breaking news
Premgi Amaren
-
తండ్రి కాబోతున్న కమెడియన్.. భార్యకు సీమంతం (ఫొటోలు)
-
46 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న స్టార్ కమెడియన్
సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెళ్లి విషయంలో ఆలస్యం చేస్తుంటారు. కొందరు పూర్తిగా చేసుకోకుండా కూడా ఉండిపోతుంటారు. అయితే తమిళ స్టార్ కమెడియన్ ప్రేమ్ జీ మాత్రం 45 ఏళ్ల వయసులో గతేడాది సింపుల్‌గా వివాహం చేసుకున్నాడు. ఇందు అనే అమ్మాయిని ప్రేమించి ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఏడాది పూర్తయిందో లేదో శుభవార్త చెప్పేశాడు.(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)గతేడాది జూన్‌లో ఇందుని పెళ్లి చేసుకున్న కమెడియన్ ప్రేమ్ జీ.. ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు. తాజాగా ఇందుకి సీమంతం చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు ఇందు-ప్రేమ్ జీ దంపతులకు తోటీ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.ప్రేమ్‌జీ విషయానికొస్తే.. ఇతడు ప్రముఖ సంగీత దర్శకుడు గంగై అమరన్ కుమారుడు. తండ్రిలానే తొలుత సంగీత రంగంలోకి వచ్చాడు. యువన్ శంకర్ రాజా దగ్గర కెరీర్ మొదలుపెట్టాడు. ప్లే బ్యాక్ సింగర్‌గా ర్యాప్ సాంగ్స్ పాడాడు. కానీ 2006లో వల్లవన్ మూవీతో నటుడిగా మారాడు. ఇతడి సోదరుడు, డైరెక్టర్ వెంకట్ ప్రభు తీసిన 'చెన్నై 600028' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో పాటు కమెడియన్‌గా ప్రేమ్‌జీకి మంచి క్రేజ్ తీసుకొచ్చింది.(ఇదీ చదవండి: శివకార్తికేయన్ 'మదరాసి' సినిమా రివ్యూ) -
ఆయన తప్పకుండా సీఎం అవుతారు: ది గోట్ నటుడు కామెంట్స్
కోలీవుడ్ నటుడు ప్రేమ్గీ అమరేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయ్ మూవీ ది గోట్ రిలీజ్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే 2026 ఎన్నికల్లో దళపతి విజయ్ తమిళనాడు సీఎం అవుతారని అమరేన్ జోస్యం చెప్పారు. నా ఓటు కూడా విజయ్‌కే వేస్తానని.. తప్పకుండా 2026లో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని హామీ ఇస్తున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.కాగా.. దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)'ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రేమ్గీ స్నేహాకు సోదరుని పాత్రలో నటించినట్లు ఆయన తెలిపారు. తనకు తలైవా, సూపర్‌స్టార్ రజినీకాంత్ అంటే విపరీతమైన అభిమానం అని వెల్లడించారు. అజిత్, విజయ్లంటే అమితమైన ప్రేమ అని.. కానీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సూపర్ స్టార్ మాత్రమేనన్నారు.కాగా.. 'గోట్' చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అయితే విజయ్ ఇప్పటికే తమిళగ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2026లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
గుడిలో కమెడియన్ పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
ప్రముఖ తమిళ దర్శకుడు గంగై అమరన్ రెండో కుమారుడు, నటుడు ప్రేమ్‌జీ 45 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కాడు. తిరుత్తణి మురుగన్ సాక్షిగా తన ప్రేమికురాలు ఇందు మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆదివారం (జూన్ 9న) నిరాడంబరంగా జరిగిన వివాహ వేడుకల్లో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా ప్రేమ్‌జీ.. సేలం నగరానికి చెందిన బ్యాంకు ఉద్యోగి ఇందును కొన్నేళ్లగా ప్రేమిస్తూ వచ్చాడు. గుడిలో సింపుల్‌గా పెళ్లివీరి ప్రేమకు ఇరుకుటుంబాలు పచ్చజెండా ఊపాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు తమిళనాడు తిరువళ్లూరులోని తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి సాక్షిగా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు సినీ తారలు రావడంతో తిరుత్తణి ఆలయంలో సందడి నెలకొంది. వారిని చూసేందుకు, సెల్పీ దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. గంగై అమవరన్, అతడి పెద్ద కుమారుడు, సినీ దర్శకుడు వెంకట్‌ప్రభు సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. కమెడియన్ ప్రేమ్‌జీ పెళ్లి ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపీటలపై ప్రియురాలికి ముద్దుతన ప్రేమికురాలు జీవిత భాగస్వామి కావడంతో ప్రేమ్‌జీ పెళ్లిపీటలపైనే ఇందును ముద్దాడి తన ఆనందాన్ని పంచుకున్నాడు. అనంతరం నూతన దంపతులు సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులు పొందారు. వివాహ వేడుకల్లో సినీ నటులు శివ, జయ్, వైభవ్, సంతాన భారతి, కార్తీక్‌రాజ, సంగీత, గాయకులు ఎస్పీబీ. చరణ్, క్రిష్ సహా ప్రముఖులు పాల్గొన్నారు.చదవండి: కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న నిమిషా సజయన్.. నిజమేనా? -
Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్ (ఫోటోలు)