breaking news
Punjab Assembly polls
-
పంజాబ్‌లో ముందస్తు ఎన్నికలు.. సీఎం అభ్యర్థి మాత్రం..!
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు నిర్ణీత సమయం కంటే ముందే జరిగే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. బఠిండాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కేజ్రీవాల్... 2027 ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలు 2026 నవంబర్లోనే జరిగే అవకాశం ఉందని చెప్పారు.అయితే ముందస్తు ఎన్నికలకు కారణం ఏంటనే విషయాన్ని ఆయన వివరించలేదు. అయినప్పటికీ, ముందస్తు ఎన్నికలు వస్తే సిద్ధం కావడానికి కొన్ని నెలలే మిగులుతాయని చెబుతూ పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.భగవంత్ మానే ఆప్ సీఎం అభ్యర్థితదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మానేనని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మాన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించడంపైనే పార్టీ దృష్టి ఉండాలని చెప్పారు. గత నాలుగు ఏళ్లలో పంజాబ్ ప్రభుత్వం చూపిన పనితీరు ప్రజల విశ్వాసాన్ని, మద్దతును సంపాదించిందని కేజ్రీవాల్ అన్నారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సీనియర్ ఆప్ నేత మనీశ్ సిసోడియా, పంజాబ్ ఆప్ అధ్యక్షుడు అమన్ అరోరాతో కలిసి కేజ్రీవాల్ బఠిండాలో రోడ్‌షోలో పాల్గొన్నారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి మద్దతు ఇచ్చిన ఓటర్లకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. బర్నాలా, మోగా, బటాలా, బఠిండా మున్సిపల్ కార్పొరేషన్లలో ఆప్ కౌన్సిలర్లు మేయర్లుగా ఎన్నికయ్యారని, ఇది పార్టీ పాలనపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు.ప్రతిపక్షంపై కేజ్రీవాల్ విమర్శలుప్రత్యర్థి పార్టీల పేర్లు ప్రస్తావించకుండా కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఒక పార్టీని "చిట్టా పార్టీ", మరో పార్టీని "ఫైటింగ్ పార్టీ", ఇంకో పార్టీని "ఈడీ పార్టీ"గా పేర్కొంటూ, మాదకద్రవ్యాల సమస్యతో సంబంధం ఉండటం, అంతర్గత కలహాలు, ప్రత్యర్థులను భయపెట్టేందుకు కేంద్ర సంస్థలను వినియోగించడం వంటి పనులు చేస్తున్నాయని ఆరోపించారు.దీనికి భిన్నంగా, ప్రజా సంక్షేమం, అభివృద్ధిపైనే దృష్టి పెట్టిన పార్టీగా ఆప్‌ను ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ పనితీరును సమర్థిస్తూ, పంజాబ్ ప్రజలు చూసిన అత్యంత నిజాయితీ నాయకుల్లో ఆయన ఒకరని అన్నారు. గత ప్రభుత్వాలపై అవినీతి, కుంభకోణాల ఆరోపణలు వచ్చేవని, అయితే మాన్ పదవీకాలంలో అలాంటి ఆరోపణలు ఏవీ రాలేదని కేజ్రీవాల్ చెప్పారు. ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలు చర్యలు తీసుకుని ఉండేవని ఆయన వాదించారు.పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కేజ్రీవాల్ ప్రస్తావించారు. ఉచిత విద్యుత్, రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా రక్షణ అందిస్తున్నామని చెప్పారు. అలాగే జులై నుంచి మహిళలకు ఆర్థిక సాయం ప్రారంభమవుతుందని ప్రకటించారు. అర్హులైన మహిళలకు నెలకు రూ.1,000, షెడ్యూల్డ్ కులాల మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామని తెలిపారు. -
రెండు డజన్ల మందికి డిపాజిట్ గల్లంతు
చండీగఢ్: పంజాబ్ లో పాగా వేయాలని భావించి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రెండో స్థానానికి పరిమితమైంది. 20 స్థానాలు గెలిచి రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 26 నియోజవర్గాల్లో ఆప్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. 24 చోట్ల డిపాజిట్ కోల్పోయారు. కేజ్రీవాల్ పార్టీతో పొత్తు పెట్టుకున్న లోక్ ఇన్సాఫ్ పార్టీ రెండు చోట్ల పాగా వేసింది. అయితే ఆప్ కంటే తక్కువ సీట్లు(15) గెలిచిన అకాలీదళ్ ఓట్ల శాతం పరంగా దానికంటే ముందుంది. ఆప్ కు 23.9 శాతం ఓట్లు రాగా, అకాలీదళ్ కు 25.3 శాతం ఓట్లు వచ్చాయి. 77 స్థానాలను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 38.5 శాతం ఓట్లు పడ్డాయి. 5 శాతం ఓట్లతో బీజేపీ మూడు సీట్లు దక్కించుకుంది. తమకు 100 వరకు సీట్లు వస్తాయని ఎన్నికలకు ముందు ఆప్ నేతలు దీమా వ్యక్తం చేయగం గమనార్హం. -
ఒక్కో టికెట్.. 2 నుంచి 2.5 కోట్లు
చండీగఢ్: అవినీతి ఆరోపణల కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కన్వీనర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సుచాసింగ్ చోటేపూర్ పార్టీ ఢిల్లీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ ఢిల్లీ నేతలు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కోట్లాది రూపాయలకు టికెట్లు అమ్ముకుంటున్నారని బాంబు పేల్చారు. ఆప్ కేంద్ర నాయకత్వం పంజాబ్‌కు చెందిన ఏ నాయకుడినీ పార్టీలో ఎదగనీయడం లేదని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. రెండు నుంచి రెండున్నర కోట్ల రూపాయలు తీసుకుని ఆప్ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. గురుదాస్‌పూర్ జిల్లా నుంచి పరివర్తన్ యాత్రను సుచాసింగ్ ప్రారంభించారు. ఢిల్లీ ఆప్ నేతల వల్ల తనకు, పంజాబ్ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు వివరిస్తానని చెప్పారు. పార్టీ కోసం పగలు, రాత్రి కష్టపడ్డానని, సొంత డబ్బు ఖర్చు చేశానన్నారు. పంజాబ్, ఎన్ఆర్ఐల నుంచి వసూలు చేసిన నిధుల గురించి తనకు ఏమాత్రం చెప్పలేదని, ఎన్ఆర్ఐలు ఇచ్చిన కోట్లాది రూపాయలను ఆప్ ఢిల్లీ నేతలు తీసుకెళ్లారని చెప్పారు. పంజాబ్‌లో పార్టీకి కోశాధికారిని కూడా నియమించలేదని తెలిపారు. పంజాబ్‌లో ఆప్‌కు బ్యాంక్ ఎకౌంట్ లేదని, నిధులన్నీ ఢిల్లీకి తీసుకెళ్లారని సుచాసింగ్ అన్నారు.


