breaking news
president wife
-
అతని ఫౌజీ సాజిదా
ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భర్త, మాల్దీవుల అధ్యక్షుడు మొహహ్మద్ ముయిజ్జుతో కలిసి మన దేశంలో అడుగుపెట్టిన సాజిదాకు ‘బెంగళూరు డేస్’ గుర్తుకొచ్చి ఉంటాయి. ఆశ్చర్యంగా ఉందా! అవును. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా బెంగళూరులో డిగ్రీ చేసింది. ఇక్కడి నుంచి వెళ్లిన తరువాత ముయిజ్జుతో వివాహం అయింది. ‘ఆమె అతడి అదృష్టం’ అనే మాట ఎలా ఉన్నా ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది’ అని మరోసారి గట్టిగా చెప్పడానికి బలమైన ఉదాహరణ సాజిదా మొహమ్మద్....మాల్దీవుల రాజధాని మాలేలో పుట్టింది సాజిదా. తండ్రి షేక్ మహ్మద్ ఇబ్రహీం ప్రఖ్యాత పండితుడు. రాజకీయ, సామాజిక విషయాలపై మొదటి నుంచి ఆసక్తి ఉన్న సాజిదా రకరకాల స్వచ్ఛందసంస్థలతో కలిసి పనిచేసింది. సాజిదా స్వేచ్ఛకు తల్లిదండ్రులు ఎప్పుడూ ఆడ్డు పడలేదు.బెంగళూరులో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన సాజిదా యూకేలోని లీడ్స్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. మాల్దీవుల సివిల్ సర్వీస్ కమిషన్‌లో సివిల్ సర్వెంట్‌గా పనిచేసింది. యూనిసెఫ్‌తో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. పిల్లల ఆరోగ్యం నుంచి సృజనాత్మక ప్రతిభను పెం΄÷ందించడం వరకు ఎన్నో కార్యక్రమాలలో భాగం అవుతోంది. పాలస్తీనాకు సంఘీభావం తెలిపే క్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా నిధుల సమీకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ‘5 మిలియన్ ట్రీ ప్రాజెక్ట్’ ను లాంచ్ చేసింది. తలసీమియా పేషెంట్లను దృష్టిలో పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు అందరికీ అందుబాటులో ఉండే తలసీమియా చికిత్సపై దృష్టి పెట్టింది.సాజిదా ప్రసంగాలలోని వాడి, వేడి ఏమిటో 2023 అధ్యక్ష ఎన్నిక సమయంలో లోకానికి తెలిసింది. తన అద్భుతమైన ప్రసంగాలతో శ్రోతలను ఆకట్టుకునేది. భర్త విజయానికి ఆమె ప్రసంగాలు ఒక కారణంగా చెప్పవచ్చు.మాల్దీవులలో సైన్స్ రంగంలో మహిళలను, బాలికలను ్ర΄ోత్సహించడానికి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటలైజేషన్ రంగాలలో మహిళల సంఖ్యను పెంచడానికి దేశ ప్రథమ మహిళగా ఎంతో కృషి చేస్తోంది సాజిదా.‘లింగ వివక్ష లేకుండా సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు ఉండాలి’ అనే విషయాన్ని గట్టిగా చెబుతుంది.‘ఇవ్వాళ ఆలోచించి రేపు మాట్లాడాలి’ అనేది ఆంగ్ల సామెత.తాను మాట్లాడబోయే అంశాలను ఇంట్లో భార్యతో పంచుకోవడం మాల్దీవుల అధ్యక్షుడు మొహహ్మద్ ముయిజ్జుకు అలవాటు. తన ఆలోచనలను సాజిదాతో పంచుకోవడమే కాదు ఆమె సలహాలు తీసుకుంటాడు. ఆ ఇంట్లో తమ ముగ్గురు పిల్లలు యాస్మిన్, ఉమైర్, జాయెద్‌ల గురించి కుటుంబ విషయాలను ఎంత సహజంగా మాట్లాడుకుంటారో జెండర్ ఈక్వాలిటీ నుంచి జీరో వేస్ట్ప్రాజెక్ట్ల వరకు ఎన్నో సామాజిక విషయాలను అంతే సహజంగా మాట్లాడుకుంటారు.‘మా ఆలోచనలు ఎప్పుడు ఒకేరకంగా ఉంటాయి’ అని భార్య గురించి మురిసి΄ోతుంటాడు డా. మొహమ్మద్ ముయిజ్జు. -
ప్రధాని సతీమణి సైన్యంలో శిక్షణ
చేతిలో తుపాకీ ఉంటే ముఖం మీద నవ్వు ఉంటుందా?! యానా హకోబియాన్ అంతే. దేశంలో శాంతి పావురం. సరిహద్దుల్లో సమర శంఖం. దేశ ప్రధాని సతీమణి ఆమె! నలుగురు పిల్లల తల్లి. రాబోతున్న యుద్ధం కోసం... సైన్యంలో చేరారు. శిక్షణ తీసుకుంటున్నారు. ముఖం మీది నవ్వును చూడకండి. చేతిలోని తుపాకీని చూడండి. ఇప్పుడేమనిపిస్తోంది?! భారత్ చైనాల సరిహద్దులో పరిస్థితి ఇప్పుడెంత ఉద్రిక్తంగా ఉందో ఆర్మీనియా, అజర్బైజాన్ల మధ్య అంతకు మంచిన ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. నెల రోజులుగా ఆ రెండు దేశాలు పరస్పరం కాల్పులు జరుపుకుంటున్నాయి. సరిహద్దు ప్రాంతం అయిన నగోర్నో–కరాబఖ్ కోసం వాళ్ల యుద్ధం. అవును, యుద్ధమే! ‘‘వెరీ సీరియస్, ఆర్మీనియన్లంతా ఆయుధాలు తియ్యవలసినంత సీరియస్’’ అని ఆర్మీనియా ప్రధాని నికోల్ పషిన్యాన్ తాజాగా ప్రకటన చేశారు! మూడు దశాబ్దాల క్రితం సోవియట్ యూనియన్ పతనం అవడంతో సొంత దేశాలుగా అవతరించిన రెండు ముక్కలు.. ఆర్మీనియా, అజర్బైజాన్. ఆర్మీనియా ప్రస్తుతం ఆసియాలో ఉంది. అజర్బైజాన్ కాస్పియన్ సముద్రానికి పశ్చిమాన తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియాల మధ్య పరచుకుని ఉంది. ఆర్మీనియా, అజర్బైజాన్ ఎక్కడ ఉన్నప్పటికీ రెండూ పక్కన పక్కన ఉన్నాయి. పశ్చిమాన ఆర్మీనియా, తూర్పున అజర్బైజాన్. వివాద స్థలం నగోర్నో–కరాబఖ్ అజర్బైజాన్ వైపు ఉన్నప్పటికీ అక్కడంతా ఆర్మీనియన్లే. అందుకే ఆ ప్రాంతం తమది అని ముప్పైయేళ్లుగా ఆర్మీనియా పోరాడుతోంది. ఎవరు ఉన్నారని కాదు, ఎక్కడ ఉన్నారు అనేది ముఖ్యం అని అజర్బైజాన్. సుమారు 30 వేల మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయిన 1990 ల నాటి యుద్ధాలలో అజర్బైజాన్ రాజధాని బకు నుంచి కరాబఖ్ ప్రావిన్స్ విడిపోయింది. దానిని నిలుపుకునేందుకు ఇప్పుడు అజర్బైజాన్ అంతిమ పోరాటానికి సిద్ధం అయింది. ∙∙ ‘వెరీ సీరియస్’ అని ఆర్మీనియా ప్రధాని ప్రకటించాక మొదట యుద్ధ రంగంలోకి దుమికింది ఆయన భార్య యానా హకోబియాన్! ఫ్రంట్ లైన్ సైనికురాలిగా శిక్షణ తీసుకునేందుకు ఆమె మిలటరీలో చేరారు. యానా వయసు 42 సంవత్సరాలు. నలుగురు పిల్లల తల్లి. దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ‘ఆర్మీనియన్ టైమ్స్’ పత్రికకు ఎడిటర్–ఇన్–చీఫ్. మంగళవారం మిలటరీ ట్రైనింగ్‌కి వెళుతూ.. ‘‘మన సైన్యంతో కలిసి శత్రువుతో యుద్ధం చేయడానికి కొద్ది రోజుల్లోనే సరిహద్దులకు వెళ్లబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ ఆత్మగౌరవాన్ని, దేశ భూభాగాన్ని వదులుకునేది లేదు’’ అని ట్వీట్ పెట్టారు. ఇది ఆమెకు రెండవ విడత శిక్షణ. గత ఆగస్టులో వారం రోజులు యుద్ధ శిక్షణ పొందారు. ఆమెతో పాటు కరాబఖ్ ప్రాంతానికి చెందిన కొంతమంది ఆర్మీనియా యువతులు కూడా శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు పదిహేను మంది మహిళలతో కలిసి ఒక ‘డిటాచ్మెంట్’గా (విడి సేనాదళం) యానా ప్రత్యేక శిక్షణ అందుకుంటున్నారు. గత సెప్టెంబర్ 27 న రెండు దేశాల మధ్య జరిగిన భీకర పోరులో వందలాది మంది మరణించారు. 1994 నుంచీ కరాబఖ్ కోసం ఆర్మీనియా చేస్తున్న ప్రతి ప్రయత్నం విఫలం అవుతూ వస్తోంది. ఏది ఏమైనా నగోర్నో–కరాబఖ్ చేజిక్కించుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకు తన వంతుగా ఇప్పుడు ఆర్మీనియా ప్రధాని సతీమణి యానా కూడా యుద్ధంలోకి దిగారు. ఆమె ఒక్కరే కాదు. ఆ ఇంట్లోంచి మరొకరు కూడా. ఆమె పెద్ద కొడుకు అషాట్ (20). మిగతా ముగ్గురు కూతుళ్లు. వాళ్లు చిన్నపిల్లలు. చదువుల్లో ఉన్నారు. యానా హకోబియాన్ ప్రధాని భార్యే అయినప్పటికీ ‘ప్రథమ మహిళ’గా గౌరవం పొందుతున్నారు. సాధారణంగా దేశాధ్యక్షుల భార్యలకు ప్రథమ మహిళలన్న హోదా ఉంటుంది. ఆర్మీనియాకు అధ్యక్షుడు ఉన్నప్పటికీ, అనధికారికంగా యానాకు మాత్రమే ‘ఫస్ట్ లేడీ ఆఫ్ ఆర్మీనియా’ అనే గుర్తింపు లభించింది! తొలి నుంచీ పాలన నిర్ణయాలను ఆమె ప్రభావితం చేస్తుండటమే అందుకు కారణం కావచ్చు. ఆర్మీనియా రాజధాని పట్టణం ఎరెవాన్లోని ‘ఎరవాన్ స్టేట్ యూనివర్సిటీ’ నుంచి డిగ్రీ చేశారు యానా. తర్వాత జర్నలిస్టుగా స్థిరపడ్డారు. కాలేజ్‌లో పరిచయం అయిన నికోల్‌ని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఒక వేడుకగా కాక, ఒక మామూలు కార్యక్రమంలా మాత్రమే జరిగింది. 2012లోనే ఒక పత్రికకు ఎడిటర్‌గా చేరారు యానా. దేశ రాజకీయాలను మలుపు తిప్పడానికి ఆ పత్రికను ఆయుధంగా మలచుకున్నారు. 2018 ‘ఆర్మీనియన్ రివల్యూషన్’లో కీలక పాత్ర పోషించారు. నాటి అధ్యక్షుడు వరుసగా మూడోసారి పదవిలోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన శాంతియుతమైన ఆ ప్రజా పోరాటం.. ‘వెల్వెట్ రివల్యూషన్’గా (అహింసా విప్లవం) పేరు పొందింది. యానానే పరోక్షంగా ఆ తిరుగుబాటుకు వ్యూహరచన చేశారు. ఆ పరిణామం తర్వాత అదే ఏడాది ఆమె భర్త ప్రధాని అయ్యారు. 2018 ఆగస్టులో అమెరికన్ పత్రిక ‘ఉమెన్స్ వరల్డ్’ నిర్వహించిన సర్వేలో ‘ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫస్ట్ లేడీ’గా యానా ఎంపిక అయ్యారు. ఇక ఆమె నిరంతరం నడిపించే సేవా కార్యక్రమాలు ఆమె అంతస్సౌందర్యానికి నిదర్శనాలు. -
పుతిన్.. మీరు ఇంత పని చేస్తారా?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటే చైనాలో ఇప్పుడు చాలామంది మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భార్య చలికి వణికిపోతుంటే.. పుతిన్ చొరవగా ముందుకెళ్లి దగ్గరుండి ఆమెకు శాలువా కప్పి, అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో జిన్‌పింగ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కబుర్లు చెబుతూ ఉన్నారు. అంతే.. చైనాలో ఒక్కసారిగా దీనిమీద జోకులు మొదలైపోయాయి. ఇటీవలే విడాకులు తీసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ అంటే చైనాలో చాలామంది మహిళలకు ఆరాధనా భావం ఉంది. దాంతో తాజా సంఘటన పట్ల చైనా ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో తొలుత ఆన్లైన్లో వచ్చింది గానీ, ఆ తర్వాత చైనా ఇంటర్నెట్ నుంచి దాన్ని తీసేశారు. చైనా అధ్యక్షుడి భార్య పెంగ్ లియువాన్ అక్కడ ప్రముఖ జానపద గాయని. ఆమెకు భర్త కంటే ఎక్కువ ప్రజాదరణ కూడా ఉంది. ఇంతకుముందు అధ్యక్షుల భార్యల కంటే ఈమె ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంటారు. విదేశీ పర్యటనల్లో కూడా ఆమెకు ఆకర్షణ బాగుంటుంది. అయితే.. రష్యాలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. అక్కడ బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు గౌరవం ఇవ్వడం పురుషులకు సర్వసాధారణం. మహిళలకు సాయం చేయడానికి అవసరమైతే తమ కోట్లను తీసి ఇవ్వడం కూడా మామూలేనని చెబుతున్నారు. చైనా వాళ్లకు మాత్రం ఇలాంటి అలవాట్లు లేకపోవడం వల్లే ఇలా అపార్థం చేసుకుని ఉంటారంటున్నారు.