-
సంసద్ టీవీని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ ఛానళ్లను కలుపుతూ కొత్తగా సంసద్ టీవీ ఛానల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు, లోక్‌సభ సభాపతి ఓం బిర్లా పాల్గొన్నారు. పార్లమెంటు కార్యకలాపాలను విస్తృత స్థాయిలో ప్రజలకు అందుబాటులో తేచ్చేందుకుగాను సంసద్ టీవీని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం రోజున సంసద్ టీవీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. చదవండి: ఐఫోన్- 13 రిలీజ్..! విపరీతంగా ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు..! అందులో జోమాటో కూడా.. సంసద్ టీవీలో పార్లమెంటు, ప్రజాస్వామిక వ్యవస్థల కార్యకలాపాలు; పథకాలు, విధానాల అమలు, పాలన; భారత దేశ చరిత్ర, సంస్కృతి; సమకాలిక స్వభావంగల సమస్యలపై ఈ చానల్ ప్రసారం చేయనున్నారు. లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ ఛానళ్లను కలిపి ఒకే చానల్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రసార భారతి సీఈఓ సూర్య ప్రకాశ్ నేతృత్వంలోని కమిటీ ఆమోదం తెలిపింది. 2006 జూలైలో లోక్‌సభ టీవీ ప్రారంభించారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆలోచనల మేరకు లోక్‌సభ టీవీను ఏర్పాటు చేశారు. రాజ్యసభ టీవీ 2011లో ప్రారంభమైంది. చదవండి: రెండు కోట్ల ఉద్యోగాలపై ఆందోళనలకు యువజన కాంగ్రెస్ పిలుపు -
మోడీలా నేను దాచలేదు
* ఆయన తన పెళ్లి బంధాన్ని 30 ఏళ్లు దాచాడు * నేను మోడీలా పిరికివాడిని కాదు: దిగ్విజయ్ * విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యం నాకుంది * అమృతకు విడాకులు రాగానే పెళ్లి చేసుకుంటా సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ టీవీ వ్యాఖ్యాత అమృతారాయ్‌తో తనకున్న సంబంధాన్ని ఏనాడూ దాచలేదని, ఆమెకు విడాకులు రాగానే పెళ్లి చేసుకుంటానని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీలా తానేమీ దాచలేదన్నారు. ‘నేను మోడీలా పిరికివాడిని కాదు. పెళ్లి సంబంధాన్ని 30 ఏళ్లపాటు దాచలేదు. పెళ్లి అంశం ప్రైవేటు వ్యవహారం. అయినప్పటికీ బహిర్గతపరిచేందుకు వెనుకాడలేదు. దీనిపై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యం నాకుంది. అమృతకు విడాకులు రాగానే పెళ్లి చేసుకుంటా’ అని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. పోలింగ్ రోజున మోడీ తన పార్టీ గుర్తును చూపడం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. చట్టాలను నిస్సిగ్గుగా ఉల్లంఘించడం ఆయనకు అలవాటేనని ధ్వజమెత్తారు. అంతకుముందు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో జరిగిన వేడుకల్లోనూ దిగ్విజయ్ మాట్లాడారు. కార్మికులంటే కాంగ్రెస్‌కు ఎంతో గౌరవం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ 5 శాతానికిపైగా వృద్ధిరేటును సాధించిన ఘనత యూపీఏ సర్కార్‌దేనన్నారు. అయితే దీనివల్ల కార్పొరేట్లు ఎక్కువగా లబ్ధి పొందిందన్నారు. పేదల కోసం యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చే సమయంలో కార్పొరేట్ శక్తులు తీవ్రంగా వ్యతిరేకించాయని చెప్పారు. ప్రస్తుతం ఆ శక్తులే ఎన్నికల్లో మోడీకి మద్దతిస్తున్నాయన్నారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమం విషయంలో తెలంగాణ, సీమాంధ్రలో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని స్మరించుకున్నారు. వైఎస్ గొప్ప నాయకుడని, కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారని కొనియాడారు. అనంతరం పలువురు కార్మిక నాయకులను టీపీసీసీ తరఫున సన్మానించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పలువురు ఐఎన్టీయూసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు దిగ్విజయ్ పెళ్లి ఆయన వ్యక్తిగత విషయమంటూ ఏఐసీసీ నేతలు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. ఇక దిగ్విజయ్ కుమారుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ మాత్రం తన తండ్రికి మద్దతు తెలిపారు. ఆయన వ్యక్తిగత నిర్ణయంలో తాను జోక్యం చేసుకోబోనన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement