breaking news
Presidential Post
-
డ్రైవర్ నుంచి అధ్యక్ష పీఠం దాకా
అత్యంత సాదాసీదా నేపథ్యం. పుట్టింది ఓ సామాన్య కార్మికుని కుటుంబంలో పనిచేసింది బస్సు డ్రైవర్‌గా. అలాంటి స్థాయి నుంచి ఏకంగా దేశాధ్యక్ష పీఠం దాకా! చివరికి నియంతగా అప్రతిష్ట మూటగట్టుకుని ఏ పెద్ద దేశం అధ్యక్షునికీ జరగని రీతిలో పరాయి దేశ బందీగా మారిన దైన్యం. వెనెజువెలా తాజా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం... నికొలస్ మదురో 1962లో వెనెజువెలా రాజధాని కరాకాస్‌లో అతి సామాన్య కుటుంబంలో పుట్టారు. ఆయన బాల్యం సాధారణంగానే గడిచింది. చదువు హైసూ్కలు స్థాయి దాటలేదు. క్యూబాలో ఏడాది పాటు వామపక్ష సిద్ధాంతాల్లో శిక్షణ పొంది వచ్చారు. కార్మిక సంఘం నేత అయిన తండ్రి నుంచి నాయకత్వ వాసనలను మదురో బాగా వంటబట్టించుకున్నారు. 1992లో మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ అధికార కైవసానికి విఫలయత్నం చేసిన రోజుల్లో ఆయన బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. జైలుపాలైన చావెజ్ విడుదల కోసం జరిగిన ఉద్యమంలో ముందుండి నడిచారు. మదురో జీవితంలో అదే కీలక మలుపు. చూస్తుండగానే చావెజ్ వామపక్ష ఎజెండాకు గట్టి మద్దతుదారుగా మారారు. ఆ క్రమంలో తండ్రిలా తానూ కార్మిక సంఘ నేత అయ్యారు. అనంతరం చావెజ్ సారథ్యంలోని యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజువెలాలో చేరి చకచకా కీలక స్థానానికి ఎదిగారు. 1998లో చావెజ్‌తో పాటు తానూ జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత అసెంబ్లీ అధ్యక్షుడయ్యారు. చావెజ్ అధ్యక్షుడయ్యాక ఆయన కేబినెట్లో విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రపంచమంతా కలియదిరిగి అంతర్జాతీయంగా వెనెజువెలాకు మద్దతు పెంచడంలో మదురో కీలకపాత్ర పోషించారు. అమెరికా కర్రపెత్తనాన్ని, ఆంక్షలను ఎదుర్కొనేందుకు లాటిన్ అమెరికా–కరీబియన్ కూటమి ఏర్పాటు చేశారు. ఈ దశలోనే చావెజ్‌కు అత్యంత నమ్మకస్తునిగా మారారు. ఫలితంగా 2012లో వెనెజువెలా ఉపాధ్యక్షుడయ్యారు. మదురోను తన రాజకీయ వారసునిగా చావెజ్ ప్రకటించారు. 2013లో అనారోగ్యంతో చావెజ్ మరణించడంతో మదురో తొలుత తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలుపొంది అధ్యక్ష పీఠాన్ని పదిలపరుచుకున్నారు. నాటినుంచి పాలకునిగా కొనసాగుతూనే ఉన్నారు. అయితే ఆ క్రమంలో ప్రతి ఎన్నికల్లోనూ విపరీతమైన అక్రమాలకు పాల్పడ్డారన్న అపకీర్తి మూటగట్టుకున్నారు. 2013 నాటి తొలి ఎన్నికల నుంచే ఆయనపై ఈ ఆరోపణలున్నాయి. చివరకు ఇలా నేలకు! చావెజ్ మరణానంతరం అధ్యక్షుడు కాగలిగినా పరిస్థితులన్నీ క్రమంగా మదురోకు ప్రతికూలించసాగాయి. అసలు ఆయన అధ్యక్ష జీవితమంతా వివాదాలు, సమస్యలమయంగానే సాగింది. ముఖ్యంగా వెనెజువెలా ఆర్థిక పతనం ఆయనకు పెద్ద సవాలుగా మారింది. అమెరికా ఆంక్షలకు తోడు అంతర్జాతీయ చమురు ధరలు పతనం కావడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఆర్థిక సంస్కరణలు, భారీగా నోట్ల ప్రింటింగ్ వంటివి మరిన్ని సమస్యలకే దారితీశాయి. ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. తిండి గింజలు కూడా లేక జనం అలమటించారు. దాంతో లక్షలాదిగా పొట్ట చేతపట్టుకుని పొరుగు లాటిన్ అమెరికా దేశాలకు వలసపోయారు. ఈ క్రమంలో 2014, 2017ల్లో వెనెజువెలా చరిత్రలోనే అతి పెద్ద ఆందోళనలు, నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. వాటన్నింటినీ ఉక్కుపాదంతో అణచేసి మదురో మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నారు. నిరసనలన్న మాటే విని్పంచకుండా లక్షలాది మందిని జైళ్లలో కుక్కేశారు. రాజకీయ ప్రత్యర్థులను తీవ్రాతి తీవ్రంగా హింసించారు. మానవ హక్కుల హననానికి దేశాన్ని మారుపేరుగా మార్చేశారు. ఇవన్నీ చాలవన్నట్టు 2020లో అమెరికా మదురోను అవినీతి ఆరోపణల్లో దోషిగా తేలి్చంది. ఇన్ని ప్రతికూలతల మధ్యే 2024 ఎన్నికల్లో కిందామీదా పడి వరుసగా మూడోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారాయన. కానీ ఆ క్రమంలో కనీవినీ ఎరగని అక్రమాలకు పాల్పడి అభాసుపాలయ్యారు. ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కు చాలాచోట్ల ఏకంగా 85 శాతం కంటే ఎక్కువ ఓట్లు పోలైనట్టు తేలినా మదురో మాత్రం తానే గెలిచానని ప్రకటించుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేటాడే ప్రయత్నం చేశారు. దాంతో గొంజాలెజ్‌తో పాటు జనాదరణ ఉన్న విపక్ష నేత మరియా కొరీనా మచాడో వంటివారు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. 2018లో సైనిక పరేడ్‌లో ప్రసంగిస్తుండగా డ్రోన్ల సాయంతో జరిగిన హత్యాయత్నం నుంచి త్రుటిలో బయటపడ్డారు. చివరికి ఓ పెద్ద దేశాధ్యక్షుడెవరూ ఇప్పటిదాకా ఎదుర్కోని దయనీయ పరిస్థితుల్లో అమెరికా సైన్యానికి భార్యాసమేతంగా పట్టుబడి నిస్సహాయునిగా దేశం వీడారు.భర్తకు చేదోడువాదోడుగా... రాజకీయాల్లో ఫ్లోరెస్ ఉత్థాన పతనాలు కరాకస్: సిలియా ఫ్లోరెస్. అప్రతిష్టాకర రీతిలో అమెరికాకు పట్టుబడ్డ వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో భార్య. రాజకీయాల్లో భర్త అడుగుజాడల్లోనే నడిచారామె. మదురో మాదిరిగానే ఆమెదీ అతి సాధారణ నేపథ్యమే. వాయవ్య వెనెజువెలాలో టినాక్విలో అనే చిన్న పట్టణంలో 1956లో ఒక పేద కుటుంబంలో పుట్టారు ఫ్లోరెస్. జరుగుబాటు కోసం ఆమె కుటుంబం కరాకస్‌కు మారింది. అక్కడే ఆమె న్యాయ పట్టా పుచ్చుకున్నారు. పోలీస్ స్టేషన్లో పార్ట్‌టైం జాబ్ చేసే క్రమంలో ఓ డిటెక్టివ్‌ను పెళ్లాడి ముగ్గురు పిల్లల్ని కన్నారు. మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ వ్యక్తిగత లాయర్‌గా మారడం ఆమె జీవితంలో కీలక మలుపు. అక్కడినుంచీ రాజకీయంగా క్రమంగా ఒక్కో మెట్టూ ఎక్కారు. 2000లో తొలిసారి నేషనల్ అసెంబ్లీకి ఎన్నికైన ఫ్లోరెస్, 2007కల్లా దాని ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఆ క్రమంలో మదురోతో జరిగిన పరిచయం కాస్తా ప్రణయంగా మారింది. రెండు దశాబ్దాల సన్నిహిత జీవితం అనంతరం 2013లో ఇద్దరూ తమ జీవిత భాగస్వాములకు విడాకులిచ్చి ఒకటయ్యారు. మదురో అధ్యక్షుడయ్యాక ఆయన నిర్ణయాలన్నింట్లోనూ ఫ్లోరెస్ కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ చీఫ్‌గా బలమైన అధికార కేంద్రంగా వ్యవహరించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Congress president polls: ఇక ఖర్గే వర్సెస్ థరూర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ద్విముఖ పోరు తప్పదని తేలిపోయింది. మూడో అభ్యర్థి, జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో చివరకు బరిలో ఇద్దరే మిగిలారు. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ పరస్పరం పోటీ పడబోతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నామినేషన్లను పరిశీలించామని, మొత్తం 20 పత్రాలు వచ్చాయని, సంతకాలు రిపీట్ కావడం, సరిపోలకపోవడం వంటి కారణాలతో 4 పత్రాలను తిరస్కరించామని చెప్పారు. నామినేషన్లలో భాగంగా ఖర్గే 14 పత్రాలు, థరూర్ 5 పత్రాలు, త్రిపాఠి ఒక పత్రం సమర్పించారు. త్రిపాఠి నామినేషన్‌ను తిరస్కరించామని, ఆయన పేరును ప్రతిపాదించిన వారిలో ఒకరి సంతకం సరిపోలలేదని, మరొకరి సంతకం రిపీట్ అయ్యిందని తెలిపారు. పోటీలో ఖర్గే, థరూర్ మిగిలారని మిస్త్రీ వెల్లడించారు. నామినేషన్ల ఉపసంహరణకు మరో వారం రోజులు గడువు ఉందని, అధ్యక్ష ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులపై ఈ నెల 8న పూర్తి స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. తిరస్కరణకు గురైన మరో మూడు పత్రాలు ఎవరు సమర్పించారన్న సంగతి మిస్త్రీ బయటపెట్టలేదు. ప్రతిపక్ష నేత పదవికి ఖర్గే రాజీనామా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి పదవికి మల్లికార్జున ఖర్గే రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే నిబంధనకు కట్టుబడి ప్రతిపక్ష నేత పోస్టు నుంచి తప్పుకున్నారు. ఆయన తన రాజీనామా లేఖను శుక్రవారం రాత్రి పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించినట్లు కాంగ్రెస్ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఖర్గే రాజీనామాతో ఖాళీ అయిన పదవి కోసం కాంగ్రెస్ సీనియర్లు దిగ్విజయ్ సింగ్, పి.చిదంబరం, ప్రమోద్ తివారీ పోటీ పడుతున్నట్లు సమాచారం. గాంధీ కుటుంబం తటస్థమే: థరూర్ నాగ్‌పూర్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో సోనియా గాంధీ కుటుంబం తటస్థంగా వ్యవహరిస్తుందని శశి థరూర్ తెలిపారు. ఈ ఎన్నికలో అధికారిక అభ్యర్థి అంటూ ఎవరూ లేరంటూ గాంధీ కుటుంబం తనతో చెప్పిందని అన్నారు. అధ్యక్ష ఎన్నికలో పోటీ చేస్తున్న థరూర్ శనివారం ప్రచారం ప్రారంభించారు. మహారాష్ట్రలోని దీక్షాభూమి స్మారకం చిహ్నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ వాద్రాను కలిశానని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక పూర్తి పారదర్శకంగా జరగాలని, పార్టీ బలోపేతం కావాలని వారు కోరుకుంటున్నారని వివరించారు. గాంధీ కుటుంబం తటస్థంగా ఉంటుందని, పార్టీ యంత్రాంగం మొత్తం పక్షపాతానికి తావులేకుండా వ్యవహరించాలని విన్నవించారు. గాంధీ కుటుంబం మల్లికార్జున ఖర్గే పట్ల మొగ్గుచూపుతోందా? అని ప్రశ్నించగా.. అలాంటి అనుమానాలు తనకు లేవని థరూర్ బదులిచ్చారు. -
Presidential election 2022: ముర్ముకు 61% ఓట్లు
న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవైన రాష్ట్రపతి పీఠంపై గిరిజన మహిళ సగర్వంగా కూర్చోవడం ఖాయమైనట్టే. ప్రాంతీయ పార్టీల నుంచి రోజురోజుకూ పోటెత్తుతున్న మద్దతు నేపథ్యంలో రాష్టపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనమే కానుంది. వైఎస్సార్సీపీ, బీజేడీ, బీఎస్పీ, అన్నాడీఎంకే, జేడీ(ఎస్), అకాలీదళ్, శివసేన, జేఎంఎం, టీడీపీ ఇప్పటికే ఆమెకు మద్దతు తెలుపగా తాజాగా యూపీలో విపక్ష సమాజ్‌వాదీ పార్టీ సంకీర్ణ భాగస్వామి, ఓంప్రకాశ్ రాజ్‌భర్‌కు చెందిన సుహైల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) కూడా ఈ జాబితాలో చేరింది. తమ ఆరుగురు ఎమ్మెల్యేలు ముర్ముకే ఓటేస్తారని రాజభర్ ప్రకటించారు. దీంతో రాష్ట్రపతిని ఎన్నుకునే ఎంపీలు, రాష్ట్రాల ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఆమెకు ఏకంగా 62 శాతం దాకా ఓట్లు ఖాయమయ్యాయి. మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువయ్యే సూచనలు కూడా కన్పిస్తున్నాయి. నామినేషన్ దాఖలు సమయంలో ఆమె ఓటర్లు 50 శాతం కంటే తక్కువే తేలారు. ఆదివాసీ మహిళ కావడం, రాష్ట్రాలన్నీ చుడుతూ మద్దతు కోరుతుండటంతో ప్రాంతీయ పార్టీల నుంచి అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. మొత్తం 10,86,431 ఓట్లకు ఆమెకు ఇప్పటికే 6.68 లక్షల ఓట్లు ఖాయమైనట్టే. ఎస్పీతో తమ బంధం కొనసాగుతుందని రాజ్‌భర్ చెప్పినా, ముర్ముకు మద్దతు నిర్ణయంతో దానికి బీటలు పడ్డట్టేనని భావిస్తున్నారు. -
గాంధీ కుటుంబానికి అధ్యక్ష పదవి వద్దు
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సిన పని లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా వ్యాఖ్యానించారు. తమ ఇంటి సభ్యులు కాకుండా బయట వ్యక్తులకే కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలన్న తన సోదరుడు రాహుల్ అభిప్రాయంతో ఆమె ఏకీభవించారు. పార్టీని నడిపే సత్తా కలిగిన నాయకులు ఎందరో ఉన్నారని తాజాగా విడుదలైన పుస్తకంలో తన మనసులో మాట వెల్లడించారు. అమెరికా విద్యావేత్తలు ప్రదీప్ చిబ్బర్, హర్ష షాలు రచించిన ‘‘ఇండియా టుమారో : కన్వర్జేషన్ విత్ ది నెక్స్›్ట జనరేషన్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్’’అన్న పుస్తకంలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబంపై ఆధారపడకుండా కాంగ్రెస్‌కు సొంత దారంటూ ఉండాలని ప్రియాంక వ్యాఖ్యానించినట్టుగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ద్వారా విడుదలైన ఆ పుస్తకం వెల్లడించింది. ‘‘రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామా లేఖలోనే కాదు, చాలా సార్లు తన మనోగతాన్ని విప్పి చెప్పారు. మన కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్షుడు కావాల్సిన అవసరం లేదన్నారు. నేను కూడా రాహుల్‌కి మద్దతుగా ఉంటా’’అని ప్రియాంక చెప్పారు. 15 నెలల క్రితం ఇంటర్వ్యూ అది: కాంగ్రెస్ దేశంలో యువ రాజకీయ నేతల్ని పుస్తక రచయితలు గత ఏడాది ఇంటర్వ్యూ చేశారని, ప్రియాంక వెల్లడించిన అభిప్రాయాలు అప్పటివని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గత ఏడాది మే 25న రాజీనామా చేశారు. రాజీనామాను వెనక్కి తీసుకోమని ఎంతమంది చెప్పినా వినకుండా గాంధీ కుటుంబానికి చెందని వారిని అధ్యక్షుడిగా ఎన్నిక చేయాలని కూడా సలహా ఇచ్చారు. గత ఏడాది జూలైలో అమెరికాకు చెందిన రచయితలు ప్రియాంక అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని ప్రియాంక వారికి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి రాహుల్ చేసిన కృషిని ప్రియాంక కొనియాడారు. -
అంతా మోసాల ప్రపంచమే
వాషింగ్టన్: అధ్యక్ష పదవి, అధికారం అంటే అబద్ధాలతో నిండిపోయిన, మోసపూరిత, ప్రమాదకర ప్రపంచమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను స్థిరాస్తి వ్యాపార రంగంలో ఉన్నప్పుడు మన్హట్టన్లో అదే రంగంలో పనిచేసే మనుషులు ఘటికులని అనుకునే వాడిననీ, కానీ రాజకీయ నాయకుల ముందు వారు పసిపిల్లల వంటి వారని ట్రంప్ అన్నారు. అధ్యక్ష భవనం శ్వేతసౌధానికి వచ్చి 20 నెలలు పూర్తయిన సందర్భంగా సీబీఎస్ న్యూస్ చానల్‌కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మీడియాకు అస్సలు నిజాయితీ ఉండదన్న విషయం అధ్యక్షుడినయ్యాకే తెల్సుకున్నానన్నా రు. ‘గతంలో ఎవ్వరూ చేయని పనులను నేను చేయగలుగుతున్నా. పన్నుల విషయంలో కావచ్చు, నిబంధనలు కావచ్చు, ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం కావచ్చు. నాలా ఎవ్వరూ చేయలేదు’ అని అన్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో వివిధ వర్గాలుగా విడిపోయిన వారిని ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ దగ్గర చేస్తోందన్నారు. యూఎస్ సుప్రీంకోర్టు జడ్జిగా కేవనాను నియమించడంతో మొదలైన వివాదం.. వచ్చే నెలలో మధ్యంతర ఎన్నికలపై ప్రభావం చూపొచ్చని అంచనా వేశారు. తన పాలనలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయన్నవి నకిలీ వార్తలేనని ఆయన చెప్పారు. వైట్‌హౌస్‌లోని అందరినీ నమ్మననీ, ఈ పదవిలో ఉండటం కష్టమైన పనని చెప్పారు. వలస చట్టాలన్నీ మార్చాలి.. అమెరికాలోని ప్రస్తుత వలస చట్టాలను చూసి ప్రపంచం నవ్వుతోందనీ, ఈ చట్టాలన్నింటినీ మార్చాలన్నారు. ప్రతిభ ఉన్న వారిని అమెరికాలోకి అనుమతించే విధానం తెస్తామని ట్రంప్ శనివారం కూడా చెప్పారు. ఇటీవల సరిహద్దుల్లోనే అక్రమ వలసదారులను పట్టుకుని పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేయడం తెలిసిందే. ఈ విధానాన్ని మళ్లీ అమలు చేస్తారా అని ప్రశ్నించగా, అన్ని వలస చట్టాలనూ తాను మారుస్తానని ట్రంప్ వెల్లడించారు. అక్రమ వలసదారులు అమెరికాలో అన్ని సౌకర్యాలు పొందేలా చేసే ఓ విధానాన్ని డెమొక్రాట్లు సమర్థిస్తున్నారని ఆరోపించారు. అక్రమ వలసదారుల వల్లే దేశంలో నేర ముఠాలు పెరిగిపోతున్నాయన్నారు. పర్యావరణ మార్పు అనేది ఓ మిథ్య అని గతంలో అన్న ట్రంప్ తాజాగా తన మాటమార్చారు. పర్యావరణం వేడెక్కుతుండటం నిజమే కానీ, వాతావరణ మార్పు శాస్త్రవేత్తలకు రాజకీయ ఎజెండాగా ఉందని ఆరోపణలు చేశారు. మధ్యంతర ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ‘రష్యా వాళ్ల జోక్యం ఉంది. కానీ చైనా జోక్యమూ ఉందని నాకనిపిస్తోంది. చైనా మరో పెద్ద సమస్య’ అని అన్నారు. కాగా, దక్షిణాఫ్రికాకు చెందిన కమెడియన్, ‘ద డైలీ షో’ యాంకర్ ట్రెవొర్ నోవా ట్రంప్‌ను కేన్సర్ జబ్బుతో పోల్చారు. -
4 లక్షలు.. ఒకటోసారి..
హైదరాబాద్: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో నిమజ్జనం రోజున మండపాల వద్ద వేలం పాటలు సాధారణం. ఓ బస్తీలో మాత్రం లడ్డూ వేలం తరహాలోనే అధ్యక్ష పదవిని బహిరంగ వేలం వేశారు. ఘటన జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఫిలింనగర్ వినాయకనగర్ బస్తీలో బస్తీ సంక్షేమ సంఘం అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఎన్నికలు, ప్రచారం ఇదంతా ఎందుకని వేలం పాటలో ఎక్కువ సొమ్ము చెల్లించిన వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని బస్తీవాసులు తీర్మానించారు. వేలంలో హెచ్.బాబురావు అనే స్థానికుడు రూ.4.05 లక్షలకు అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు. అనంతరం బస్తీ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. -
అధ్యక్ష పదవికి రాహుల్ నామినేషన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేదిశగా రాహుల్ గాంధీ (47) పయనానికి మరో అడుగు ముందుకు పడింది. అధ్యక్ష పదవి నామినేషన్‌కు చివరిరోజైన సోమవారం ఆయన నామినేషన్ వేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తోపాటు పార్టీ సీనియర్‌నాయకులు వెంటరాగా రాహుల్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు రాహుల్ గాంధీ.. తల్లి సోనియాతోపాటుగా మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీల ఆశీస్సులు అందుకున్నారు. మొత్తం 89 సెట్ల నామినేషన్లు సోమవారం దాఖలయ్యాయయని ఎన్నికల అధికారి ఎం.రామచంద్రన్ తెలిపారు. రాహుల్ స్వయంగా రెండుసెట్ల పత్రాలను దాఖలుచేశారు. ఇందులో రాహుల్ అభ్యర్థిత్వాన్ని అధ్యక్షురాలు సోనియా ప్రతిపాదించగా సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, అహ్మద్ పటేల్ తదితరులు బలపరిచారు. రెండోసెట్లో మన్మోహన్ ప్రతిపాదించగా సిద్దరామయ్య, టి.సుబ్బిరామిరెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులు బలపరిచారు. సోనియా సహా సీడబ్ల్యూసీ, ఏఐసీసీ నేతలంతా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, సమయం ముగిసేంతవరకు రాహుల్ ఒక్కరే నామినేషన్ వేశారని అందువల్ల ఆయన ఎన్నిక లాంఛనమేనని పార్టీ వర్గాలంటున్నాయి. ఒకవేళ వేరే నామినేషన్ దాఖలై ఉంటే డిసెంబర్ 16న ఎన్నిక జరిపి 19వ తేదీన కౌంటింగ్, ఫలితాలు వెల్లడిస్తారు. డార్లింగ్ ఆఫ్ కాంగ్రెస్: మన్మోహన్ పార్టీని 19 ఏళ్లుగా (పదేళ్లపాటు అధికారంలో) నడుపుతున్న అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి రాహుల్ పగ్గాలు స్వీకరించనున్నారు. 2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితుడైనప్పటినుంచీ రాహుల్‌కు పూర్తిస్థాయి బాధ్యతలపై అడపాదడపా చర్చ జరిగినా.. చివరకు దేశంలో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారటం, 2019 ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో పార్టీ కీలక బాధ్యతలు అందుకోనున్నారు. ‘రాహుల్ గాంధీ డార్లింగ్ ఆఫ్ కాంగ్రెస్ (అత్యంత ప్రీతిపాత్రుడు). పార్టీ సంప్రదాయాన్ని విజయవంతంగా కొనసాగిస్తారు’ అని మన్మోహన్ పేర్కొన్నారు. యువరాజు నాయకత్వంలో.. ఇటీవలి కాలంలో వరుస ఓటములతో కుదేలైన పార్టీకి తిరిగి పునర్వైభవం వస్తుందని పలువురు యువ, సీనియర్ నాయకులు ఆశాభావం వ్యక్తంచేశారు. బీజేపీ విమర్శలను తిప్పికొడుతూ.. ప్రజాస్వామ్యంపై నమ్మకంలేక ఓటింగ్ మెషీన్లను నమ్ముకునే వారు తమకు ప్రజాస్వామ్యం గురించి చెప్పటం పెద్దజోక్ అని గులాం నబీ ఆజాద్ ఎద్దేవా చేశారు. ‘పిడీ’కరణ్ పూర్తయింది: బీజేపీ కాంగ్రెస్‌లో పిడీకరణ్ (వారసుడి ప్రకటన) పూర్తయిందని బీజేపీ విమర్శించింది. ఇటీవల రాహుల్ తన కుక్క ‘పిడీ’యే తన తరపున ట్వీట్లు చేస్తుందని చెప్పిన నేపథ్యంలో.. ఆ కుక్క పేరును ప్రస్తావిస్తూ ‘పిడీకరణ్’ పదాన్ని ప్రయోగించింది. ‘తరచూ విఫలమవుతు న్నా.. ఓ వ్యక్తిని పార్టీ ఉన్నత పదవికి ప్రతిపాదించటం ఎక్కడా జరగదు’ అని పేర్కొంది. -
హెచ్‌సీఏ ఎన్నికలు ప్రశాంతం
కోర్టు ఉత్తర్వుల తర్వాతే ఫలితాల వెల్లడి సాక్షి, హైదరాబాద్: నోటిఫికేషన్ వెలువడిన నాటినుంచి అనూహ్య పరిణామాలతో ఆసక్తి రేపిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికలు మంగళవారం ముగిశాయి. ఇరు వర్గాల మధ్య వాదవివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది ఎదురు కావచ్చని భావించినా... చివరకు ఎలాంటి నిరసన, సమస్య లేకుండా సజావుగా ఎన్నికలు జరిగాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ఆరు పదవుల కోసం మొత్తం 19 మంది పోటీ పడ్డారు. మొత్తం ఓటర్ల సంఖ్య 216 కాగా, ఎన్నికల్లో 207 ఓట్లు పోలయ్యాయి. రిటర్నింగ్ అధికారి కె.రాజీవ్ రెడ్డి ఈ ఎన్నికలను పర్యవేక్షించారు. హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద్, విద్యుత్ జైసింహ మధ్య పోటీ నెలకొంది. కార్యదర్శి స్థానానికి శేష్ నారాయణ్ మాత్రమే పోటీ పడ్డారు. ఉపాధ్యక్ష పదవికి అనిల్ కుమార్, ఇమ్రాన్ మెహమూద్... సంయుక్త కార్యదర్శి స్థానానికి వంకా ప్రతాప్, అజ్మల్ అసద్ బరిలో నిలిచారు. అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు సిద్ధమైన భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ నామినేషన్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ ఎన్నికలు నిర్వహించగా, ఫలితాలను మాత్రం ప్రకటించరాదంటూ హైకోర్టు గత వారం ఆదేశించింది. దాంతో ప్రస్తుతానికి బ్యాలెట్ బాక్స్‌లను ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాతే ఫలితాలు వెల్లడిస్తారు. మరోవైపు ఈ ఎన్నికలు మొత్తం లోధా కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా జరిగాయంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. అందువల్ల నేడు ఎన్నికల చెల్లుబాటుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తన నామినేషన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అజహరుద్దీన్ మంగళవారం దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది.


