breaking news
pre matric scholarship
-
ప్రీమెట్రిక్ ఉపకార దరఖాస్తులకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ప్రీమెట్రిక్ విద్యార్థుల ఉపకార దరఖాస్తు ప్రక్రియలో బీసీ విద్యార్థులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్న సంక్షేమ శాఖలు... బీసీ విద్యార్థులకు మాత్రం దరఖాస్తు ప్రక్రియను నిలిపివేశాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడం, కనీసం గడువు తేదీని సైతం ఖరారు చేయకుండా అర్ధంతరంగా దరఖాస్తు ప్రక్రియను ఆపేయడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి... ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. విద్యార్థులకు దరఖాస్తుపై పెద్దగా అవగాహన ఉండదనే భావనతో పాఠశాల యాజమాన్యాలు.. టీచర్లకు సూచనలిస్తూ ఆయా పిల్లల దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఈ–పాస్ వెబ్సైట్లో ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ ఆప్షన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ దరఖాస్తుకు ఎలాంటి గడువు విధించలేదు. పోస్టుమెట్రిక్ విద్యార్థులకు మార్చి 31 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించగా... ప్రీమెట్రిక్ విద్యార్థులకు సైతం ఆమేరకు అవకాశం కల్పించనున్నట్లు అధికారులు మౌఖికంగా చెప్పుకొచ్చారు. దీంతో సంబంధిత పత్రాలు సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అలా వివరాలు సిద్ధం చేసుకున్న విద్యార్థుల దరఖాస్తులను పాఠశాల యాజమాన్యాలు, టీచర్లు వీలుచిక్కినప్పుడు ఆన్లైన్లో సమర్పిస్తున్నారు. కొన్నిచోట్ల సమీప మీ సేవ కేంద్రాల్లో కూడా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకునేందుకు విద్యార్థులకు సమయం పడుతుండటంతో సిద్ధం చేసుకున్న విద్యార్థుల దరఖాస్తులను ఎప్పటికప్పుడు సమర్పించారు. అయితే, ఇంకా పత్రాలు సిద్ధం చేసుకోని వారి దరఖాస్తు ప్రక్రియ పెండింగ్లో ఉండిపోయింది. ఇంతలో బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తుల స్వీకరణను వారం రోజుల క్రితం నిలిపివేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల దరఖాస్తులు కొనసాగుతున్నప్పటికీ... బీసీ విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియ నిలిపివేయడంపై బీసీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యార్థులు మూడు రోజులుగా బీసీ సంక్షేమ శాఖ క్షేత్రస్థాయి కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దరఖాస్తుకు అవకాశం కల్పించాలని వినతులు సమర్పిస్తున్నారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారులకు విన్నవిస్తామని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు చెప్పారు. -
మైనారిటీ ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం పంపిణీ చేసే ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఆన్లైన్లో మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. ఈ నెల 25వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ అహ్మద్నదీమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉర్దూ వర్సిటీ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని దూరవిద్యా కేంద్రం విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల20 ఆఖరు తేదీగా నిర్ణయించారు. -
11వరకు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ ఫీజు గడువు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 4 నుంచి నిర్వహించే ఇంటర్మీడియెట్, ఎస్సెస్సీ పరీక్షలకు హాజరుకావాలనుకునే వారు ఇప్పటివరకు ఫీజు చెల్లించకపోతే.. వారు తత్కాల్ కింద ఈనెల 11వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లకు 10న తుది గడువు కేంద్ర ప్రభుత్వ ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ పొందేందుకు రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులు ఈనెల 10లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనారిటీ ఆర్థిక కార్పొరేషన్ వెబ్సైట్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


