
ఈ వీకెండ్ థియేటర్లలోకి ఘాటీ, మదరాసి, లిటిల్ హార్ట్స్ సినిమాలు వచ్చాయి. వీటిలో లిటిల్ హార్ట్స్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు ఓటీటీల్లోనూ 20కి పైగా మూవీస్ వచ్చాయి. అయితే ఓ మూవీ మాత్రం థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల్లోనే స్ట్రీమింగ్‌లోకి రావడం విశేషం. రొమాంటిక్ కామెడీ కథతో తీసిన ఈ చిత్రం సంగతేంటి? ఎందులో అందుబాటులోకి వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: శివకార్తికేయన్ 'మదరాసి' సినిమా రివ్యూ)
రాజు జయమోహన్, ఆద్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ సినిమ 'బన్ బటర్ జామ్'. ప్రేమ, పెళ్లి, స్నేహం అనే కాన్సెప్ట్‌తో తీశారు. 'ప్రేమలో ఓడిపోతే అక్కడే ఆగిపోవాలా? తిరిగి లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి?' అనే పాయింట్ బాగా చెప్పారు. అలానే స్నేహం, నిజమైన ప్రేమ మధ్య తేడా చూపించిన విధానం కూడా బాగుంది. జూలై 18న ఈ చిత్రం తమిళంలో రిలీజ్ కాగా దాదాపు నెల తర్వాత అంటే ఆగస్టు 22న తెలుగులో థియేటర్లలో రిలీజ్ చేశారు.
స్టార్స్ లేకపోవడం, ప్రచారం చేయకపోవడం వల్ల ఈ సినిమా అనేది ఒకటి తెలుగులో థియేటర్లలో రిలీజైందని విషయం కూడా ప్రేక్షకులకు రీచ్ కాలేదు. ఇప్పుడు రెండు వారాలు తిరిగేసరికల్లా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. 'బన్ బటర్ జామ్' ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.
(ఇదీ చదవండి: ‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ)
'బన్ బటర్ జామ్' విషయానికొస్తే.. చంద్రు (రాజు జయమోహన్), మధుమిత (ఆద్య ప్రసాద్) ఇంటర్ పూర్తి చేస్తారు. వీళ్ల తల్లిదండ్రులు ఓ పెళ్లిలో కలిసి క్లోజ్ అవుతారు. ప్రస్తుత జనరేషన్‍లో ప్రేమ, అరేంజ్డ్ పెళ్లిళ్లు నిలబడట్లేదని మాట్లాడుకున్న వీళ్లు ఓ ప్లాన్ వేస్తారు. ఈ క్రమంలోనే చంద్రు పక్కింట్లో మధుమిత కుటుంబం దిగుతుంది. ఇంజినీరింగ్ చేరిన చంద్రు.. నందిని(భవ్య త్రిఖ)తో ప్రేమలో పడతాడు.
నందినిని చంద్రు స్నేహితుడు శ్రీనివాస్ (మైఖేల్ తంగదురై) కూడా ప్రేమిస్తుంటాడు. మరోవైపు మధుమిత.. ఆకాష్ (వీజే పప్పు) అనే కుర్రాడిని ప్రేమిస్తుంది. ఒకరంటే ఒకరు పడని చందు, మధుమితలను కలిపేందుకు వాళ్ల తల్లిదండ్రులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? చివరకు ఎవరి ప్రేమ సుఖాంతమైంది అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: అనుష్క శెట్టి ‘ఘాటి’ మూవీ రివ్యూ)
