫోన్లో మాట్లాడారు. పార్టీ పటిష్టానికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ మోసపూరిత విధానాలు ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు. విద్యార్థి, యువజన, రైతు సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాడతామని చెప్పారు.