breaking news
Radya kavitha
-
గులాబీ గూటికి టీ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
-
గులాబీ గూటికి టీ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : మరో ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. రంగారెడ్డి చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్య, వరంగల్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ త్వరలో కారెక్కబోతున్నారు. వారిద్దరూ గురువారం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను కలిశారు. భేటీ అనంతరం రెడ్యా నాయక్, యాదయ్య మాట్లాడుతూ తామంతా టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నామని, బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. కేసీఆర్ విధానాలు నచ్చే పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. త్వరలోనే భారీ సభ ఏర్పాటు చేసి టీఆర్ఎస్లో చేరనున్నట్లు రెడ్యా నాయక్ తెలిపారు. మంత్రి పదవి ఆశతో చేరటం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే రెడ్యా నాయక్ కుమర్తె, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కవిత కూడా టీఆర్ఎస్లో చేరనున్నారు. మరో ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. -
కేసీఆర్‌తో కవిత, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ
హైదరాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతోంది. నిన్న టీడీపీ నేతలు కారెక్కితే...తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ...కేసీఆర్‌తో భేటీ అయ్యారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్య గురువారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. మంత్రి హరీష్ రావు వెంట ...ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చారు. మరోవైపు వరంగల్ జిల్లా డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, ఆయన కుమార్తె, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే కవిత కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ చేతిలో ఆమె ఓటమి పాలైంది.