‘సెలైంట్ సినిమా’ గ్రంథానికి అవార్డు
‘సినిమా రంగంపై ఉత్తమ రచన’ విభాగంలో 2014వ సంవత్సరానికి జాతీయ అవార్డు ఒక తెలుగు పుస్తకానికి రావడం విశేషం. నాటక రంగంలో పనిచేస్తూ, సినిమాపైన కూడా అధ్యయనం చేసిన పసుపులేటి పూర్ణచంద్రరావు రచన ‘సెలైంట్ సినిమా (1895-1930)’కు ఈ అవార్డు దక్కింది. సినిమా చరిత్రను మూడు భాగాల్లో రాయాలనే ప్రయత్నంలో ముందుగా ‘ప్రపంచ సినిమా చరిత్ర - మొదటిభాగం’గా ఈ రచన చేసినట్లు 67 ఏళ్ళ ఈ పుస్తక రచయిత చెప్పారు. కాగా జి. ధనంజయన్ రాసిన ‘ప్రైడ్ ఆఫ్ తమిళ్ సినిమా (1931 -2013)’పుస్తకం ఈ విభాగంలోనే ‘ప్రత్యేక ప్రశంస’గా ఎంపికైంది.