breaking news
postgraduate course
-
అడ్మిషన్స్, జాబ్స్ అలర్ట్స్.. గేట్-2015
ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/సైన్స్ విభాగాల్లో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి, ప్రభుత్వ స్కాలర్షిప్స్/అసిస్టెంట్షిప్స్కు అర్హత కోసం గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2015కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. అర్హతలు: బీఈ/బీటెక్/బీఆర్క్/బీఫార్మసీ/బీఎస్లో ఉత్తీర్ణత. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 1 చివరి తేది: అక్టోబర్ 1 పరీక్ష తేదిలు: 2015 జనవరి 31, ఫిబ్రవరి 1, 7 ,8, 14 వెబ్సైట్: http://gate.iitk.ac.in/ జేఎన్టీయూ- హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ మస్సాచుసెట్స్(అమెరికా) కోర్సు: బీఎస్ అండ్ ఎంఎస్(గ్లోబల్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్) విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంటర్(ఎంపీసీ) ఉత్తీర్ణులై ఉండాలి. ఐఐటీ-జేఈఈ మెయిన్స్/ఎంసెట్-214లో అర్హత సాధించాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21 వెబ్సైట్: http://www.sriit.ac.in/ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా -మొహాలీ కోర్సు: ఎల్ఎల్ఎం; సీట్ల సంఖ్య: 15 అర్హతలు: ఇంటిగ్రేటెడ్ లా లేదా బీఏ, ఎల్ఎల్బీ ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21 వెబ్సైట్: www.armyinstituteoflaw.org/ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పోస్టులు: 1.ఇంజనీర్(సివిల్-గ్రేడ్ 2) 2.అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రేడ్ 1) అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఆగస్టు 9 వెబ్సైట్: www.hal-india.com నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పోస్టులు: కన్సల్టెంట్(సోషల్ ఆడిట్) అర్హతలు: సోషల్ సెన్సైస్లో పీజీ లేదా సివిల్/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో కనీసం మూడు నుంచి ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఇంగ్లిష్, హిందీలో పరిజ్ఞానం ఉండాలి. వయసు: 60 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21 వెబ్సైట్: www.nird.org.in బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ జనరల్ మేనేజర్ అర్హతలు: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ ఇంజనీరింగ్లో బీఈ/బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 50 ఏళ్లకు మించకూడదు. డిప్యూటీ జనరల్ మేనేజర్ అర్హతలు: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్లో బీఈ/బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 45 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 15 వెబ్సైట్: www.becil.com -
డీయూకు విదేశీ విద్యార్థుల క్యూ
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందుతోంది. వివిధ కోర్సుల కోసం విదేశీ విద్యార్థులుకూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది ఇప్పటిదాకా మొత్తం 2,098 మంది విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. అండర్గ్రాడ్యుయేట్ కోర్సుకే వీరిలో అత్యధిక శాతం మంది దరఖాస్తు చేసుకున్నారు. 1,259 మంది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు, 609 మంది నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని డీయూ ఫారిన్ రిజిస్ట్రీ విభాగం అధిపతి కౌర్ బస్రా వెల్లడించారు. వీరిలో టిబెటన్లు 475 మంది కాగా 237 మంది నేపాలీయులని ఆయన చెప్పారు. గత ఏడాది 248 మంది టిబెటన్లు, 222 మంది నేపాలీయులు దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. ‘ఇక దక్షిణ కొరియాకు చెందిన విద్యార్థులు సైతం డీయూలో వివిధ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు నగరానికి వచ్చారని బస్రా చెప్పారు. వారికి కొరియా రాయబార కార్యాలయం అవసరమైన వసతులు కల్పిస్తోందన్నారు. దీంతో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తడం లేదన్నారు. అయితే దేశంలోని వివిధ నగరాల నుంచి వచ్చిన విద్యార్థినులు సరైన వసతి దొరక్క నానాఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వారికి తగు వసతులు కల్పించేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. దక్షిణ కొరియాకు చెందిన 54 మంది విద్యార్థులు గత ఏడాది తమ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో చేరారన్నారు.