breaking news
Priyank Kharge
-
డీసీపీ... నా కారే తీసేస్తావా?
మంగళవారం విధానసౌధ ఆవరణ. విధానసభ లోపలి నుంచి మాజీ సీఎం సిద్దరామయ్య బయటకు వచ్చారు, అక్కడ ఉండాల్సిన తన కారు కనబడకపోవడంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఆ తరువాత హైడ్రామా మొదలైంది.బెంగళూరు: డీసీపీనా మాట్లాడేది.. నా కారునే టోయింగ్ చేస్తావా? అని మాజీ సీఎం సిద్దరామయ్య, విధానసౌధ భద్రతాధికారి, డీసీపీ యోగేష్‌పై మండిపడ్డారు. అసెంబ్లీలో సమావేశం చూసుకుని పశి్చమ ద్వారం మెట్లు దిగి బయటకు వచ్చినప్పుడు, అక్కడ నిలిపిన కారు లేదు. విచారించగా, డీసీపీ యోగేష్ ఆదేశాల మేరకు పోలీసులు కారును పార్కింగ్ లాట్‌కు పంపినట్లు తెలిపారు. దీంతో ఆయన కారు కోసం కొంతసేపు నిలబడ్డారు. ఈ ఘటనతో చాలా కలత చెందారు, కొందరు ముఖ్యులు కూడా ఆయన చుట్టూ చేరారు. వెంటనే డీసీపీ యోగేష్‌కు ఫోన్ చేసి.. ‘నా కారును ఇక్కడి నుండి ఎందుకు తీసుకువెళ్లారు?. మీపై చాలా ఆరోపణలు ఉన్నాయి. విధానసౌధకు వచ్చే ప్రజా ప్రతినిధులను, ఎమ్మెల్యేలను మీరు సరిగ్గా గౌరవించడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. ప్రజాప్రతినిధులతో ఇలా ప్రవర్తించకూడదు. ఇప్పటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా పనిచేయాలి’ అని మాజీ సీఎం హెచ్చరించారు. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కారు రాగానే సిద్దరామయ్య వెళ్లిపోయారు. హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేకు కూడా సిద్దరామయ్య ఫిర్యాదు చేశారు. చివరకు డీసీపీ క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది. ఇదీ చదవండి: నన్ను జైల్లోనే చంపేస్తారు -
కన్నడ పొలిటికల్ హీట్.. కుమారస్వామికి ప్రియాంక్ ఖర్గే సవాల్
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఉద్యోగ నియామకాల వివాదం ఒక్కసారిగా వేడెక్కింది. 24 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రతిపక్షానికి సూటిగా సవాల్ విసిరారు. ‘ఈ వ్యవహారంలో నా ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అంటూ కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆరోపణలు కాదు.. ఆధారాలు బయటపెట్టండి, దర్యాప్తులో నిజం తేల్చండి అంటూ రాజకీయ దాడిని మరింత పదును పెట్టారు. ఆధారాలతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు.కాగా, సిద్ధరామయ్య ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 24 మంది AEEల నియామకాల్లో అక్రమాలు జరిగాయని కుమారస్వామి ఆరోపిస్తూ.. ప్రియాంక్ ఖర్గే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఖర్గే.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ‘హిట్ అండ్ రన్ పాలిటిక్స్’ అంటూ కుమారస్వామిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో ‘నా మీద ఆరోపణలు చేసేవారు పత్రాలతో రావాలి. ఆధారాలు ఉంటే దర్యాప్తు జరగాలి.. నిజాలు బయటకు రావాలి. KPSCకి సంబంధించిన ఏ కేసులోనైనా నా ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. మరి తమ పాత్ర రుజువైతే బీజేపీ, జేడీఎస్ నేతలు కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటారా?’ అని ఖర్గే ప్రశ్నించారు.సీసీటీవీ ఫుటేజీపై అనుమానాలుAEE నియామక ప్రక్రియలో ఓఎంఆర్ షీట్లలో అవకతవకలు, సీసీటీవీ ఫుటేజీ మాయం కావడం, నిబంధనల ఉల్లంఘన వంటి ఆరోపణలు వచ్చినట్లు ఖర్గే తెలిపారు. తుది ఎంపిక ప్రక్రియ పూర్తికాకముందే KPSCలోనే కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ నియామకాలను ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. KPSCలో పరీక్షల నిర్వహణ, ఎంపిక జాబితాల విడుదల, తుది జాబితాను సంబంధిత శాఖకు పంపడం వంటి ప్రక్రియలను వేర్వేరు అధికారులు, సంస్థలు నిర్వహిస్తారని ఖర్గే వివరించారు. అలాంటప్పుడు మొత్తం వ్యవహారానికి మంత్రినే నేరుగా బాధ్యుడిగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. కొంతమంది అభ్యర్థుల ఎంపికపై అభ్యంతరాలు రావడంతో KPSC సమీక్ష కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు రాజకీయ ఆరోపణలు చేయడం కాకుండా.. ఎక్కడ, ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు? అక్రమాలకు పాల్పడింది ఎవరు? అన్నది తేల్చాలని కోరారు.చర్యలు తప్పవు..నియామకాల్లో అక్రమాలు జరిగితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని ఖర్గే స్పష్టం చేశారు. యువత ఉద్యోగాలు, భవిష్యత్తును దెబ్బతీసే ఏ అక్రమాన్నైనా వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే, గత బీజేపీ ప్రభుత్వ హయాంలో వెలుగుచూసిన PSI నియామక కుంభకోణాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అప్పట్లో బీజేపీ నేతల పేర్లు కూడా ఆరోపణల్లో వినిపించాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న నేతలు గతంలో ఇలాంటి వ్యవహారాలపై ఎలా స్పందించారో ప్రజలు మర్చిపోలేదని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: అన్నాహజారేకు తీవ్ర అస్వస్థత -
కర్ణాటకలో కొత్త బిల్లు.. ఆరెస్సెస్‌కు చెక్ పెట్టేందుకేనా?
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్-ఆరెస్సెస్ మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ భవనాలు, భూములు, పార్కులు, ఆటస్థలాలు, రోడ్లు తదితర ప్రజా ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, సంఘాలు వినియోగించుకునే విధానాన్ని నియంత్రించేందుకు సిద్ధమైన కొత్త బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు లక్ష్యం ఆరెస్సెస్‌ను కట్టడి చేయడమేనా? అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.‘కర్ణాటక రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రెమైసెస్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీ బిల్–2026’ పేరుతో తీసుకొస్తున్న ఈ చట్టం ద్వారా ప్రభుత్వ ఆస్తుల వినియోగానికి స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర కార్యకలాపాల కోసం ప్రభుత్వ స్థలాలను ఉపయోగించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేసినా, వాటికి నష్టం కలిగించినా చర్యలు, జరిమానాలకు అవకాశం ఉండనుంది. కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే మాత్రం ఈ బిల్లు ఏ ఒక్క సంస్థను లక్ష్యంగా చేసుకుని తీసుకురావడం లేదని స్పష్టం చేశారు. ప్రజా ఆస్తులను రక్షించడం, వాటి వినియోగంలో జవాబుదారీతనం తీసుకురావడమే ఉద్దేశమని చెప్పారు. ప్రత్యేకంగా ఆరెస్సెస్, ఏదైనా సంస్థ, క్లబ్, యూనియన్ లేదా ఎన్జీవోను అడ్డుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు.అయితే, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం గత కొంతకాలంగా ఆరెస్సెస్ ప్రభుత్వ స్థలాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రజా ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. 2025లో ప్రభుత్వం ఇలాంటి వినియోగంపై నిబంధనలు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, ఆ ఉత్తర్వులపై కర్ణాటక హైకోర్టులో సవాళ్లు ఎదురయ్యాయి. ఇప్పుడు అదే అంశానికి చట్టబద్ధమైన రూపం ఇవ్వడానికి కొత్త బిల్లును తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 2026 జూన్‌లో ప్రియాంక్ ఖర్గే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌కు బహిరంగ లేఖ రాయడం కూడా ఈ పరిణామానికి రాజకీయ నేపథ్యాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఆరెస్సెస్ చట్టపరమైన నమోదు, ఆర్థిక వ్యవహారాలు, కార్యకలాపాల్లో పారదర్శకత, పన్నుల నిబంధనలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో తాజాగా కేబినెట్ ఆమోదించిన బిల్లుపై సహజంగానే ఆరెస్సెస్ పేరు చర్చకు వచ్చింది. కొన్ని రాజకీయ వర్గాలు ఇది ఆరెస్సెస్ కార్యకలాపాలపై నియంత్రణ పెంచే ప్రయత్నమని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం “నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి” అని చెబుతోంది.ఈ బిల్లు కేవలం ఆరెస్సెస్ కార్యక్రమాలకే పరిమితం కాదు. ప్రభుత్వ భూములు, భవనాలు, పార్కులు, ఆటస్థలాలు, రోడ్లు వంటి ప్రజా ఆస్తులను ఉపయోగించే ప్రైవేటు సంస్థలు, సంఘాలు, అసోసియేషన్లు, సొసైటీలు అన్నింటికీ ఒకే విధమైన అనుమతి వ్యవస్థను తీసుకురావడం ప్రతిపాదనలో ఉంది. అనుమతి లేకుండా వినియోగించడం లేదా ఆస్తులకు నష్టం కలిగించడం వంటి అంశాలపై కూడా చర్యలు ఉండనున్నాయి. అయితే అసలు రాజకీయ పరీక్ష ఇక ముందే ఉంది. కేబినెట్ ఆమోదించిన బిల్లును శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించాల్సి ఉంది. అక్కడ ప్రతిపక్షం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది? ప్రభుత్వం నిబంధనలను ఎలా అమలు చేస్తుంది? ఆరెస్సెస్ సహా ఇతర సంస్థలు దీనిపై న్యాయపరంగా స్పందిస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
ఆస్తులు బయటపెట్టండి.. దాచడానికి ఏమీ లేదు
ఆర్ఎస్ఎస్ పారదర్శకతపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖాస్త్రం సంధించారు. ఆస్తులు, ఆదాయ పన్ను చెల్లింపు వివరాలు తెలియజేయాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ సంస్థ అయినా చట్టానికి అతీతం కాదని, ఆర్ఎస్ఎస్ కూడా అన్ని సంస్థల్లా పారదర్శకత పాటించాలని లేఖలో కోరారు. దీనికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. తమ సంస్థ దాచడానికేమీ లేదని, బహిరంగంగా పనిచేస్తోందని చెప్పారు.రిజిస్టర్ చేయించుకోండి: ప్రియాంక్ ఖర్గే బెంగళూరు: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సంస్థ తన పేరును అధికారికంగా నమోదు చేయించుకుని, నిధుల లావాదేవీలను బహిర్గతం చేసి రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాలని కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే డిమాండ్ చేశారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ తన సంస్థాగత హోదాపై స్పష్టత ఇవ్వాలంటూ ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్‌కు మంత్రి ప్రియాంక్ సోమవారం లేఖ రాశారు. ఈ లేఖను మంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.దేశ, విదేశాల్లో 60 వేల పైచిలుకు శాఖలు, కోట్లాది మంది స్వయం సేవకులను కలిగిన ఆర్ఎస్ఎస్ పారదర్శకతతో మెలగాలని సూచించారు. కర్ణాటకలో 4,127 రోజువారీ శాఖలు, 1,389 వీక్లీ మిలన్స్, 60 మంత్లీ మండలులను కలిగి ఉన్నట్లు ఆర్ఎస్ఎస్ స్వయంగా ప్రకటించుకుందన్నారు. సంస్థ కార్యకలాపాలు చట్టపరమైన హోదా, జవాబుదారీతనం, ఆర్థిక పారదర్శకత, ప్రజా భద్రత, అనుమతులు, నిధుల మూలాలు, చట్టాలకు లోబడి ఉండటం గురించిన అనేక సహేతుకమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని పేర్కొన్నారు.ఇది రాజకీయమే: భగవత్ త్రిస్సూర్: ఆర్ఎస్ఎస్ను రిజిస్టర్ చేయించాలంటూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ చేసిన డిమాండ్‌పై ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ తప్పుబట్టారు. ఆర్ఎస్ఎస్ను రిజిస్టర్ చేసే ప్రసక్తే లేదన్నారు. తమ సంస్థ రహస్యం కాదు, ప్రజా పరిశీలనకు అతీతంగా పనిచేయడం లేదని స్పష్టం చేశారు. ఆదివారం కేరళలోని త్రిస్సూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. తమ సంస్థ దాచడానికేమీ లేదన్నారు. వందేళ్లుగా కొనసాగుతున్న తమ సంస్థను ఇప్పటివరకు ఎవరూ రిజిస్టర్ చేయించుకోవాలని అడగలేదన్నారు.చదవండి: సయోనీ సూపర్ ట్విస్ట్.. అస్సలు ఊహించలేదు!‘దేశంలో అధికారంగా నమోదు కాని ఎన్నో వ్యవహారాలు సాగుతున్నాయి. కానీ మాదేమీ రహస్య సంస్థ కాదు. మేం బహిరంగంగా పనిచేస్తాం. ప్రజలను పిలిచి మరీ మేం ఏమి చేస్తున్నామో వారికి చెప్తాం’ అని భగవత్ అన్నారు. ‘ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ కోరడమంటే రాజకీయమే తప్ప మరేమీ కాదు, ఇలాంటి డిమాండ్లు గతంలోనూ ఎన్నోమార్లు వచ్చాయి. ఇలాంటి డిమాండ్లు రాకుంటేనే మేం వెలితిగా ఫీలవుతాం’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘హిందూ ధర్మం రిజిస్టర్ కాలేదు. దేశంలో రిజిస్టర్ కానివి ఎన్నో జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు కోరేవారు మాత్రమే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్న విషయం ప్రభుత్వానికీ తెలుసు’అని భగవత్ పేర్కొన్నారు. Dear Shri Mohan Bhagwat ji,My letter will reach you shortly. However, I thought it was important to draw your attention to this matter early.——————————-Firstly, congratulations to the RSS on completing 100 years.An organisation that claims over 60,000 shakhas and crores of… pic.twitter.com/IZy4oeKdMp— Priyank Kharge / ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ (@PriyankKharge) June 15, 2026


