breaking news
Rachakond
-
‘దళారులను నమ్మి మోసపోవద్దు’
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పలు సూచనలు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిదిలో నిరుద్యోగులకు గాలం వేసి ఉద్యోగాల పేరుతో దళారులు మోసం చేస్తున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్బోర్టు అభ్యర్థులకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిజికల్ టెస్ట్‌లు పాసైన వారు ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని తెలిపారు. కొంతమంది బ్రోకర్స్ తమకు పోలీస్ అధికారులతో పరిచయాలు ఉన్నాయని, డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని అభ్యర్థులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తమ వద్దకు వస్తున్నాయని, పోలీస్ ఉద్యోగ పరీక్షలు పారదర్శకంగా ఎలాంటి అవినీతి లేకుండా జరుగుతున్నాయని కమిషనర్ వెల్లడించారు. ఉద్యోగాల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
రాచకొండలో నేడు సీఎం ఏరియల్ సర్వే
-
రాచకొండలో నేడు సీఎం ఏరియల్ సర్వే
చౌటుప్పల్ : రంగారెడ్డి-నల్లగొండ జిల్లాల సరిహద్దులోని రాచకొండ ప్రాంతాన్ని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చేయనున్నారు. వాస్తవానికి ఈ నెల 3వ తేదీన రాచకొండతోపాటు మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు, రంగారెడ్డి జిల్లా కంద కూరు మండలం ముశ్చర్లలో ఏరియల్ సర్వే చేయాలనుకున్నారు. అదేరోజు ముశ్చర్లలో ఫార్మా ప్రతినిధులతో కలిసి ఏరియల్ సర్వే చేసినప్పటికీ, అనివార్యకారణాలతో రాచకొండ, ఆమనగల్లు పర్యటన వాయిదా పడింది. మళ్లీ సోమవారం సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేసేందుకు నిర్ణయించారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి నే రుగా హెలికాప్టర్లో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మంత్రులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డిలతో కలిసి రాచకొండకు రానున్నారు. మూడు రౌండ్లలో రాచకొండను చుట్టివస్తారు. అనంతరం రామాలయం వద్ద సిద్ధం చేసిన హెలిపాడ్ వద్ద కిందికి దిగనున్నారు. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన రామాలయంలో ప్రత్యేక పూజలు చేస్తా రు. అక్కడే ఏర్పాటు చేసిన రాచకొండ చరిత్రను, ప్రకృతి అందాలను కళ్లకు కట్టే చిత్రాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించనున్నారు. రెండు జిల్లాల పరిధిలో 35వేల ఎకరాల ప్రభుత్వ భూములు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో రెండు జిల్లాల పరిధిలో 35వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములున్నాయి. వీటిని సీఎం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలన చేసి, భవిష్యత్ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలనే ఆలోచనతో పర్యటిస్తున్నారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ పక్క రాష్ట్రానికి తరలిపోకుండా కాపాడుకునేందుకు 2వేల ఎకరాలలో, అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రపం చం దృష్టిని ఆకర్షించేలా ఫిలింసిటీని నిర్మిస్తామని కేసీఆర్ పలుమార్లు స్వయంగా ప్రకటించా రు. అయితే రాచకొండ ఫిలింసిటీ ఏర్పాటుకు అనువైన ప్రాంతమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఏరియల్ సర్వే చేస్తున్నారు. దీనికి తోడు ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములను కే టాయించాలనే ఆలోచనలో కూడా ఉంది.