breaking news
rain proof tent
-
మార్వ్‌లెస్. మాన్సూన్ వెడ్డింగ్స్..
‘చిటపట చినుకులు పడుతూ ఉంటే.. చెలికాడే సరసన ఉంటే.. చెట్టాపట్టగ చేతులు కలిపి చెట్టు నీడకై పరుగిడుతుంటే.. చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ..’ అంటూ సాగే పాత తెలుగు సినిమా పాటను గుర్తు చేసేలా నేటి వెడ్డింగ్ ప్లానర్లు ప్లాన్ చేస్తున్నారు.. సాధారణంగా వర్షాకాలంలో పెళ్లిళ్లు అంటే కాస్త ఇబ్బంది.. చిరాకే.. కానీ, పక్కాగా ప్లాన్ చేస్తే వానాకాలంలో పెళ్లి వేడుకలను మధురమైన అనుభూతిగా మిగుల్చుకోవచ్చు.పెళ్లిళ్ల సీజన్ ఆరంభమైంది. మరోవైపు వేసవి ముగియకముందే వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అంగరంగ వైభవంగా అలంకరించుకొని, బంధువులు, స్నేహితుల మధ్య పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో అకస్మాత్తుగా వర్షం పడితే ముందస్తు ప్లానింగ్ అంతా వేస్ట్ అవుతుంది. పెళ్లికి వచ్చిన వారు చిరాకు పడటంతో పాటు రావాల్సిన బంధువులు రాలేని పరిస్థితి తలెత్తుతుంది. అందుకే వానాకాలంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం కాసింత కష్టమే. కానీ, ఇవన్నీ పాత రోజులు. నిజం చెప్పాలంటే వర్షాకాలంలో పెళ్లి వధూవరులకు మంచి అనుభూతిని మిగులుస్తుందని అంటున్నారు వెడ్డింగ్ ప్లానర్లు.హైబ్రిడ్ వేదికలు.. ఈమధ్య కాలంలో వర్షాకాలంలో వివాహాలు ట్రెండీగా మారాయి. పెళ్లి శుభలేఖల నుంచి మొదలుపెడితే వేదిక, మండపం అలంకరణ, అతిథుల ఆహ్వానం, ఫొటోగ్రఫీ, బరాత్ వరకూ అన్నీ ప్రత్యేకమైనవిగా ఉంటాయి. సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే వధూవరులకు, అతిథులకు గొప్ప అనుభూతి కలిగేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమాటిక్ పెళ్లి వేడుకలను వెడ్డింగ్ ప్లానర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాయి. వాన ఇబ్బందుల నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.అన్ని రకాలుగా వేడుకలకు సిద్ధం చేయడమే ఈ సంస్థల ప్రత్యేకత. పెళ్లి మండపమే కాదు టెర్రస్, లాన్, ఓపెన్ ఏరియా అన్నింటినీ గ్లాస్ కనోపీలతో కవర్ చేస్తారు. జర్మన్ హ్యాంగర్ టెంట్లు, వాటర్ ప్రూఫ్ డోమ్‌లు, ముడుచుకునే పైకప్పులతో వివాహ వేదిక, మండపాలు నిర్మిస్తారు. అకస్మాత్తుగా వర్షం కురిస్తే వాననీరు వెళ్లేందుకు సరైన మార్గాలను ఏర్పాటు చేస్తారు. ట్రాన్స్పరెంట్ పెళ్లి వేదిక, మండపాలతో వధూవరులకే కాదు అతిథులు కూడా వర్షం పడినా తడిసిపోకుండా వర్షపు జల్లులు, శబ్దాలను ఆస్వాదిస్తూ గొప్ప అనుభూతిని పొందుతారు.భద్రత కీలకమే.. నాన్‌స్లిప్ టైల్స్, మ్యాట్లు, తగినంత లైటింగ్‌తో పాటు వృద్ధులకు డ్రై జోన్లను ఏర్పాటు చేస్తారు. వర్షాకాలంలో బరాత్‌లకు బదులుగా సన్నాయి మేళం, డోల్ చప్పుళ్లు, మ్యూజిక్ బ్లాస్టింగ్స్ ఏర్పాటు చేస్తారు. దీంతో అతిథులు గొడుగుల కింద నృత్యం చేసే వీలుంటుంది. విద్యుత్ అంతరాయం కలగకుండా బ్యాకప్ బ్యాటరీలు, జనరేటర్లను క్యారీ చేస్తారు. డీహ్యుమిడిఫయ్యర్లు, ప్లాస్టిక్ టార్ప్లిన్ ఏర్పాటు చేస్తారు. లాంతర్లు, షాండీలియర్ల వెలుగులో వధూవరులు గొడుగుల కింద లేదా వర్షంలో తడుస్తూనే రొమాంటిక్ ఫొటోలకు ఫోజులు ఇస్తారు.వర్షాన్ని ఆస్వాదించేలా.. శుభలేఖ కూడా మేఘాలు, వర్షం చినుకులను ప్రతిబింబించేలా ముద్రిస్తారు. అతిథులు పెళ్లి వేదికలో అక్కడక్కడ శుభ్రమైన చిన్న టవల్స్‌ను అందుబాటులో ఉంచుతారు. బగ్ స్ప్రే ప్యాచ్‌లు, త్వరగా ఆరిపోయే న్యాప్కిన్లు, వర్షంలో, బురదలో జారిపడిపోకుండా ఫ్లిప్‌ఫ్లాప్ పాదరక్షలు అందుబాటులో ఉంచుతారు. అతిథులు వర్షం మూడ్ ఆస్వాదించేందుకు వేడి టీ, కాఫీలు, మసాలా మాక్టెయిల్స్, ముల్లడ్ వైన్ కాక్టెయిల్స్తో బార్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.వెల్వెట్, సిల్క్ వంటి బరువైన దుస్తులుహుందాగా కనిపిస్తాయి. అయితే వీటి వల్ల వర్షాకంలో ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుతుంది. ఒకవేళ వర్షంలో తడిస్తే అవి మరింత బరువుగా మారతాయి. పైగా వర్షం పడిన సమయంలో ఉక్కపోతకు ఇబ్బంది కలిగిస్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని వీటికి బదులు తేలికపాటి నేత వ్రస్తాలు, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, మృధువైన నైలాన్‌తో తయారైన వ్రస్తాలు, సిల్‌్క, సింథటిక్ ఫైబర్‌తో తయారైన జార్టెట్తో లెహంగాలను డిజైన్ చేస్తున్నారు. ఇవి నీటిని పీల్చుకోకపోవడంతో పాటు తేలికగా ఉండటమే వీటి ప్రత్యేకత. వాటర్ ప్రూఫ్ లైనింగ్, క్విక్ డ్రై దుపట్టాలను వధూవరులు ఎంచుకుంటున్నారు. -
సీఎం రాకకు ఏర్పాట్లు పూర్తి
800 మంది పోలీసులతో గట్టి బందోబస్తు వర్షం కురిసినా ఇబ్బందులు లేకుండా రెయిన్‌ఫ్రూఫ్ టెంట్ ఏర్పాటు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఎమ్మెల్యే వ్యవసాయక్షేత్రానికి చేరుకోనున్న సీఎం అక్కడి నుండి ప్రత్యేక వాహనశ్రేణిలో ఎమ్మెల్యే ఇంటికి.. నాగిరెడ్డిపేట,తాడ్వాయి : ఇటీవల మాతృవియోగం కలిగినఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి తల్లి ఏనుగు రాజమ్మ ఈ నెల 6న రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్వగ్రామం తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో ఆదివారం దినకర్మ నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ హాజరై ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఇందుకోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం ఎర్రపహాడ్‌కు వచ్చిన సమయంలో వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండాప్రత్యేకంగా రెయిన్‌ఫ్రూఫ్ టెంట్‌ను ఎమ్మెల్యే ఇంటివద్ద ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో ఎర్రపహాడ్ శివారులో గల ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేకవాహన శ్రేణిలో ఎమ్మెల్యే ఇంటికి వెళ్తారు. అక్కడ ఎమ్మెల్యే తల్లి రాజమ్మ చిత్రపటం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించి ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డిని, ఇతర కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటివద్దే మంత్రులతో కలిసి భోజనం చేసిన అనంతరం మధ్యాహ్నం 2గంటల సమయంలో సీఎం తిరిగి రాజధానికి వెళ్తారని అధికారులు తెలిపారు. 800 మంది పోలీసులతో బందోబస్తు సీఎం రాక సందర్భంగా ఎర్రపహాడ్‌లో 800 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మెదక్ అడిషనల్ ఎస్పీ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు సీఎంకు బందోబస్తు నిర్వహించనున్నారు. ఆరుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 32 మంది ఎస్సైలతోపాటు సుమారు 700 మందికిపైగా కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొననున్నారు. బందోబస్తులో భాగంగా ప్రత్యేక పోలీసు బృందాలు శనివారం ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి ఇంటి పరిసరాలను జాగిలాలతో తనిఖీ చేశాయి. కలెక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్‌రెడ్డి, ఎస్పీ విశ్వప్రసాద్ సీఎంరాక కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం రాకకు సంబంధించి ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డితో చర్చించారు. కాగా పార్టీ కార్యకర్తలకు, ఆరుమండలాలకు చెందిన ప్రజాప్రతినిధులకు వ్యవసాయక్షేత్రంలోని హెలిప్యాడ్ సమీపంలో భోజనాలకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.