breaking news
rajya sabha namination
-
దుర్గమ్మను దర్శించుకున్న వేమిరెడ్డి
సాక్షి, విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయనున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి...ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
సాక్షి టుడే హైలైట్స్..
చంద్రబాబు డబ్బున్నోళ్లనే ఎంపిక చేశారు హైదరాబాద్ : తమ పార్టీ ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేస్తే, టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బున్నవారిని రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. ట్రాన్స్ జెండర్స్‌తో ఫ్యాషన్ డిజైనింగ్ వస్త్రాల ఫ్యాషన్ డిజైనింగ్ ప్రెజెంట్ చేయాలంటే ట్రాన్స్ జెండర్స్ తో ఆ పని చేయించే సాహసం ఎవరైనా చేస్తారా.. కేరళకు చెందిన షర్మిల నాయర్ ఆ ధైర్యం చేశారు. రక్తమార్పిడితో 2234 మందికి హెచ్ఐవీ! అత్యవసర పరిస్థితిలో రక్తమార్పిడి చేయించుకోవడం వల్ల మన దేశంలో 2234 మందికి హెచ్ఐవీ సోకింది. దేశంలో 1.80 కోట్ల మంది బానిసలు! మోడరన్ బానిసలు ఎక్కువగా ఉన్నది మన దేశంలోనేనట. దాదాపు కోటి ఎనభై లక్షల మందికి పైగా భారతీయులు కట్టుబానిసలుగాను, బిచ్చగాళ్లుగా, వ్యభిచారులుగా, బాల కార్మికులుగా బతుకీడుస్తున్నారని ఓ అంతర్జాతీయ సర్వే సంస్థ తెలిపింది. మన నోబెల్ విజేతకు చదువంటే ఇష్టం లేదంట తనకు చదువంటే అస్సలు ఇష్టం ఉండేది కాదని నోబెల్ బహుమతి విజేత, భారత సంతతికి చెందిన వెంకట్రామన్(వెంకీ) రామకృష్ణన్ అన్నారు. 'కోహ్లి కంటే వార్నర్ పవర్ఫుల్' భారత డాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి కంటే డేవిడ్ వార్నర్ శక్తిమంతుడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ అన్నాడు. పెళ్లి నగలు కొనేవారికి భారీ ఊరట బంగారు ఆభరణాలపై 1 శాతం పన్ను విధింపులో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అందరూ చూస్తుండగా వెరైటీ స్నానం యమునా నది పరిరక్షణ కోసం కొంతమంది ఉద్యమకారులు, సామాజిక వేత్తలు నది ఒడ్డున కూర్చుని ఇసుకతో స్నానం చేసి చుట్టుపక్కల వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అంపైర్ నోబాల్ ఇచ్చాడని.. చెల్లెలికి విషమిచ్చాడు! క్రికెట్ మ్యాచ్‌లో అంపైర్ నోబాల్ ఇచ్చాడని, అతడి చెల్లెలికి విషమిచ్చాడో క్రీడాకారుడు. తనకు తానే కిడ్నాపయ్యాడు.. కలకలం రేపిన అనంతపురం జిల్లా ధర్మవరం మరమగ్గాల వ్యాపారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. రూ.63 కోట్లతో ఇల్లు కొనుక్కుంది పాప్ సింగర్ అడిలె లగ్జరీ సౌధాన్ని సొంతం చేసుకుంది. లాస్ ఏంజెలెస్ లోని బెవెర్లీ హిల్స్ గేగెట్ కమ్యూనిటీలో ఉన్న భవంతిని సుమారు రూ.63 కోట్లు (9.5 మిలియన్ డాలర్లు) పెట్టి కొనుక్కుంది. రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఆంధ్రా, తెలంగాణ నుంచి టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం ఉదయం నామినేషన్లు దాఖలు చేశారు. కిడ్నాపర్లను కుమ్మేసిన ఫుట్ బాల్ ప్లేయర్ తనను ఎత్తుకెళ్లిన ఓ కిడ్నాపర్‌కు మెక్సికో ఫుట్ బాలర్ సినిమాల్లో చూపించినట్లుగానే ఝలక్ ఇచ్చాడు. అతడిని మూర్చపోయే వరకు కొట్టి పోలీసుల సహాయంతో బయటపడ్డాడు. తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసిన మారుతి దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ.. ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. మనేసర్ లోని సంస్థకు చెందిన సుబ్రోస్ లిమిటెడ్ ప్లాంట్ లో ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. విమర్శలపై స్పందించిన ప్రియమణి హీరోయిన్ ప్రియమణి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ముస్లిం కావటంతో వారి ప్రేమను లవ్ జిహాద్‌తో పోలుస్తూ కొంతమంది కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్లపై ఆమె సీరియస్‌గా స్పందించింది దళితుల ఇంట్లో అమిత్ షా లంచ్ ఎందుకు? మంగళవారం ప్రధాని నరంద్రమోదీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్న ఆయన మధ్యాహ్నం ఓ దళితుల ఇంట్లో భోజనం చేయనున్నారు. ఎలా ఎంజాయ్ చేశామో చూడండి: యువీ ఐపీఎల్ విజేతగా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్ హెచ్) ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలారు. మృతదేహాన్ని బైక్ కు కట్టి... ఒడిషాలోని నబరంగపూర్ జిల్లాలో ఇద్దరు యువకులు చనిపోయిన మహిళ మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకొని వెళ్లడం ఆందోళన రేపింది. 24న ఆత్మహత్య.. అదేరోజు స్పీడ్‌పోస్టులో సూసైడ్‌నోట్! ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థిని ఝాన్సీ సూసైడ్ నోట్ విషయంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయుధాగారంలో పేలుళ్లు.. 20 మంది మృతి మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పుల్గావ్ లోని కేంద్ర సైనిక ఆయుధాగారంలో భారీ అగ్నిప్రమాదం అనంతరం పెద్ద మొత్తంలో పేలుళ్లు సంభవించాయి. సుమారు 20 మంది మరణించారు. ముర్తాల్ గ్యాంగ్ రేప్: విస్మయకర విషయాలు హర్యానాలో జాట్ల ఆందోళన సందర్భంగా ముర్తాల్ లో మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు సాగుతోంది. ఆ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు.. రూ. 2 కోట్లు! క్రిస్టీస్ వేలంశాలలో వేలానికి వచ్చిన ఓ హ్యాండ్‌బ్యాగ్ చరిత్ర సృష్టించింది. ఆ హ్యాండ్‌బ్యాగ్‌ను అక్షరాలా 2 కోట్ల రూపాయలకు కొన్నారు. ఒక్కో నౌక 919 అడుగులు.. 65 వేల టన్నులు సముద్రంపై గతంలోనే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బ్రిటన్ ఇప్పుడు కూడా అంతే స్థాయిని కొనసాగించనుంది. ఇప్పటికే రెండు అతిపెద్ద భారీ నౌకలను నిర్మించిన బ్రిటన్ వాటిని పూర్తి స్థాయిలో 2020నాటికి ప్రారంభించనుంది. మనసు మార్చుకున్న గుణశేఖర్ చూడాలని ఉంది, ఒక్కడు లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్ ఈసారి కొత్తవాళ్లతో చిన్నబడ్జెట్ సినిమా తీస్తాడట లేడీ కానిస్టేబుల్‌పై అత్యాచార యత్నం ఓ మహిళా కానిస్టేబుల్‌పై తోటి కానిస్టేబుల్ అత్యాచారానికి యత్నిం చిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. అభివృద్ధికి సహకరించని ప్రభుత్వం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కర్నూలు ఎంపీ బుట్టారేణుక ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ను హీరోయిన్లా ఉన్నారని.. ఓ జిల్లా కలెక్టర్‌ను పట్టుకుని మీరు హీరోయిన్లా ఉన్నారని, కానీ ఇంతకు ముందెప్పుడు తెరమీద నటిస్తుండగా చూడలేదన్న ఎమ్మెల్యేపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోసారి ఉత్తర కొరియా బొక్కబోర్లా..! ఉత్తర కొరియా మరోసారి పరాభవాన్ని చవిచూసింది. మంగళవారం ఉదయం రెండు అణు క్షిపణులు పరీక్షించిన ఆ దేశానికి భంగపాటు ఎదురైంది. పీఎఫ్ డ్రా చేసినా టీడీఎస్ ఉండదు! పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. జూన్ ఒకటో తేదీ నుంచి మీ పీఎఫ్లోంచి రూ. 50 వేల వరకు డ్రా చేసుకున్నా, దానిమీద ఎలాంటి పన్ను కోత వేయరు. మెగాస్టార్‌కే హ్యాండ్ ఇచ్చిందట..? అనుష్క హీరోయిన్గా చిరు 150 సినిమా సెట్స్ మీదకు వెళుతుందంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ భామ కూడా మెగాస్టార్‌కు హ్యాండ్ ఇచ్చిందట. కొట్టాడని హీరో సూర్యపై యువకుడి కేసు దక్షిణాది ప్రముఖ నటుడు సూర్యపై ఓ ఫుట్ బాల్ ప్లేయర్ కేసు పెట్టాడు. తిరు వి కా వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదం విషయంలో జోక్యం చేసుకొని బాధితుడినైన తనతో గొడవపడి చేయిచేసుకున్నాడని ఆ యువకుడు జే5 శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. బాబువి అనైతిక రాజకీయాలు : ఎంపీ వైఎస్ అవినాష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో అనైతిక రాజకీయాలు చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. ఫేస్బుక్లో కామెంట్స్, కలెక్టర్‌కు తాఖీదు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఫేస్బుక్ లో వ్యాఖ్యలు చేసినందుకు మధ్యప్రదేశ్ లో ఐఏఎస్ అధికారి ఒకరు తాఖీదు అందుకున్నారు. మోదీ సర్కారుకు సోనియా సవాల్ తన అల్లుడు రాబర్ట్ వాద్రా చేసిన ఆరోపణలను రుజువు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సవాల్ విసిరారు. సమంత 'యు టర్న్' తీసుకుంటుందట ఇప్పటి వరకు ఎక్కవుగా గ్లామర్ పాత్రల్లో అల్లరి పిల్లగా కనిపించిన సమంత, త్వరలో లేడి ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతోంది. మిగతా రూ. 4.75 కోట్లు కట్టండి యమునా నదిని కలుషితం చేసిందుకు విధించిన జరిమానా చెల్లించాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్(ఏఓఎల్) ఫౌండేషన్ ను ఎన్జీటీ ఆదేశించింది. ఆశ్రయానికి నో.. రెండు కోట్లు ఇచ్చేందుకు ఓకే! శరణార్థులను తమ గ్రామంలోకి అనుమతివ్వకుండా అందుకు ప్రతిగా కోట్ల రూపాయల ఫైన్ చెల్లించేందుకు స్విట్జర్లాండ్ లోని ఓ గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. సాఫ్ట్‌బ్యాంక్ అధినేతతో కేటీఆర్ భేటీ సాప్ట్ బ్యాంకు అధినేత నికేష్ అరోరాతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు భేటీ అయ్యారు. కాలగర్భంలోకి మానవ తొలిజాతి సంస్కృతి తరానికి తరానికే సంస్కృతి, సంప్రదాయాలు మారిపోతున్న నేటి ఆధునిక సమాజంలో ఆదిమ జాతి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడం కష్టమే! ట్విట్టర్ హ్యాక్.. అన్నీ అసభ్యకర ట్వీట్స్..! ప్రముఖ హాలీవుడ్ సింగర్ కేటి పెర్రీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. అశోక వృక్షంలో క్యాన్సర్ ఔషధం ట్యూమర్లను తగ్గించడంలో కీలక పాత్ర పోషించే టాక్సన్ అశోకా చెట్లలో కూడా తాజా అధ్యయనాలు తేల్చాయి. 'ఆరుగురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు' పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం పశ్చాత్తాపడుతున్నారని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. మెగాఫోన్ పట్టనున్న సూపర్ స్టార్ కూతురు ఇప్పటికే నటిగా, నిర్మాతగా ప్రూవ్ చేసుకున్న స్టార్ వారసురాలు మంజుల. మాజీ ప్రియురాలిని వెంటాడి పట్టుకుని.. తనకు దూరమైందనే కోపంతో రోమ్ యూనివర్శిటీ విద్యార్థిని ఆమె మాజీ ప్రియుడు అతికిరాతకంగా చంపాడు. విరాట్ 'రికార్డు' మిస్సయ్యాడు! మాస్టర్ బ్లాస్టర్, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను ప్రపంచ దిగ్గజ క్రికెటర్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సర్ బ్రాడ్‌మన్‌తో పోల్చడం మనకు తెలిసిందే. 2వేల కోట్ల డ్రగ్స్ కేసు.. కీలక నిందితుడి అరెస్ట్ వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ముఠా కేసులో కీలక నిందితుడిని థానే పోలీసులు అరెస్ట్ చేశారు. వందేళ్లకు పైగా బతకాలంటే.. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భగత్ సింగ్ అనుచరుడు నసీమ్ మీర్జా చంగేజి (106) తన నూరేళ్ల జీవన ప్రస్థానానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తల్లిగా ఆ బాధేంటో నాకు తెలుసు: సుష్మా స్వరాజ్ ఆఫ్రికన్ విద్యార్థులపై వరుస దాడుల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం వారితో భేటీ అయ్యారు. అశ్విన్ ర్యాంకు పదిలం అంతర్జాతీయ టెస్టు ర్యాంకుల్లో టీమిండియా స్సిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రెండో స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. ఆన్ లైన్ కస్టమర్లకు ఫ్లిప్ కార్ట్ శుభవార్త ఈఎంఐలో వస్తువులను కొనుగోలు చేసేవారికి అదనంగా ఎలాంటి చెల్లింపులు పడకుండా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఓ కొత్త ఆప్షన్ ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. వైఎస్ జగన్‌ను కలిసిన విజయ సాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. మంత్రి దత్తాత్రేయ సెల్‌ఫోన్ దొంగ అరెస్టు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సెల్‌ఫోన్ ను చోరీ చేసిన ఘనుడుని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. మనిషి మృతదేహాన్ని పీక్కుతిన్నాయి.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం దక్షిణప్రాంతంలో పోలీసులకు భయంకరమైన దృశ్యం కనిపించింది. స్మోకర్స్.. అతి పెద్ద కోరిక ఏంటో తెలుసా...? స్మోకింగ్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది తప్ప, తగ్గే ప్రసక్తే లేదు. అదొక బాధ్యత.. దాన్ని ఆస్వాదిస్తా' త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన అజ్యింకా రహానే తనపై ఉంచిన కొత్త బాధ్యతతో మరింత రాటుదేలతానని స్పష్టం చేశాడు. తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల తెలంగాణ ఐసెట్-2016 ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. యూపీఎస్సీ సభ్యుడిగా బీఎస్ బస్సీ ఢిల్లీ వివాదాస్పద మాజీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సభ్యుడిగా మంగళవారం నియమించారు. షాకింగ్.. ఖడ్గమృగానికి నడక నేర్పించింది.. సాధారణంగా చిన్న పిల్లలు అందంగా ఉన్న జంతులను చూసేందుకు, వాటితో ఆడుకునేందుకు ఇష్టపడతారు.