breaking news
purification
-
మోదీగారు...‘శుద్దీకరణ’ నేరం!
న్యూఢిల్లీ: ‘శుద్దీకరణ’వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలకు దిగారు. కొన్ని రోజుల క్రితం ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను భారతీయ జనతా పార్టీ నేతలు శుద్ధి చేయడంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ఘటన ఒక నేరమని, ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యులపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చూడాలని రాహుల్ గాంధీ శనివారం డిమాండ్ చేశారు. దళితులు బాగుంటే ఓర్చుకోలేని బీజేపీ–ఆర్ఎస్ఎస్ మనస్తత్వం ఇదని ఆయన న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. నేరం జరిగి 20 రోజులు అవుతున్నా ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఎత్తి చూపారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం కల్పించండి. న్యాయ దక్కేలా చేయడం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.’’అని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఉత్తరాఖండ్ విభాగం అధ్యక్షుడు మహేంద్ర భట్ ‘శుద్ధీకరణ’ను సమర్థించుకున్నారని ఆరోపించిన రాహుల్.. ఆ ‘‘ఆ పని (శుద్ధీకరణ) చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నది మా డిమాండ్. ప్రధాని నరేంద్ర మోదీ తాను అన్ని కులాలకు చెందిన వాడినని, దేశానికి ప్రధానిని అని చెబుతూంటారు. కానీ ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మాత్రం శుద్ధీకరణను సమర్థించుకుంటున్నారు’’అని విమర్శించారు. శుద్దీకరణ చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్లని, వారిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ప్రధాని ఆదేశించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘‘హల్ద్వానీలో ఖర్గే ర్యాలీ జరిగిన రెండు రోజులకు ఆగస్టు పదవ తేదీన వాళ్లు శుద్దీకరణ చేశారు. ఇది నేరం. ఆగస్టు 13న ఖర్గే ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తారు’’అని గుర్తు చేశారు. ‘‘రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధమిది. రాజ్యాంగాన్ని అందించిన బీఆర్ అంబేద్కర్ లాంటి వారు, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూలు ఒకపక్కన ఉంటే బీజేపీ–ఆర్ఎస్ఎస్ ఇంకోపక్కన ఉన్నాయి’’ అని అన్నారు.దళితులపై వేల ఏళ్లుగా హింసదళితులపై వేల ఏళ్లుగా హింస జరుగుతోందని, రాజ్యాంగం ప్రకారం ఇది అక్రమమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈనాటికి కూడా దళిత బిడ్డలతో పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్నారని, ఇదీ ఈ దేశపు వాస్తవం అని రాహుల్ ఆరోపించారు. దళితులు బావుల్లోంచి నీరు తాగకుండా, టీకొట్లలో రెండు గ్లాసుల పద్ధతి పాటిస్తున్నారని ఒకటి దళితులకు, ఇంకోటి ఇతరులకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. దళిత వరుడు గుర్రంపై ఊరేగుతూ ఎక్కడ తనను కొడతారో అన్న భయంతో హెల్మెట్ ధరించాల్సిన భారత్‌లో ఉన్నామని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే మాత్రమే కాకుండా రాజస్థాన్ నేత తికారామ్ జుల్లి, ఎన్డీయే మంత్రి జీతన్ రామ్ మాంఝీలు కూడా పలు సందర్భాల్లో శుద్దీకరణ అవమానాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారని రాహుల్ వివరించారు. దళితులు ఎంత సక్సెస్ సాధిస్తే అతడిపై దాడులు అంత తీవ్రంగా ఎక్కువవుతాయని ఆరోపించారు. ‘‘ఇది అంటరానితనానికి మరోపేరు’’అని చెప్పారు. -
ఖర్గే సభా వేదిక ‘శుద్ధి’ వివాదం.. రాజ్యసభలో దుమారం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో తన ర్యాలీకి కేటాయించిన వేదికను బీజేపీ నేతలు ‘శుద్ధి’ కార్యక్రమాలతో శుభ్రం చేశారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ఆరోపణలు రాజ్యసభలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటన కుల వివక్ష, అంటరానితనానికి నిదర్శనమని ఖర్గే మండిపడ్డారు.గురువారం రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఖర్గే.. హల్ద్వానీలోని రామలీలా మైదానంలో తన సభ జరగాల్సిన ప్రదేశంలో తన రాక తర్వాత కొందరు బీజేపీ నేతలు హవనం, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపించారు. ఇది దళితుల పట్ల వివక్షను ప్రతిబింబిస్తోందని, బీజేపీ దళిత వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెడుతోందని విమర్శించారు.#WATCH | In Rajya Sabha, LoP and Congress chief Mallikarjun Kharge says, "...I was in Haldwani where I made a public speech at Ramlila Maidan. Lakhs of people were there. At that time, I did not mention the name of any community or religion; I only reiterated the issues of the… pic.twitter.com/oePxPC0jBr— ANI (@ANI) August 13, 2026దీనిని బీజేపీ సమర్థించదుఖర్గే ఆరోపణలపై కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే.. ఇలాంటి చర్యలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని స్పష్టం చేశారు. “ఖర్గే జీ చేసిన వ్యాఖ్యలు బాధాకరం. ఇది కాంగ్రెస్‌కు మాత్రమే కాదు.. మనందరికీ బాధ కలిగించే విషయం. బీజేపీ ఇలాంటి కార్యక్రమాలను ఎన్నడూ సమర్థించదు. ఘటనపై కచ్చితంగా విచారణ జరిపిస్తాం. తప్పు చేసిన వారు ఎవరైనా ఉంటే తగిన చర్యలు తీసుకుంటాం” అని నడ్డా హామీ ఇచ్చారు.అయితే, ఈ ఘటనకు మొత్తం పార్టీని బాధ్యురాలిగా చూపడాన్ని నడ్డా ఖండించారు. పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండానే బీజేపీపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఖర్గే మనోభావాలు దెబ్బతిన్నందుకు చింతిస్తున్నామని, ఈ అంశాన్ని పార్టీ అధ్యక్షుడి హోదాలో పరిశీలిస్తానని తెలిపారు.#WATCH | In Rajya Sabha, Leader of House and Union Minister JP Nadda responds to LoP Mallikarjun Kharge; says, "What Kharge ji said is really sad - not just for Congress party but for all of us...BJP does not subscribe to such activities. Never. But we will investigate this. I… pic.twitter.com/pC2Fx25vPV— ANI (@ANI) August 13, 2026రాజ్యసభలో వాడీవేడి చర్చఖర్గే వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీలు ఆరోపణలను ఖండించగా.. కాంగ్రెస్ సభ్యులు సామాజిక సమానత్వం, దళిత గౌరవం అంశాలను ప్రస్తావించారు. అంటరానితనం వంటి వివక్షకు ఎలాంటి స్థానం లేదని, ఘటన నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార పక్షం పేర్కొంది. అయితే పార్టీపై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని స్పష్టం చేసింది.రాజ్యసభ ఛైర్మన్ తీవ్ర వ్యాఖ్యలుఈ వివాదంపై రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ కూడా స్పందించారు. అంటరానితనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. “అంటరానితనం పాపం కాకపోతే.. ఈ ప్రపంచంలో అంతకంటే పెద్ద పాపం మరొకటి ఉండదు. పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా మనమంతా దీనిని వ్యతిరేకిస్తున్నాం. మనల్ని ఎవ్వరూ శుద్ధి చేయాల్సిన అవసరం లేదు.. మనమంతా ఇప్పటికే శుద్ధులమే” అని అన్నారు. ఘటనపై విచారణ జరిపి, తప్పు చేసిన వారు ఎవరైనా ఉంటే బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.‘హవనం అవసరం ఏమొచ్చింది?’.. ఖర్గే ఫైర్ఇదే అంశంపై ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై మరింత తీవ్ర విమర్శలు చేశారు. “ఈ దేశంలో దళితులకు స్థానం లేదని మేం చాలా కాలంగా చెబుతున్నాం. అసలు అక్కడ హవనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?” అని ప్రశ్నించారు. హల్ద్వానీ రామలీలా మైదానంలో అన్ని పార్టీల నేతలు సభలు నిర్వహిస్తుంటారని, కానీ తన సభకు ముందు నిర్వహించిన శుద్ధి కార్యక్రమం హిందూ ధర్మ స్ఫూర్తికి కూడా విరుద్ధమని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలేనని ఆరోపించిన ఖర్గే.. దేశాన్ని విభజించేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. -
కోనేరులో కాళ్లు కడిగిన బిగ్‌బాస్ బ్యూటీ.. అపవిత్రమైందంటూ ఆలయ శుద్ధి
దేశంలో ప్రసిద్ది పొందిన శ్రీకృష్ణ ఆలయాల్లో కేరళ త్రిసూర్ గురువాయూర్ దేవాలయం ఒకటి. ఓటీటీ సినిమాలతో ఈ ఆలయం తెలుగువారికి సుపరిచితమే. అలాంటిచోట అపవిత్రం జరిగిందంటూ మంగళవారం ఆలయ శుద్ధి పనులు చేపట్టారు నిర్వాహకులు. ఓ మహిళా యూట్యూబర్ అతిచేష్టలే అందుకు కారణంగా తెలుస్తోంది.సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ జాస్మిన్ జాఫర్.. వారం కిందట గురువాయూర్ ఆలయానికి వెళ్లింది. ఆ సమయంలో కోనేరులో కాళ్లు కడుగుతూ.. ఆ ప్రాంగణమంతా కలియ దిరుగుతూ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో రీల్ రూపేణా పోస్ట్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది.గురువాయూర్ ఆలయంలో ఇలా ఫొటోలు, వీడియోలు తీసుకోవడం నిషేధం!. దీంతో నిబంధనలను ఉల్లంఘించి మరీ ఆచారాన్ని మంటగలిపిందంటూ పలువురు ఆమె చర్యపై మండిపడ్డారు. ఒక హిందూయేతర మహిళ.. అందునా ఆలయ పవిత్రతను దెబ్బ తీసేలా వ్యవహరించిందంటూ ఇటు ఆలయ నిర్వాహకులు సైతం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో..రుద్రతీర్థం(కోనేరు పేరు) అపవిత్రమైందంటూ ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దైవదర్శనాన్ని పూర్తిగా నిలిపివేశారు. అంతేకాదు.. ఘటన జరిగి ఆరు రోజులు కావస్తుండడంతో.. ఈ ఆరురోజులపాటు జరగాల్సిన 18 పూజలు, 18 శీవెలీలు తిరిగి నిర్వహిస్తున్నారు. పూజలన్నీ పూర్తయ్యాకే నలంబలంలో(గురువాయూర్ సమీపంలోని నాలుగు ఆలయాలు) ప్రవేశానికి అనుమతిస్తామని.. కాస్త ఓపికగా సహకరించాలని భక్తులకు దేవస్థానం వారు విజ్ఞప్తిచేశారు.మరోవైపు ఈ ఘటనపై పాలనాధికారి అరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియమాలను ఉల్లంఘించి మరీ ఆమె వీడియో తీసిందని మండిపడ్డారు. పవిత్రత రిత్యా కోనేరు సహా ఆలయ ప్రాంగణంలో కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి చిత్రీకరణలకు వీల్లేదని గతంలో కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారమే కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. జాస్మిన్ జాఫర్(25).. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఫ్యాషన్ డిజైనర్. ఆమెకు సోషల్ మీడియాలో మిలియన్నర ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫేమ్తోనే బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ సీజన్లో సెకండ్ రన్నరప్‌గా ఆమె నిలిచింది. అటుపై ఆమె ఫేమ్ మరింత పెరిగింది. అయితే తాజా వివాద నేపథ్యంలోనే ఆ వీడియో తొలగించిన జాఫర్.. ఆ పరిమితుల గురించి తెలియకపోవడం వల్లే ఇలా జరిగిందని తప్పు ఒప్పుకుంది.


