breaking news
in Q2 net
-
వేదాంత లాభం రూ. 2,158 కోట్లు
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ క్వార్టర్లో 61 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.1,343 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.2,158 కోట్లకు పెరిగిందని వేదాంతా తెలిపింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం కలిసి వచ్చిందని, దీనికి ఇతర ఆదాయం 49 శాతం పెరగడం తోడయిందని, అందుకే నికర లాభం ఈ క్యూ2లో ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఈఓ శ్రీనివాసన్ వెంకటకృష్ణన్ పేర్కొన్నారు. ఆదాయం మాత్రం రూ.23,279 కోట్ల నుంచి రూ.22,814 కోట్లకు తగ్గిందన్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం... కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనాలు రూ.1,891 కోట్లుగా ఉన్నాయి. గత క్యూ2లో రూ.574 కోట్లుగా ఉన్న ఇతర ఆదాయం ఈ క్యూ2లో రూ. 856 కోట్లకు పెరిగింది. ఈ క్యూ2లో రూ.3,279 కోట్ల మేర స్థూల రుణ భారం తగ్గింది. ఇక నికర రుణ భారం రూ.8,322 కోట్ల మేర తగ్గింది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.35,817 కోట్లుగా ఉన్నాయి. బీఎస్ఈలో వేదాంత షేర్ 3 శాతం నష్టంతో రూ.144 వద్ద ముగిసింది. -
ఇండస్ ఇండ్ లాభం 26 శాతం జంప్
ముంబై : ప్రయివేటు రంగ బ్యాంకు ఇండస్ ఇండ్ బ్యాంకు అంచనాలకు అనుగుణంగానే బుధవారం ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30 తో ముగిసిన క్యూ2 లో 25.7 శాతం జంప్ చేసి 704 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.560 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం 33 శాతం వృద్ధితో రూ.1,460 కోట్లుగా నమోదు చేసింది. అయితే బ్యాంక్ ఎన్పీఏ 0.38 శాతం నుంచి 0.37 శాతానికి క్షీణించింది. వడ్డీ రూపలో వచ్చిన రూ.3,469 కోట్లకు పెరిగింది. గ త ఏడాది ఇదే క్వార్టర్ లో ఇది రూ.2,798 కోట్లుగా నమోదైంది