breaking news
Professional dancer
-
సీరియల్ కిల్లర్ గా మారిన డాన్సర్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ డాన్సర్ గా రాణించాలనుకున్న ఓ మైనర్ బాలుడు వరుసగా హత్యలకు పాల్పడ్డం ఆందోళన రేపింది. పాపులర్ డ్యాన్స్ రియాల్టీ షో లో పాల్గొనాలనే కోరికను నెరవేర్చుకునేందుకు గతేడాది బాలుడిని హత్య చేసినవాడే తాజాగా మరో దారుణానికి పాల్పడ్డాడు. ఒంటరిగా వున్న వృద్ధురాలిని అంతమొందించాడు. ఢిల్లీలోని బికె దత్తా కాలనీలో నివసించే మితిలేష్ జైన్(65) తన నివాసంలో చనిపోయివుండగా బంధువులు గమనించారు. మొదట సహజ మరణంగానే అందరూ భావించారు. కానీ ఆమెకు సంబంధించిన, నగదు, నగలు, సెల్ ఫోన్స్ కనపించకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు. గొంతు నులిమి హత్య చేసినట్టుగా పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. ఈ లోపు కనిపించకుండా పోయిన ఆమె మొబైల్ ఆన్ అయింది. దీని ఆధారంగా కూపీ లాగిన పోలీసులు నిందితుడి వివరాలు తెలుసుకొని షాక్ అయ్యారు. గత సెప్టెంబర్ లో 13 ఏళ్ల స్వప్నేష్ గుప్తాను హత్య చేసిన డాన్సర్ ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిసి నివ్వెర పోయారు. ఫరీదాబాద్ లోని అతని నివాసంలో గురువారం నిందితుడిని అరెస్ట్ చేశారు. రియాల్టీషో లో పాల్గొనడానికి అవసరమైన డబ్బుల కోసమే ఆమెను హత్యను చేసినట్టు విచారణలో నేరాన్ని అంగీకరించాడు. కాగా గతంలో ఈ డాన్సర్ , మరో అమ్మాయితో కలిసి పథకం ప్రకారం సప్నేష్ ను మభ్యపెట్టి ఉత్తరాఖండ్ తీసుకెళ్లి, గొంతు నులిమి చంపేసి కొండమీదనుంచి తోసేశారు. అనంతరం 60 వేల రూపాయలు ఇవ్వాలంటూ బాలుడి తండ్రిని డిమాండ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో విచారణ అనంతరం జువైనల్ హోంకు తరలించారు. మంచి ప్రవర్తన కారణంగా కరెక్షన్ హోం నుంచి ఇటీవలే విడుదలయ్యాడు. దాదాపు ఆరు నెలల కాలంలో రెండు హత్యలకు పాల్పడడం బాల నేరస్థుల సంస్కరణ వ్యవస్థకు సవాలుగా నిలిచింది. -
సింక్ విన్
ఇండియా ఫీస్టా లాటినా.. ఈ పేరు సిటీలో చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఆ తక్కువలోనూ డ్యాన్సర్లే ఎక్కువుంటారు. ఢిల్లీ వేదికగా ఏడాదికోసారి లాటిన్ నృత్యాలతో హోరెత్తించే ‘ఇండియా ఫీస్టా లాటినా’.. ఓ అంతర్జాతీయ నృత్యోత్సవం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన విభిన్న వెరైటీల లాటిన్ డ్యాన్స్ స్టయిల్స్‌కు పట్టం కడుతూ సాగే ఈ ఫెస్టివల్లో ఈసారి నగరానికి కూడా ప్రాతినిథ్యం లభించడమే విశేషమనుకుంటే.. వీరిలో ప్రొఫెషనల్ డ్యాన్సర్ల కన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి ప్రైవేట్ ఉద్యోగులే ఎక్కువగా ఉండటం మరో విశేషం. - ఎస్.సత్యబాబు ఢిల్లీలోని గుర్గావ్లో ఉన్న లీలా యాంబియన్స్ హోటల్ గత ఏప్రిల్ 10, 11, 12 తేదీలలో టాప్‌క్లాస్ లాటిన్ డ్యాన్సులతో హోరెత్తింది. ఈ కనుల‘పండుగ’లో సిటీ నుంచి పాల్గొనే అవకాశం సింక్‌వన్ బృందానికి దక్కింది. ఇటీవలే ఈ ఫెస్ట్ నుంచి సిటీకి తిరిగి వచ్చిన ఈ బృంద సభ్యులు సిటీప్లస్‌తో తమ అనుభవాలను ఇలా పంచుకున్నారు. రెస్పాన్స్ అదుర్స్.. ‘ఐఎఫ్ఎల్లో సల్సా- పచాంగా స్టైల్‌ను మైఖేల్ జాక్సన్ థ్రిల్లర్ సాంగ్‌కు రీమిక్స్ చేసి అందించాం. దీని కోసం ముందుగా బోలెడంత ప్రాక్టీస్ చేశాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన ఆర్టిస్ట్‌లను కలవడం ఓ స్ఫూర్తిదాయక అనుభవం. మా పెర్ఫార్మెన్స్కు ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ మరచిపోలేం. అక్కడ ఒక వర్క్‌షాప్ కూడా నిర్వహించాను. ఈ సందర్భంగా టాప్‌క్లాస్ లాటిన్ డ్యాన్సర్లతో కలిసి పదం కలిపే ఛాన్స్ వచ్చింది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు సింక్‌వన్ బృంద సారథి శశాంక్. తనతో పాటు తొమ్మిది మంది ఈ బృందంలో ఉన్నారు. ‘ఇప్పటిదాకా 8 డ్యాన్స్ ఫెస్ట్‌లలో పాల్గొన్నా.. అన్నింటిలోకి ఇది బెస్ట్’ అని చెప్పాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి అర్జీత్ సింగ్. వీరిలో తొలిసారి డ్యాన్స్ ఫెస్ట్‌లలో పాల్గొంటున్నవారూ ఉన్నారు. ‘ఇదే ఫస్ట్ టైమ్ నాకు. ఇట్స్ క్రేజీ ఈవెంట్. నేను ఇప్పటిదాకా అటెండవ్వని పూల్ పార్టీనీ ఎంజాయ్ చేశాను’ అంటూ సంబరపడిపోయింది ఐటీ ఉద్యోగిని పరిధి. అన్బిలీవబుల్.. ఎంజాయ్మెంట్ విత్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగిని సునంద. ‘ఐఎఫ్ఎల్ కోసం లాస్ట్ డిసెంబర్ నుంచి ప్రిపేరయ్యా. నేర్చుకునేవారికి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునేవారికి ఇదో గొప్ప వేదిక’ అని అన్నారామె. ప్రపంచపు బెస్ట్ ఆర్టిస్ట్స్‌తో స్టేజ్ షేర్ చేసుకోవడం నమ్మలేకపోతున్నానని చెప్పారు ప్రతీక్. ‘ఇది నేను పాల్గొన్న 4వ ఫెస్టివల్. యూట్యూబ్‌లో మాత్రమే చూడగలిగే విదేశీ డ్యాన్సర్లను ప్రత్యక్షంగా కలవడం ఒక కలలా అనిపిస్తోంద’ని అన్నారు పార్కర్ ట్రైనర్‌గా నగరంలో సుపరిచితులైన అభినవ్. ‘తొలిసారి ఐఎఫ్ఎల్లో పాల్గొన్నాను. క్లాసుల నుంచి పెర్ఫార్మెన్స్ల దాకా అన్నీ సూపర్బ్. కొత్త కొత్త మూవ్మెంట్స్ నేర్చుకున్నాం’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది అదితి. ‘ఈ మెగా డ్యాన్స్ ఫెస్ట్‌లో అంతులేని వినోదాన్ని పొందాను’ అన్నారు మరో డ్యాన్సర్ శ్రవణ్. త్రీ డేస్.. ఓన్లీ డ్యాన్స్ నాలుగేళ్లుగా సింగపూర్ డ్యాన్సర్ నీరజ్ మస్కారా.. లాటిన్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నృత్యాభిమానులు, ప్రొఫెషనల్ డ్యాన్సర్లు పాల్గొనే ఈ ఈవెంట్ ఢిల్లీలో జరిగింది. వరల్డ్ ఫేమస్ డ్యాన్సర్లు 800 మంది వరకు దీనికి హాజరయ్యారు. అమెరికా, యూకే తదితర దేశాల నుంచే కాక హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాలకు చెందిన వారు పాల్గొన్నారు. లాటిన్ డ్యాన్స్‌పై అవగాహన పెంచే ఉద్దేశంతో దీనిలో రోజంతా వర్క్‌షాప్స్, సాయంత్రం వేళల్లో డ్యాన్స్ షోలు ఉంటాయి. ఒకరోజు మొత్తం కాంపిటీషన్స్ ఉంటాయి.