breaking news
Raavana
-
పౌరాణిక చిత్రం 'రావణ'లో రానా..?
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రానా.. కెరీర్ స్టార్టింగ్ నుంచే స్టోరి సెలక్షన్ లో కొత్త దనం చూపిస్తూ దూసుకుపోతున్నారు. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించకుండా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నారు. తెలుగు తో పాటు తమిళ, హిందీ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో బాహుబలి సినిమాతో విలన్ గా జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. బాహుబలి సినిమాలో భల్లాలదేవగా ఆకట్టుకున్న రానా త్వరలో గుణశేఖర్ తెరకెక్కించబోయే హిరణ్యకశ్యపలోనూ నటిస్తున్నారు. అయితే తాజాగా రానా మరో పౌరాణిక చిత్రంలో నటించనున్నాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో రావణ అనే పౌరాణిక చిత్రాన్ని నిర్మించేందుకు చాలా కాలం క్రితమే పనులు ప్రారంభించారు. మోహన్ బాబు రావణుడి పాత్రలో నటించనున్న ఈ సినిమాను రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. పలువురు కోలీవుడ్, బాలీవుడ్ నటులు ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ సినిమాతో రానా ఆంజనేయుడిగా నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జానపద, చారిత్రక పాత్రలతో ఆకట్టుకున్న రానా, త్వరలో పౌరాణిక చిత్రంతోనూ మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. -
కిడ్నాప్ చేయడమే రావణాసురుడి తప్పా?
-
కిడ్నాప్ చేయడమే రావణాసురుడి తప్పా?: వర్మ
ఎప్పుడూ ప్రస్తుత పరిణామాల మీద మాత్రమే విరుచుకుపడే రాంగోపాల్ వర్మ ఒక్కసారిగా ఇతిహాసాల మీద పడ్డాడు. రామాయణంలోని రావణాసురుడిని, ప్రస్తుత కాలంలోని కరుడుగట్టినవారితో పోల్చి అయనకన్నా పెద్ద విలన్లు భారతదేశంలో కుప్పలుతెప్పలుగా ఉన్నారంటూ తనదైన శైలిలో చెప్పాడు. రాంగోపాల్ వర్మ ఏమన్నారో ఆయన ట్వీట్లలోనే... ''రావణాసురుడు సీతను అపహరించి తన ఆధీనంలో నెలల తరబడి ఉంచాడు. కానీ ఏదైనా అఘాయిత్యానికి ఒడిగట్టాడా? ... ఆహా ఏదో అడుగుతున్నా. రావణుడు విలన్ అని తెలుసు.. కానీ హిట్లర్, ఒసామా బిన్ లాడెన్లలా.. కరుడు గట్టిన విలన్లా ప్రవర్తించినట్టు ఎప్పుడూ వినలేదు. ఒక విలన్లా రావణాసురుడు ఎప్పుడూ చేయలేదు... అయినా నిజంగా అతనొక పెద్ద విలనా? (దీనిపై పోల్ క్వశ్చన్ కూడా పెట్టారు) నేను చదివిన వాటిలో రాక్షసులు ఎవరూ రాక్షసులు చేసే పనులు చేయలేదు. మరోలా చెప్పాలంటే రచయితలు ఎవరూ క్యారెక్టర్లని సరిగా డెవలప్ చేయలేదు కానీ మనం వాటిని గుడ్డిగా నమ్ముతున్నాం.. సీతను అపహరించడమే రావణాసురుడి తప్పయితే.. భారత్లో ప్రతి నెలా 100 మందికి పైగా రావణాసురుడి కన్నా పెద్ద విలన్లను మనం అందించొచ్చని అనుకుంటున్నాను'' అని వర్మ అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టి వరుసగా ట్వీట్లు చేసుకుంటూ పోయారు. ఐఎస్ఐఎస్ని తయారు చేసి పెంచి పోషించింది అమెరికా కాదా? అని ట్వీట్ చేశారు. Apart from not commiting any atrocity on Sita,inspite of being in his custody for months,did Ravana commit any other atrocities? just asking — Ram Gopal Varma (@RGVzoomin) November 15, 2015 I know that Ravana was a villain but I never heard a single act of villainy of his like I heard of Hitler,Osama bin laden etc — Ram Gopal Varma (@RGVzoomin) November 15, 2015 If Raavana's only crime is just kidnapping Sita I think we produce atleast 100 much more bigger villains every month in India — Ram Gopal Varma (@RGVzoomin) November 15, 2015