‘అఖండ 2’ విడుదల వాయిదా పడటంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే, ఎట్టకేలకు చిత్ర నిర్మాణ సంస్థ అప్‌డేట్ ఇచ్చింది. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మరోసారి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. అఖండ2 విడుదల విషయంలో తాము చాలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కానీ, విడుదల సాధ్యపడలేదన్నారు. సినిమా కోసం ఆసక్తిగా ఎదరుచూస్తున్న ప్రేక్షకులకు మా క్షమాపణలు. ఇలాంటి సదర్భంలో మాకు అండగా నిలిచిన బాలకృష్ణ, బోయపాటి శ్రీనుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. తప్పకుండా తిరిగొస్తాం.' అంటూ చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ క్లారిటీ ఇచ్చింది.
శుక్రవారం రాత్రి వరకు అఖండ2 విడుదల గురించి చర్చలు ఉన్నాయి. ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్మాత దిల్‌రాజు, డి.సురేశ్‌బాబు కూడా ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ఏరోస్ సంస్థతో చర్చలు జరిపారు. అయితే, ఈ విషయంపై శనివారం క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. వివాదం పూర్తిగా పరిష్కారమయిన తర్వాత విడుదల ఎప్పుడు చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటిస్తారు. బాక్సాఫీస్ వద్ద వచ్చే వారం చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో అఖండ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 19న విడుదల కావచ్చనే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. లేదంటే వచ్చే వారమే విడుదల చేసే ఛాన్స్ కూడా వుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అఖండ-2.. భారీ బడ్జెట్‌తో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కావల్సి ఉంది. కానీ, ఈ చిత్ర నిర్మాతలు తమకు బకాయిలు చెల్లించాలంటూ ఏరోస్ సంస్థ మద్రాస్ కోర్టును ఆశ్రయించింది. దీంతో అఖండ-2 విడుదల ఆపాలంటూ న్యాయస్థానం స్టే ఇచ్చింది.


