breaking news
psychiatry doctor
-
స్నేహితుడి కూతురు కోసం వెల కట్టలేని గిఫ్ట్..! నెటిజన్లు ఫిదా
ఓ వ్యక్తి స్నేహితుడి కూతురు కోసం అందమైన గిఫ్ట్‌ని స్వయంగా తన చేతులతో సిద్ధం చేశాడు. తీరిగ్గా చేసింది కాదు. బిజీ షెడ్యూల్లో రెండు విమానాల జర్నీలో అలవొకగా తయారు చేశాడు. నిజంగా అది అతడి నైపుణ్యం, విలువైన గిఫ్ట్ ఇవ్వాలన్నా అతడి ఆలోచనకు నిదర్శనం. ఆ గిఫ్ట్ నెటిజన్ల మనసుని అమితంగా దోచుకోవడమే కాదు..అతని క్రియేటివిటీకి ఫిదా అయ్యారు కూడా.వెల్లూరు మెడికల్ కాలేజీలో సైక్రియాట్రిక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ధీరజ్ తన బిజీ విమానాల షెడ్యూల్లో తన స్నేహితుడి కూతురు కోసం గిఫ్ట్ తయారు చేశాడు. లేత గులాబీ వూల్‌తో అల్లిన ఆ టోపీ ఎంత అందంగా ఉందంటే..అతడు అల్లికల్లో కూడా డాక్టర్ అని అనొచ్చేమో అన్నంత అందంగా కుట్టేశాడు. చేతితో తయారు చేసిన ఈ గిఫ్ట్ అతడి క్రియేటివిటీకి, శ్రమకు నిదర్శనం.జస్ట్ మూడు రోజుల్లో రెండు విమానాల ప్రయాణాల వ్యవధిలో ఈ టోపిని అల్లేయడం విశేషం.అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేస్తూ..మూడే మూడు రోజుల్లో రెండు విమాన జర్నీలలో స్నేహితుడి కుమార్తె కోసం తయారు చేసిన టోపీ అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు. నెటిజన్లు దొరికిన ఖాళీ సమయాన్ని వృధాగా పోనివ్వకుండా క్రియేటివిటీగా చేతితో తయారు చేసిన గిఫ్ట్ ఇవ్వాలనుకోవడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం. ఇది వెలకట్టలేని అమూల్యమైన గిఫ్ట్. అన్ని డబ్బులతో కొనలేం అనేందుకు ఈ గిఫ్టే ఉదాహరణ అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.Two flight trips in three days. Finished a beanie for friend's daughter. pic.twitter.com/SVM7tmRUjt— Dr Dheeraj K, MD, DM, 🇮🇳🇬🇧🇦🇺 (@askdheeraj) December 16, 2025 (చదవండి: Sobhita Dhulipala: గోల్డెన్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా మెరిసిన శోభితా ధూళిపాళ..!) -
స్మార్ట్ ఫోన్‌కు అడిక్టయి.. గతం మర్చిపోయిన యువకుడు
జైపూర్: ఓ యువకుడు స్మార్ట్ ఫోన్‌కు విపరీతంగా అడిక్ట్ అయ్యి గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. తీవ్రమానసిక సమస్యతో కన్నతల్లిదండ్రులను కూడా గుర్తించలేని స్థితికి చేరుకున్నాడు. అసలేంజరిగిందంటే.. రాజస్థాన్‌లోని చూరు జిల్లాలో సహ్వా టౌన్‌కు చెందిన అక్రామ్ (20) స్మార్ట్ ఫోన్ మోజులోపడి గతనెల రోజుల్లో చేస్తున్న బిజినెస్‌ను వదిలేశాడు. అంతేకాకుండా గత ఐదురోజులుగా నిద్రకూడా పోవట్లేదట. పరిస్థతి విషమించడంతో కుటుంబసభ్యులు భార్టియా ఆసుపత్రి ఎమర్జెన్సీ వర్డులో చేర్పించారు. ప్రస్తుతం సైకియాట్రస్టులు వైద్యం అందిస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం అతనికి వరుసకు మామైన అర్బాజ్ మాట్లాడుతూ ‘మా ఊరిలోనే అక్రమ్‌కు ఎలక్ట్రిక్ వైడనింగ్ వ్యాపారం ఉంది. ఐతే గత నెల రోజులుగా అధిక సమయం మొబైల్‌తోనే గడుపుతున్నాడు. ఫోన్ చూడటంలోపడి చేస్తున్న పని కూడా మానేశాడు. కుటుంబసభ్యులు పదేపదే చెప్పినా మొబైల్‌ని చూడటం మాత్రం మానలేదని తెలిపాడు. కొన్ని రోజులుగా రాత్రంతా మొబైల్లో చాట్లు, గేమ్‌లు ఆడుతున్నాడు. తినడం, త్రాగటం కూడా మానేశాడని తల్లి ఆవేధనతో స్థానిక మీడియాకు తెల్పింది. ఈ విషయమై మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. యువకుడికి సిటీ స్కాన్ చేసి చికిత్స అందిస్తున్నామన్నారు. చదవండి: వృత్తేమో టీచర్... వారానికోసారి మాత్రమే స్నానం.. కాస్తమీరైనా చెప్పండి!! -
కాన్సాస్‌లో తెలుగు వైద్యుడి హత్య
- కత్తితో పలుమార్లు పొడిచిన రోగి.. - అక్కడికక్కడే చనిపోయిన అచ్యుత్ రెడ్డి - పోలీసుల అదుపులో నిందితుడు - అచ్యుత్ స్వస్థలం మిర్యాలగూడ - పాతికేళ్లుగా అమెరికాలోనే ప్రాక్టీస్ మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఎన్నారై మానసిక వైద్య నిపుణుడు నాగిరెడ్డి అచ్యుత్‌రెడ్డి (57) అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు. కాన్సస్ రాష్ట్రం ఈస్ట్ విచిత పట్టణంలో సెంట్రల్ ఎడ్జ్మూర్ వద్ద ఆయన నిర్వహిస్తున్న హోలిస్టిక్ సైకియాట్రిక్ క్లినిక్ సమీపంలోనే భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. పలుమార్లు కత్తిపోట్లకు గురై అచ్యుత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. అచ్యుత్‌రెడ్డి వద్ద చికిత్స పొందుతున్న ఉమర్ రషీద్ దత్ (21) అనే రోగి ఈ హత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. మృతదేహాన్ని పార్కింగ్ వెనక భాగంలో పోలీసులు గుర్తించారు. దత్‌ను విచిత కంట్రీ క్లబ్ సమీపంలో అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. విచారణ కొనసాగుతోందని స్థానిక పోలీసు అధికారి లెఫ్టినెంట్ టాడ్ ఒజిల్ తెలిపారు. ‘‘దత్ కొంతకాలంగా అచ్యుత్‌రెడ్డి వద్ద వైద్యం చేయించుకుంటున్నట్టు తెలిసింది. హత్యకు ముందు వారిద్దరూ కలిసే క్లినిక్ భవనంలోకి వెళ్లారు. తర్వాత దత్ బయటికొచ్చి, ఆ వెంటనే మళ్లీ లోనికి వెళ్లాడు. అచ్యుత్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా దత్ ఆయనను వెంబడించి కత్తితో పలుమార్లు పొడిచాడు’’ అని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ ఒజిల్ చెప్పారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. అచ్యుత్‌రెడ్డి తల్లిదండ్రులు నాగిరెడ్డి భద్రారెడ్డి, పారిజాత మిర్యాలగూడలోని సీతారాంపురంలో ఉంటున్నారు. కుమారుని మరణ వార్త తెలిసి వారు కుప్పకూలిపోయారు. గురువారం ఉదయమే తమకు ఈ దుర్వార్త తెలిసిందంటూ భద్రారెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. అచ్యుత్‌రెడ్డి కుటుంబసభ్యులు, బంధువులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. పాతికేళ్ల క్రితమే అమెరికాకు అచ్యుత్‌రెడ్డి నల్లగొండ పట్టణంలోనే పాఠశాల విద్య అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1986లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తర్వాత అమెరికా వెళ్లి విచితలోని యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్ మెడికల్ స్కూల్ నుంచి సైకియాట్రీలో రెసిడెన్సీ పూర్తి చేశారు. అనంతరం 1989 నుంచి అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. విచితలో హోలిస్టిక్ సైకియాట్రిక్ సర్వీసెస్‌ను నిర్వహిస్తూనే పలు స్థానిక ఆస్పత్రుల్లో కన్సల్టెంట్‌గా కూడా కొనసాగుతున్నారు. ఆయన భార్య బీనా అనస్తీషియా స్పెషలిస్టు. వారికి ఇద్దరు కూతుళ్లు రాధ, లక్ష్మి, కుమారుడు విష్ణు ఉన్నారు. అచ్యుత్‌రెడ్డి ఏటా మిర్యాలగూడ వచ్చి నెల పాటు తల్లిదండ్రుల వద్ద ఉండేవారు. 2017 జనవరిలో కూడా వచ్చి మూడు వారాలు ఉండి వెళ్లారు.


