-
ప్రతి జిల్లాలో పీజీ వైద్య కళాశాల
జైపూర్: పోస్టు–గ్రాడ్యుయేట్(పీజీ) వైద్య విద్య కోసం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల లేదా విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వైద్య విద్య, ఆరోగ్య సేవలను అందించడం మధ్య అంతరం తగ్గుతోందని తెలిపారు. ఆయుర్వేదం, యోగాను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు గుర్తుచేశారు. దేశంలో గత ఆరేళ్లలో 170కిపైగా మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని, కొత్తగా మరో 100 కాలేజీల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గురువారం రాజస్తాన్‌లో నాలుగు నూతన వైద్య కళాశాలల నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ టెక్నాలజీ’ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైద్య వ్యవస్థను సమూలంగా మార్చడానికే ఎంసీఐ స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను తీసుకొచి్చనట్లు ఉద్ఘాటించారు. ఈ కమిషన్‌తో ఇప్పటికే సానుకూల ఫలితాలు వస్తున్నాయని వివరించారు. దేశంలో సంప్రదాయ, ఆధునిక వైద్యం నడుమ అంతరం ఉందని, దీన్ని తొలగించాలి్సన అవసరం ఉందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇందుకోసమే కొత్తగా నేషనల్ హెల్త్ పాలసీని తీసుకొచ్చినట్లు వివరించారు. ఎయిమ్స్ లేదా మెడికల్ కాలేజీలు.. వాటి నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా అన్ని మూలలకూ విస్తరింపజేయాలని సూచించారు. దేశంలో గతంలో కేవలం 6 ఎయిమ్స్‌లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 22కుపైగానే ఉన్నాయని పేర్కొన్నారు. 2014లో కేవలం 82,000 అండర్–గ్రాడ్యుయేట్, పోస్టు–గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 1.40 కోట్లకు చేరిందని వెల్లడించారు. చాలా మంది విద్యార్థులకు ఆంగ్ల భాష పెద్ద అవరోధంగా మారిందని, నూతన విద్యా విధానంలో భాగంగా భారతీయ భాషల్లోనూ వైద్య విద్యను అభ్యసించే వెలుసుబాటు లభిస్తోందని తెలిపారు. -
భార్య కూడా పొదుపు లాంటిదే బ్రదరూ!
పెళ్లి మీద ఉన్నన్ని జోకులు, పెళ్లి పైన ఉన్నంత ఆసక్తి మరెక్కడా, ఎవరికీ ఏ అంశంలోనూ ఉండవు. ఒకే విషయంపై పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు పెళ్లి విషయంలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ రెండింటికీ కారణం - ‘ఆమె’. అసలు పెళ్లంటే... మగాడు తన బ్యాచిలర్ డిగ్రీని పోగొట్టుకుని, భార్య తన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందడమే అంటుంటారు. కానీ, గమనిస్తే, ‘పొదుపు’ అంత మంచిది, అంత ఉపయోగకరమైనది - ‘భార్య’. ఈ విచిత్రమైన పోలిక... వెనక ఉన్న కథాకమామిషు! ఆమె తోడు మిక్కిలి ఆనందాన్నిస్తుంది. ఆమె ప్రేమ తన్మయత్వాన్నిస్తుంది, ఆమె అండ కొండంత బలాన్నిస్తుంది. పండుటాకుగా మారేకొద్దీ తాను బలంగా పట్టుకోలేననీ, తనను అంటిపెట్టుకునే వారే ఇప్పుడు అవసరమనీ, ఆ అండే ఆమె అనీ అనిపిస్తుంది. ఆమె తోడుకు మించిన ఆస్తే లేదనిపిస్తుంది. పొదుపు చేయడం ఓ యజ్ఞం. అందరూ చేయాలనుకుని, కొందరు ఆసక్తితో, ఇంకొందరు అవసరంతో, మరికొందరు అవగాహనతో చేసే పని. సరిగ్గా పెళ్లి కూడా అలాంటిదే. భార్యకు -పొదుపుకు అనేక పోలికలున్నాయి. మొదటి దశ పెళ్లయినప్పటి తొలినాళ్ల లాగే మొదలుపెట్టినప్పుడు పొదుపు చాలా ఆసక్తితో క్రమబద్ధంగా చేస్తాం. ఆర్థికంగా ఏ ఇబ్బందులూ లేనపుడే కదా సాధారణంగా పొదుపు మొదలుపెడతాం. కాబట్టి, నెలనెలా ఠంచనుగా పొదుపు ఖాతాలోకి డబ్బులు మళ్లిస్తాం. ప్రతి నెలా ఓ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఓ ఆరునెలలు గడిస్తేనే... ‘అబ్బో అప్పుడే ఆరునెలలు పొదుపు చేసేశానే’ అనుకుని సంబర పడతాం. పెళ్లయిన కొత్తలో దశ కూడా ఇంతే. ఆఫీసు నుంచి ఇంటికి త్వరగా వస్తాం. అడిగిందే తడవుగా అడిగినవన్నీ సమకూరుస్తాం. భార్యపై ఎక్కడ లేని ప్రేమాభిమానాలుంటాయి. ప్రతి నెలా ఎంతో కాలం కలిసి ఉన్నట్లు లేత జ్ఞాపకాలు తలచుకుంటూ సంబర పడిపోతాం. అలా, వేగంగా, హాయిగా జీవితం గడుస్తుంది. భార్యపై అపారమైన ప్రేమ ఉంటుంది. మధ్య దశ పొదుపు ఖాతాలోకి ఎంతో కాలం నుంచి డబ్బులు వేస్తూ ఉంటాం. మధ్యలో డబ్బు అవసరాలు పెరుగుతుంటాయి. పొదుపు ఆపలేం. నానా ఇబ్బందులు పడి పొదుపు చేయక తప్పదు. ఎన్నాళ్లింకా పొదుపు చేయాలని చిరాకు వస్తుంది. మధ్యలో ఆపేద్దామా అనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో వచ్చే లాభాలు గుర్తుకొస్తాయి. ఇప్పటికే ఎంతో కాలం నుంచి చేస్తుంటాం, ఇంకా ఎంతో కాలం చేయాల్సి ఉంది. దీంతో చచ్చీచెడీ ఆ పొదుపు కొనసాగిస్తాం. సరిగ్గా పెళ్లి పాతబడ్డాక... ప్రేమను రెండోస్థానంలోకి నెట్టేసి బాధ్యతలు మొదటి స్థానంలోకి వస్తాయి. ఆమె వల్లే కలిగే మేలు, దక్కే ప్రేమ కంటే కుటుంబ బాధ్యతలు నిరంతరం వెంటాడుతుంటాయి. ఈ పెళ్లీ వద్దు, పెళ్లామూ వద్దు ఈ కష్టాలూ వద్దనిపిస్తుంది. కాస్త భారంగా జీవితం నడుస్తుంటుంది. చివరి దశ క్రమం తప్పకుండా చేసిన పొదుపు ఖాతా అలా పెరిగి పెరిగి ఓ పెద్ద సొమ్ము జమ అవుతుంది. కష్టాలు పడితే పడ్డాం కానీ కష్టకాలంలో ఆదుకుంటోంది. అవసరానికి అక్కరకు వచ్చింది అనిపిస్తుంది. మన మీద మనకు ప్రశంస, అందివచ్చే సొమ్ముపై ఆశ తలెత్తుతాయి. ఇక అది చేతికి అందినప్పుడు ఆ ఆనందం చెప్పలేనిది. ఇక జీవితం విషయానికి వస్తే... వెనక్కు తిరిగి చూసుకుంటే ఆమె లాగా నిరంతరం ఎవరూ మన వెంట నడవలేదని గుర్తుకువస్తుంది. రోజురోజుకూ ఆమెపై ఆధారపడటం పెరుగుతూ వచ్చి ఆమె లేనిదే జీవితం లేదనిపిస్తుంది. ఆమె తోడు మిక్కిలి ఆనందాన్నిస్తుంది. ఆమె ప్రేమ తన్మయత్వాన్నిస్తుంది, ఆమె అండ కొండంత బలాన్నిస్తుంది. పండుటాకుగా మారేకొద్దీ తాను బలంగా పట్టుకోలేననీ, తనను అంటిపెట్టుకునే వారే ఇప్పుడు అవసరమనీ, ఆ అండే ఆమె అనీ అనిపిస్తుంది. ఆమె తోడుకు మించిన ఆస్తే లేదనిపిస్తుంది. భార్యను జీవిత భాగస్వామి అని ఊరకే అనలేదు. ఆమె భాగస్వామ్యం - ఆస్తులు, సుఖాల్లోనే కాదు కష్టాల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య బాధల్లో. అన్నింటిలో అండగా ఉండే భార్య ఎప్పటికీ భారం కాదు, బాధ్యత! అందుకే, అది సెవెన్ ఇయర్స్ ఇచ్ కాదు, సెవెంటీ ఇయర్స్ బ్యూటిఫుల్ లైఫ్!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement