
సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెళ్లి విషయంలో ఆలస్యం చేస్తుంటారు. కొందరు పూర్తిగా చేసుకోకుండా కూడా ఉండిపోతుంటారు. అయితే తమిళ స్టార్ కమెడియన్ ప్రేమ్ జీ మాత్రం 45 ఏళ్ల వయసులో గతేడాది సింపుల్‌గా వివాహం చేసుకున్నాడు. ఇందు అనే అమ్మాయిని ప్రేమించి ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఏడాది పూర్తయిందో లేదో శుభవార్త చెప్పేశాడు.
(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)
గతేడాది జూన్‍లో ఇందుని పెళ్లి చేసుకున్న కమెడియన్ ప్రేమ్ జీ.. ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు. తాజాగా ఇందుకి సీమంతం చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు ఇందు-ప్రేమ్ జీ దంపతులకు తోటీ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ప్రేమ్‌జీ విషయానికొస్తే.. ఇతడు ప్రముఖ సంగీత దర్శకుడు గంగై అమరన్ కుమారుడు. తండ్రిలానే తొలుత సంగీత రంగంలోకి వచ్చాడు. యువన్ శంకర్ రాజా దగ్గర కెరీర్ మొదలుపెట్టాడు. ప్లే బ్యాక్ సింగర్‌గా ర్యాప్ సాంగ్స్ పాడాడు. కానీ 2006లో వల్లవన్ మూవీతో నటుడిగా మారాడు. ఇతడి సోదరుడు, డైరెక్టర్ వెంకట్ ప్రభు తీసిన 'చెన్నై 600028' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో పాటు కమెడియన్‌గా ప్రేమ్‌జీకి మంచి క్రేజ్ తీసుకొచ్చింది.
(ఇదీ చదవండి: శివకార్తికేయన్ 'మదరాసి' సినిమా రివ్యూ)
