breaking news
Primate
-
‘ప్రైమేట్’ రివ్యూ : అలాంటివాళ్లు చూడకూడని సినిమా
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ప్రైమేట్’ ఒకటి. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. భయం... మనిషిని, మనిషి ఆలోచనలను ఎలాంటి స్థితిలోనైనా ఏ క్షణమైనా ఆపేయగల ఏకైక భావోద్వేగం ఈ భయం. ఎంతటి ధైర్యవంతులైనా, దమ్మున్నవారైనా ఈ భయమనేది ఒక్కసారి కలిగితే పరిగెత్తాల్సిందే. ఆ నేపథ్యంలో ఎన్నో సినిమాలను ఇప్పటికే మనం చూశాం. కానీ ఈ ‘ప్రైమేట్’ సినిమా కొంత విభిన్నం. ప్రైమ్ వీడియో వేదికగా ఈ చిత్రం స్టీమ్ అవుతోంది. మొదటి పది నిమిషాలు వదిలేస్తే మిగతా ప్రతి నిమిషం ప్రేక్షకుడిని భయంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందీ సినిమా. అందుకే భయపడేవారు, అనారోగ్యంగా ఉన్నవారు ఈ సినిమాకి దూరంగా ఉండడమే మంచిది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం. హవాయి కొండ ప్రాంతంలో లూసీ కుటుంబం ఓ చింపాజీతో పాటు ఉంటుంది. చింపాంజీని తమ కన్నబిడ్డలకన్నా మమకారంగా పెంచుకుంటుంటారు. చింపాంజీని బెన్ అని పిలుచుకుంటారు. ఓ రోజు ఎక్కడ నుండో వచ్చిన మంగూస్ అనుకోకుండా బెన్ని కరిచి వెళ్ళగా దానికి ర్యాబిస్ వ్యాధి సోకుతుంది. దాంతో బెన్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటుంది. ఇవేమీ తెలియని లూసీ తన స్నేహితులను చిన్న పార్టీ కోసం ఇంటికి పిలుస్తుంది. ఇంతలో పిచ్చి పట్టిన బెన్ ఏమో లూసీ స్నేహితులలో ఒకరిని అత్యంత కిరాతకంగా దాడి చేసి, చంపేస్తుంది. దీంతో బిత్తరపోయి భయపడ్డ లూసీ బృందం స్విమ్మింగ్ పూల్‌లో దూకేస్తుంది. ర్యాబిస్ సోకిన చింపాంజీకి నీళ్ళంటే అలర్జీ కాబట్టి వాళ్ళ దగ్గరకు రావాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది. మరి... నీళ్ళలో ఉన్న లూసీ బృందం బెన్ చేతికి చిక్కుతుందా? లేక లూసీవాళ్ళు తప్పించుకుంటారా? అన్న విషయాన్ని మాత్రం ‘ప్రైమేట్’ సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా సూపర్ థ్రిల్లింగ్. అందుకే భయపడేవారు, అనారోగ్యం ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని చూడకూడదు. థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడేవాళ్ళకి ఈ సినిమా ఓ ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. ప్రేక్షకుడు సినిమా మొత్తం కన్నార్పకుండా కూర్చోబెట్టే స్క్రీన్‌ప్లేతో కూడుకున్నదీ సినిమా. మస్ట్ వాచ్ ఫర్ థ్రిల్లింగ్ లవర్స్. – హరికృష్ణ ఇంటూరు -
వానరానికి దహన సంస్కారాలు
మానవత్వాన్ని చాటుకున్న భవన నిర్మాణ కార్మికులు ఏటూరునాగారం : ఓ వానరం మృతి చెందగా కొందరు భవన నిర్మాణ కార్మికులు అంత్యక్రి యలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నా రు. వివరాలు.. మండల కేంద్రంలోని ఎంపీడీ ఓ కార్యాలయం ఆవరణలో ప్రతి ఏటా ఆగస్టు 1న భవన నిర్మాణ కార్మికులు వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుం టారు. సోమవారం సమావేశానికి వచ్చిన కార్మికులు మృతి చెంది ఉన్న వానరాన్ని చూసి చలించిపోయారు. వెం టనే దానికి అంతిమ సంస్కారాలు చేశారు. కార్మికులు నాగరాజు, సమ్మయ్య, నసిరొద్దీన్, స్వామి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ.. మకిలీ
ప్రథమ పౌరుడి పదవీ పాట్లు సాక్షి, కర్నూలు: జిల్లా ప్రథమ పౌరుడు నకిలీ మద్యం కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. పదవిని కాపాడుకునేందుకు.. కేసు నుంచి బయటపడేందుకు టీడీపీ ముఖ్య నేతకు కోట్లాది రూపాయలు సమర్పించుకున్నట్లు ఆ పార్టీ వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. కేసు నమోదయ్యాక ఎక్సైజ్ పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలో గడిపిన ఆయన.. జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పాల్గొన్న కార్యక్రమాల్లో మాత్రమే తారసపడ్డారు. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాల్లో.. కలెక్టరేట్లో నిర్వహించే సమీక్ష సమావేశాల్లోనూ వేదికను అలంకరిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్య నేత భరోసాతోనే ఆయన జనజీవన శ్రవంతిలోకి వచ్చినట్లు పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. నకిలీ మద్యం కేసులో ఎ-5గా ఉన్న జెడ్పీ చైర్మన్ అరెస్టుకు ఎక్సైజ్ పోలీసులు మీనమేషాలు లెక్కిస్తుండటం వెనుక భారీగా డబ్బు చేతులు మారినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ కేసుతో జెడ్పీ ప్రతిష్ట మంటగలిసింది. ‘నకిలీ మద్యం వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా చేసుకోండని.. ఎలాంటి ఇబ్బందులొచ్చినా తాను అండగా నిలుస్తా’నంటూ స్వయంగా జెడ్పీ చైర్మన్ తమకు భరోసానిచ్చినట్లు ఆ కేసులో నిందితులుగా ఉన్న రామన్‌గౌడ్, ఉమామహేశ్వరగౌడ్‌లు పోలీసుల ఎదుట అంగీకరించారు. జెడ్పీ చైర్మన్ పీఏ రాజశేఖర్ సహకారంతో చైర్మన్‌ను కర్నూలులోని మౌర్యాఇన్ హోటల్లో కలిసినట్లు వారు స్పష్టం చేయడం తెలిసిందే. ఆ మేరకు పీఏపైనా ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన అరెస్టు తర్వాత చైర్మన్‌ను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కొందరు తక్షణమే రాజశేఖర్‌గౌడ్‌ను చైర్మన్ పదవి నుంచి తప్పించాలని.. లేకపోతే పార్టీ పరువు, ప్రతిష్ట దెబ్బతింటుందనే అభిప్రాయాన్ని అధినేత ముందుంచారు. రూ.4 కోట్లకు డీల్! వ్యయప్రయాసలకోర్చి జెడ్పీ పీఠం దక్కించుకున్న రాజశేఖరగౌడ్.. ఆ సంతోషం మూన్నాల్ల ముచ్చట కాకూడదనే ఉద్దేశంతో పదవిని కాపాడుకునేందుకు ముప్పుతప్పలు ఎదుర్కొంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ఎంతో కష్టం మీద టీడీపీకే చెందిన ఓ ముఖ్యనేత, ఆయన సోదరుల ఆశీస్సులు పొందినట్లు తెలుస్తోంది. ఒక దశలో జెడ్పీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని వారు సూచించడంతో కాసుల బేరానికి దిగినట్లు సమాచారం. కేసు నుంచి తప్పించడమో.. లేదంటే అరెస్టు కాకుండా చూడటమో చేస్తే రూ.4కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు వినికిడి. ఆ తర్వాతే జెడ్పీ చైర్మన్ రాజశేఖరగౌడ్ అజ్ఞాతం వీడినట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో నందికొట్కూరుకు చెందిన టీడీపీ నేత కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. డీల్‌కు సంబంధించిన మొత్తాన్ని కూడా ఆయనే సమకూర్చినట్లు సమాచారం. ఇదిలాఉంటే నకిలీ మద్యం కేసు నుంచి బయటపడేందుకు చైర్మన్ రాజశేఖర్‌గౌడ్ తన పీఏ రాజశేఖర్ అలియాస్ చిక్కా నాగశేఖరప్పను కూడా బలిపశువును చేసేందుకు వెనుకాడటం లేదని చర్చ కొనసాగుతోంది.


