Ramanarayana reddy
-
మంత్రి ఆనంకు భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్
-
‘చంద్రబాబువి హత్యా రాజకీయాలు’
-
‘చంద్రబాబువి హత్యా రాజకీయాలు’
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డిని, సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశారని అన్నారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన అర గంటలోనే డీజీపీ, హోమ్ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి అభిమాని దాడి అని చెప్పారు.. వాళ్లు కచ్చితంగా ఎలా చెప్పారు.. పథకం ప్రకారమే తెలిసి చేసినట్లు ఉందన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయని, వివేకా హత్యపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయనే రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవన్నారు ప్రకాశం : రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఒప్పుకున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మనందరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు. సిట్ ద్వారా వైఎస్ వివేకా హత్యకుట్ర బయటకు రాదన్నారు. సీబీఐ విచారణ జరపాలన్నారు. వివేకానంద రెడ్డి నాకు ఆప్తులు: రఘురామ కృష్టంరాజు పశ్చిమ గోదావరి: వైఎస్ వివేకానందరెడ్డి తనకు చాలా ఆప్తులని వైఎస్సార్ సీపీ నాయకులు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేకానందరెడ్డిది హత్య అని తెలియగానే విస్మయానికి గురయ్యానన్నారు. చీమకు కూడా అపకారం చెయ్యని వివేకానందరెడ్డిని హత్య చేయడానికి దుర్మార్గులకు చేతులు ఎలా వచ్చాయ్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి హత్యను వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించి దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. -
‘కాంగ్రెస్‌ది బస్సు యాత్ర కాదు.. తీర్థయాత్ర’
పొట్టి శ్రీరాములు నెల్లూరు: కాంగ్రెస్‌ది బస్సు యాత్ర కాదు తీర్ధయాత్ర అని వైఎస్సార్సీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నెల్లూరులో ఆనం విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయకుండా ఉమ్మడి రాష్ట్రాన్ని విభజన చేసిన పాత్రధారులు, సూత్రధారులు బస్సు యాత్ర పేరుతో రాబోతున్నారని ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఉనికి కాపాడుకునేందుకే కాంగ్రెస్ ప్రత్యేకంగా బస్సుయాత్ర మొదలు పెట్టిందని దుయ్యబట్టారు. ఏ మొహం పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకు కాంగ్రెస్ వాళ్లు వస్తున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబుకు మద్ధతు ఇచ్చేందుకే కాంగ్రెస్ బస్సు యాత్ర పేరుతో నాటకాలాడుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తలపెట్టిన యాత్రలు కేవలం చంద్రబాబు కోసమేనని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీనే మొదటి నుంచి పోరాటం చేస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ అంటూ కొత్తపాట పాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులని మరింతగా రుణ గ్రస్తులని చేస్తోందని మండిపడ్డారు. -
ఓట్ల బదిలీ రాజీకీయం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పక్కోడు ఎలా పోతేనేం. మనం గెలవాలి. ఎన్నికల్లో గెలుపే ప్రధానం. ఇందుకు ఎవరితోనైనా ఏ రకమైన ఒప్పందాలైనా చేసుకోవాలి. అవి చీకటి ఒప్పందాలైనా సరే. తెరచాటు ఒప్పందాలైనా ఓ.కే. ఆత్మకూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఇదే సూత్రంతో చెయ్యి(కాంగ్రెస్)కు చేయూతనిచ్చి లోక్‌సభకు ఆ ఓట్లు బదిలీ చేయించుకోవడానికి రెండు పార్టీల మధ్య తెరచాటు మంతనాలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి, నెల్లూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డికి సన్నిహితుడైన ఒక నాయకుడు ఈ మిలాఖత్ రాజకీయం నడుపుతున్నారు. మిలాఖత్ ఎందుకంటే..? కావలి అసెంబ్లీ టికెట్ మీద గురిపెట్టి అది సాధ్యం కాకపోవడంతో ఆదాల ప్రభాకరరెడ్డి అనివార్యంగా నెల్లూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావాలనుకున్న సమయంలో అంతా బాగుంది. టీడీపీ వెలిగిపోతుంది అనే ఆశ ఆయనలో ఉండేది. అందుకే నెల్లూరు లోక్‌సభ పోటీకైనా సై అనేశారు. టీడీపీలో టికెట్ల కేటాయింపు, పార్టీలో చాపకింద నీరులా సాగుతున్న అసమ్మతి రాజకీయాలు, బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం మైనారిటీ ఓట్లు పూర్తిగా దూరమైన సమీకరణలతో ఆదాలకు కళ్లెదుటే సినిమా కనిపిస్తోంది. నామినేషన్ల దాఖలు కార్యక్రమం ముగిశాక టీడీపీలో ఆవహించిన నైరాశ్యం, ఆ పార్టీ నాయకులు, అభ్యర్థుల మనసుల్లో బయటకు చెప్పలేని భయం, మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరు ఇవన్నీ ఆదాలకు చెమటలు పట్టిస్తున్నాయి. జిల్లాలో ఎవరు ఎలా పోయినా తాను ఎంపీగా గెలిచేందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని భావించిన ఆదాల ఆత్మకూరు అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రస్తుతం ఉన్న గూటూరు కన్నబాబును మార్చాలని శతవిధాల ప్రయత్నించారు. అనేక మంది నాయకులకు గాలం విసిరి తాయిలాలు ఆశ చూపారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో అక్కడ కన్నబాబునే అభ్యర్థిగా నిలపాల్సిన పరిస్థి తి తలెత్తింది. ఆత్మకూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి రోజు రోజుకూ జనాల్లోకి చొచ్చుకుని పోతుండటం, వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా జనం నమ్మక పోవడంతో ఆ నియోజకవర్గం మీద టీడీపీ ఆశలు వదులుకుంది. దీంతో ఇక్కడ అసెంబ్లీకి తమ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ చేసి లోక్‌సభకు వారి ఓట్లు తమకు బదిలీ చేయించుకునేలా ఆదాలతో సహా టీడీపీ ముఖ్యులు ఆలోచన చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ కలయిక వల్ల ఆత్మకూరులో వైస్సార్సీపీని కట్టడి చేయొచ్చనే అంచనాలకు వచ్చినట్లు చెబుతున్నారు. రూరల్లోనూ అంతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బీజేపీకి బలం లేదని టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ సీటు బీజేపీకి కేటాయించడంతో వైఎస్సార్ సీపీకి బంగారుపళ్లెంలో పెట్టి అప్పగించినట్లేనని టీడీపీ నేతలు అంతర్గత చర్చల్లో స్పష్టంగా చెబుతున్నారు. రూరల్‌లో ఎన్ని ప్రయత్నాలు చేసినా కమలం వికసించే అవకాశం లేదనీ అందువల్ల తమ వ్యూహమేంటో తాము అమలు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ కారణంగానే రూరల్‌లో టీడీపీ ముఖ్య నేతలతో పాటు లోక్‌సభ అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి బీజేపీ అభ్యర్థి సురేష్‌రెడ్డి, ఆ పార్టీ కేడర్‌తో కూడా టచ్‌మీ నాట్‌గానే వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో కూడా అసెంబ్లీకి తమ పార్టీ ఓట్లు కాంగ్రెస్‌కు, లోక్‌సభకు కాంగ్రెస్ ఓట్లు టీడీపీకి బదిలీ తాను గట్టెక్కే అవకాశాలు ఉండవని ఆదాల గట్టిగా నమ్ముతున్నారు. ఆనం కుటుంబంతో పాటు ఆదాలకు కూడా ఈ పథకం రాజకీయ ప్రయోజనం కలిగిస్తుందనే అంచనాతో రెండు పార్టీలకు సన్నిహితుడైన ఒక నాయకుడిని రంగంలోకి దించారు. తెర చాటుగా సాగుతున్న ఈ వ్యవహారం కొందరు బీజేపీ నేతల చెవిలో పడ టంతో వారు టీడీపీ అధర్మ పొత్తుపై పొగలు కక్కుతున్నారని తెలిసింది. బయటకు ఎక్కడా మాట్లాడక పోయినా తమ పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి నేతల చెవిలో ఈ సమాచారం వేసి బావురుమంటున్నారని తెలిసింది. ఆనం సోదరులకూ అనివార్యం ఆత్మకూరులో విజయంపై దాదాపు ఆశలు వదిలేసుకున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కనీసం గౌరవప్రదమైన ఓట్లు సంపాదించడానికైనా పోరాడుతున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీ బాగుగోల గురించి అసలు పట్టించుకోని రామనారాయణరెడ్డికి ఇప్పుడక్కడ సొంత పార్టీ కేడర్ నుంచే నిరసన ఎదురవుతోంది. ప్రజల్లో కూడా కాంగ్రెస్ పట్ల, తన పట్ల కూడా అంత సానుకూల స్పందన కనిపించండం లేదు. పార్టీని పక్కన పెట్టి కనీసం తమ ముఖమైనా చూసి ఈ సారికి సాయం చేయాలని రామనారాయణరెడ్డి ప్రజలను, పార్టీ కేడర్‌ను అభ్యర్థిస్తున్నారు. నెల్లూరు రూరల్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ఆనం విజయకుమార్‌రెడ్డికి సైతం విజయం మీద ఆశలు ఆవిరయ్యాయి. అయినా ఏదో ఒక విధంగా పోరాడుతున్నందున ఇక్కడ కూడా అసెంబ్లీకి టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు, లోక్‌సభకు కాంగ్రెస్ ఓట్లు టీడీపీకి బదలాయింపు చేసుకోగలిగితే ఇద్దరికీ మంచిదనే నిర్ణయానికి వచ్చారు ఆనం సోదరులు. ఈ కారణంగానే ఆనం, ఆదాలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తికి వీరు ఓకే చెప్పినట్లు సమాచారం. పోలింగ్‌కు రెండు, మూడు రోజుల ముందు నుంచి ఈ వ్యూహం ఆచరణలోకి తెచ్చేందుకు ఇరువర్గాలు నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
ఎంత ప్రేమో..!
ఎన్నికల సీజన్ మొదలు కానుంది. ఓటర్లకు గాలం వేసేందుకు అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. అందులోనూ వృద్ధాప్య పెన్షన్లపై కాస్త ఎక్కువ ప్రేమ చూపుతోంది. త్వరలోనే వృద్ధుల పెన్షన్ పెంచాలనే నిర్ణయానికి వ చ్చింది. నెల్లూరు జిల్లాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మంంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. అబ్బో.. వృద్ధులపై ప్రభుత్వానికి ఎంతప్రేమో అంటూ ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారు. కడప రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికలు సమీపిస్తే చాలు...రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమ పథకాలపై ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొస్తుంది. ముఖ్యంగా సామాజిక పెన్షన్లపై ఏదో ఒక విధంగా కరుణ కురిపిస్తుంది. సాధారణ రోజుల్లో కాస్తయినా జాలి చూపని పాలకులకు ఎన్నికలు వస్తున్నాయంటే ప్రేమ కట్టలు తెంచుకుంటుంది. అందుకు ఉదాహరణగా గడిచిన ఉప ఎన్నికలకు ముందు అర్హులు వేలాది మంది ఉండగా, కేవలం ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లోనే కొత్త పెన్షన్లను మంజూరుచేసి తమ ఘనతను చాటుకున్నారు. తాజాగా రచ్చబండ నిర్వహిస్తూ అరకొర పెన్షన్లను మంజూరు చేస్తున్నారు. అలాగే ఎంతోమంది వికలాంగులు పెన్షన్ల కోసం ఎదురు చూస్తుండగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాయచోటికి వస్తున్నారని, కేవలం ఆ ప్రాంతానికి చెందిన వికలాంగులకు ఆగమేఘాలమీద వికలత్వ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు చకాచకా చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధాప్య పెన్షన్ల సొమ్ము పెంచుతున్నట్లుగా తెలుస్తోంది. అన్ని పెన్షన్ల సొమ్మును పెంచితే భారమనుకున్నారేమోగానీ కేవలం వృద్ధాప్య పెన్షన్ల సొమ్మును పెంచనున్నట్లు సమాచారం. త్వరలో ముఖ్యమంత్రి ప్రకటన ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలో రచ్చబండ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వృద్ధాప్య పెన్షన్ల సొమ్మును పెంచుతున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడిస్తారని పేర్కొన్నారు. దీంతో దాదాపుగా వృద్ధాప్య పెన్షన్ల పెంపు ఖాయమైనట్లుగానే తెలుస్తోంది. ప్రస్తుతం వృద్ధులు ప్రతినెల రూ. 200 చొప్పున పెన్షన్ పొందుతున్నారు. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత పెన్షన్ సొమ్ము ఎంత పెంచేది తెలియనుంది. సామాజిక పెన్షన్ల కింద వృద్ధులు, వికలాంగులు, చేనేతలు, వితంతువులు, కల్లుగీత కార్మికులు పెన్షన్లను పొందుతున్నారు. వికలాంగులు రూ. 500చొప్పున పెన్షన్ పొందుతుండగా, మిగతా క్యాటగిరీల్లోని వారు రూ. 200 చొప్పున పెన్షన్లను పొందుతున్నారు. అయితే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వృద్ధాప్య పెన్షన్ల సొమ్మును పెంచుతున్నట్లు మాత్రమే ప్రకటించారు. అంటే మిగతా కేటగిరీల్లోని వారికి యథావిధిగానే పెన్షన్ల సొమ్ము మంజూరు చేస్తారని చెప్పవచ్చు. కాగా, వికలాంగులకు సంబంధించి 40 శాతం వికలత్వం ఉన్న వారికే పెన్షన్లకు అర్హులుగా పరిగణించి వారికి రూ. 500 చొప్పున పంపిణీ చేస్తున్నారు. 20 నుంచి 39 శాతంలోపు వికలత్వం ఉన్న వారికి ప్రతినెల రూ. 200 చొప్పున పెన్షన్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. గతంలో వికలత్వ శాతాన్ని బట్టి 40 శాతం నుంచి పైబడిన వారికి రూ. 500 నుంచి రూ. 700 వరకు పెన్షన్ ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ రూ. 500 పెన్షన్‌ను పంపిణీ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల సమయంలోనైనా ప్రభుత్వం స్పందించి వృద్ధులకైనా పెన్షన్ సొమ్మును పెంచుతుండటం పట్ల పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ సీఎం కాకముందే.... డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం కాకమునుపు 2004వ సంవత్సరం వరకు తెలుగుదేశం పార్టీ పాలనలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కేటగిరీలకు సంబంధించి కేవలం 65 వేల మందికి మాత్రమే పెన్షన్లు పంపిణీ చేసేవారు. కేవలం నెలకు రూ. 75 చొప్పున పెన్షన్ సొమ్ము పంపిణీ అయ్యేది. అది కూడా సక్రమంగా అందేది కాదు. వైఎస్ సీఎం అయ్యాక.. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సంక్షేమ పథకాల స్వరూపమే మారిపోయింది. అందులోనూ సామాజిక పెన్షన్ల సంఖ్య అమాంతం పెరిగింది. ఇందిరమ్మ కార్యక్రమం కింద కేవలం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేతలు నాలుగు కేటగిరీల్లోనే 2.61 లక్షల పెన్షన్ల సంఖ్య చేరింది. అంతేగాక రూ. 75 ఉన్న పెన్షన్‌ను రూ. 200కు పెంచారు. అనంతరం వికలాంగులకు రూ. 500లకు పెన్షన్‌ను పెంచారు. వైఎస్ మరణానంతరం సంక్షేమ పథకాల అమలులో లోటుపాట్లు సంభవించాయి. ఆ ప్రభావం సామాజిక పెన్షన్లపై కూడా పడింది. పాలకులు ఎన్నికల వేళల్లోనే పెన్షన్లపై ప్రేమను చూపిస్తూ వచ్చారు. దీంతో అర్హుల జాబితాలో ఉన్న వారు సైతం ఏడాదికి పైగా పెన్షన్లను పొందడానికి ఎదురు చూడాల్సి వచ్చింది. తాజాగా ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ల సొమ్మును పెంచుతున్నట్లు ప్రకటించడంతో ప్రజల్లో విస్మయంతోపాటు ఇలాగైనా పాలకులు స్పందిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్ధిక మంత్రి ఆనంకు సమైక్య సెగ