విశాఖపట్నంలో ఏఆర్ రహ్మాన్ సంగీత ప్రదర్శన!
వైజాగ్ సంగీత అభిమానులకు శుభవార్త. సంగీత మాంత్రికుడు ఏఆర్ రహ్మన్ తన సంగీత ప్రదర్శనను అక్డోబర్ తొలివారంలో విశాఖపట్నం లో ఇవ్వనున్నారు. 'రహ్మానిష్క్' పేరుతో భారత దేశంలోని పలు నగరాల్లో సంగీత ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను టెక్ ఫ్రంట్ అండ్ రాపోర్ట్ గ్లోబల్ ఈవెంట్ అనే సంస్థ చూస్తోందని రహ్మాన్ పీటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అక్టోబర్ 1 తేదిన కోల్ కతాలో ప్రారంభమయ్యే సంగీత ప్రదర్శన ఆ తర్వాత విశాఖపట్నం, జైపూర్, ఆహ్మాదాబాద్ నగరాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. జైపూర్ లో రాచరిక వ్యవస్థ ఉట్టిపడే విధంగా, ఆహ్మాదాబాద్ లో జానపద నృత్యాల, కోల్ కతాలో సాహిత్యం, విశాఖపట్నంలో పురాణ నేపథ్యంగా ఉండే థీమ్ తో సంగీత ప్రదర్శన ఉంటుందన్నారు.