రాచకొండలో నేడు సీఎం ఏరియల్ సర్వే | KCR to undertake aerial survey of Rachakonda hills today | Sakshi
Sakshi News home page

రాచకొండలో నేడు సీఎం ఏరియల్ సర్వే

Dec 15 2014 3:03 AM | Updated on Aug 13 2018 3:55 PM

రాచకొండలో నేడు సీఎం ఏరియల్ సర్వే - Sakshi

రాచకొండలో నేడు సీఎం ఏరియల్ సర్వే

రంగారెడ్డి-నల్లగొండ జిల్లాల సరిహద్దులోని రాచకొండ ప్రాంతాన్ని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చేయనున్నారు. వాస్తవానికి

చౌటుప్పల్ : రంగారెడ్డి-నల్లగొండ జిల్లాల  సరిహద్దులోని రాచకొండ ప్రాంతాన్ని  సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చేయనున్నారు. వాస్తవానికి ఈ నెల 3వ తేదీన రాచకొండతోపాటు మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు, రంగారెడ్డి జిల్లా కంద కూరు మండలం ముశ్చర్లలో ఏరియల్ సర్వే చేయాలనుకున్నారు. అదేరోజు ముశ్చర్లలో ఫార్మా ప్రతినిధులతో కలిసి ఏరియల్ సర్వే చేసినప్పటికీ, అనివార్యకారణాలతో రాచకొండ, ఆమనగల్లు పర్యటన వాయిదా పడింది. మళ్లీ సోమవారం సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేసేందుకు నిర్ణయించారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి నే రుగా హెలికాప్టర్‌లో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మంత్రులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డిలతో కలిసి రాచకొండకు రానున్నారు. మూడు రౌండ్లలో రాచకొండను చుట్టివస్తారు. అనంతరం రామాలయం వద్ద సిద్ధం చేసిన హెలిపాడ్ వద్ద కిందికి దిగనున్నారు. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన రామాలయంలో ప్రత్యేక పూజలు చేస్తా రు. అక్కడే ఏర్పాటు చేసిన రాచకొండ చరిత్రను, ప్రకృతి అందాలను కళ్లకు కట్టే చిత్రాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించనున్నారు.
 
 రెండు జిల్లాల పరిధిలో 35వేల ఎకరాల ప్రభుత్వ భూములు
 నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో రెండు జిల్లాల పరిధిలో 35వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములున్నాయి. వీటిని సీఎం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలన చేసి, భవిష్యత్ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలనే ఆలోచనతో పర్యటిస్తున్నారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ పక్క రాష్ట్రానికి తరలిపోకుండా కాపాడుకునేందుకు 2వేల ఎకరాలలో, అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రపం చం దృష్టిని ఆకర్షించేలా ఫిలింసిటీని నిర్మిస్తామని కేసీఆర్ పలుమార్లు స్వయంగా ప్రకటించా రు. అయితే రాచకొండ ఫిలింసిటీ ఏర్పాటుకు అనువైన ప్రాంతమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఏరియల్ సర్వే చేస్తున్నారు. దీనికి తోడు ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములను కే టాయించాలనే ఆలోచనలో కూడా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement