విశాఖపట్నంలో ఏఆర్ రహ్మాన్ సంగీత ప్రదర్శన! | A R Rahman's multi-city road trip 'RahmanIshq' in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖపట్నంలో ఏఆర్ రహ్మాన్ సంగీత ప్రదర్శన!

Aug 27 2013 4:18 PM | Updated on Apr 3 2019 6:23 PM

విశాఖపట్నంలో ఏఆర్ రహ్మాన్ సంగీత ప్రదర్శన! - Sakshi

విశాఖపట్నంలో ఏఆర్ రహ్మాన్ సంగీత ప్రదర్శన!

వైజాగ్ సంగీత అభిమానులకు శుభవార్త. సంగీత మాంత్రికుడు ఏఆర్ రహ్మన్ తన సంగీత ప్రదర్శనను అక్డోబర్ తొలివారంలో విశాఖపట్నం లో ఇవ్వనున్నారు.

వైజాగ్ సంగీత అభిమానులకు శుభవార్త. సంగీత మాంత్రికుడు ఏఆర్ రహ్మన్ తన సంగీత ప్రదర్శనను అక్డోబర్ తొలివారంలో విశాఖపట్నం లో ఇవ్వనున్నారు. 'రహ్మానిష్క్' పేరుతో భారత దేశంలోని పలు నగరాల్లో సంగీత ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను టెక్ ఫ్రంట్ అండ్ రాపోర్ట్ గ్లోబల్ ఈవెంట్ అనే సంస్థ చూస్తోందని రహ్మాన్ పీటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
 
అక్టోబర్ 1 తేదిన కోల్ కతాలో ప్రారంభమయ్యే సంగీత ప్రదర్శన ఆ తర్వాత విశాఖపట్నం, జైపూర్, ఆహ్మాదాబాద్ నగరాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. జైపూర్ లో రాచరిక వ్యవస్థ ఉట్టిపడే విధంగా, ఆహ్మాదాబాద్ లో జానపద నృత్యాల, కోల్ కతాలో సాహిత్యం, విశాఖపట్నంలో పురాణ నేపథ్యంగా ఉండే థీమ్ తో సంగీత ప్రదర్శన ఉంటుందన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement